Logo

ఆదికాండము అధ్యాయము 12 వచనము 20

నిర్గమకాండము 18:27 తరువాత మోషే తన మామను పంపివేయగా అతడు తన స్వదేశమునకు వెళ్లెను.

1సమూయేలు 29:6 కాబట్టి ఆకీషు దావీదును పిలిచి యెహోవా జీవము తోడు నీవు నిజముగా యథార్థపరుడవై యున్నావు; దండులో నీవు నాతోకూడ సంచరించుట నా దృష్టికి అనుకూలమే;నీవు నాయొద్దకు వచ్చిన దినమునుండి నేటి వరకు నీయందు ఏ దోషమును నాకు కనబడలేదుగాని సర్దారులు నీయందు ఇష్టములేక యున్నారు.

1సమూయేలు 29:7 ఫిలిష్తీయుల సర్దారుల దృష్టికి నీవు ప్రతికూలమైన దాని చేయకుండునట్లు నీవు తిరిగి నీ స్థలమునకు సుఖముగా వెళ్లుమని చెప్పగా

1సమూయేలు 29:8 దావీదు నేనేమి చేసితిని? నా యేలినవాడవగు రాజా, నీ శత్రువులతో యుద్ధము చేయుటకై నేను రాకుండునట్లు నీయొద్దకు వచ్చిన దినమునుండి నేటివరకు నీ దాసుడనై నాయందు తప్పేమి కనబడెనని ఆకీషు నడిగెను.

1సమూయేలు 29:9 అందుకు ఆకీషు దైవదూతవలె నీవు నా దృష్టికి కనబడుచున్నావని నేనెరుగుదును గాని ఫిలిష్తీయుల సర్దారులు ఇతడు మనతోకూడ యుద్ధమునకు రాకూడదని చెప్పుచున్నారు.

1సమూయేలు 29:10 కాబట్టి ఉదయమున నీవును నీతోకూడ వచ్చిన నీ యజమానుని సేవకులును త్వరగా లేవవలెను; ఉదయమున లేచి తెల్లవారగానే బయలుదేరి పోవలెనని దావీదునకు ఆజ్ఞ ఇచ్చెను.

1సమూయేలు 29:11 కావున దావీదును అతని జనులును ఉదయమున త్వరగా లేచి ఫిలిష్తీయుల దేశమునకు పోవలెనని ప్రయాణమైరి; ఫిలిష్తీయులు దండెత్తి యెజ్రెయేలునకు పోయిరి.

కీర్తనలు 105:14 నేనభిషేకించినవారిని ముట్టకూడదనియు నా ప్రవక్తలకు కీడుచేయకూడదనియు ఆయన ఆజ్ఞ ఇచ్చి

కీర్తనలు 105:15 ఆయన ఎవరినైనను వారికి హింస చేయనియ్యలేదు ఆయన వారికొరకు రాజులను గద్దించెను.

సామెతలు 21:1 యెహోవా చేతిలో రాజు హృదయము నీటి కాలువలవలె నున్నది. ఆయన తన చిత్తవృత్తి చొప్పున దాని త్రిప్పును.

ఆదికాండము 20:14 అబీమెలెకు గొఱ్ఱలను గొడ్లను దాసదాసీ జనులను రప్పించి, అబ్రాహాముకిచ్చి అతని భార్యయైన శారాను అతనికి తిరిగి అప్పగించెను.

రోమీయులకు 4:2 అబ్రాహాము క్రియల మూలముగా నీతిమంతుడని తీర్చబడినయెడల అతనికి అతిశయ కారణము కలుగును గాని అది దేవుని యెదుట కలుగదు.