Logo

ఆదికాండము అధ్యాయము 26 వచనము 5

ఆదికాండము 12:4 యెహోవా అతనితో చెప్పిన ప్రకారము అబ్రాము వెళ్లెను. లోతు అతనితో కూడ వెళ్లెను. అబ్రాము హారాను నుండి బయలుదేరినప్పుడు డెబ్బది యైదేండ్ల యీడు గలవాడు.

ఆదికాండము 17:23 అప్పుడు అబ్రాహాము తన కుమారుడైన ఇష్మాయేలును, తన యింట పుట్టిన వారినందరిని, తన వెండితో కొనబడిన వారినందరిని, అబ్రాహాము ఇంటి మనుష్యులలో ప్రతివానిని పట్టుకొని దేవుడు తనతో చెప్పిన ప్రకారము ఆ దినమందే వారి వారి గోప్యాంగచర్మమున సున్నతి చేసెను

ఆదికాండము 18:19 ఎట్లనగా యెహోవా అబ్రాహామునుగూర్చి చెప్పినది అతనికి కలుగజేయునట్లు తన తరువాత తన పిల్లలును తన యింటివారును నీతి న్యాయములు జరిగించుచు, యెహోవా మార్గమును గైకొనుటకు అతడు వారి కాజ్ఞాపించినట్లు నేనతని నెరిగియున్నాననెను.

ఆదికాండము 22:16 నీవు నీకు ఒక్కడే అయ్యున్న నీ కుమారుని ఇయ్య వెనుకతీయక యీ కార్యము చేసినందున

ఆదికాండము 22:18 మరియు నీవు నా మాట వినినందున భూలోకములోని జనములన్నియు నీ సంతానమువలన ఆశీర్వదించబడును నాతోడని ప్రమాణము చేసియున్నానని యెహోవా సెలవిచ్చెననెను.

కీర్తనలు 112:1 యెహోవాను స్తుతించుడి యెహోవాయందు భయభక్తులు గలవాడు ఆయన ఆజ్ఞలనుబట్టి అధికముగా ఆనందించువాడు ధన్యుడు.

కీర్తనలు 112:2 వాని సంతతివారు భూమిమీద బలవంతులగుదురు యథార్థవంతుల వంశపువారు దీవింపబడుదురు

కీర్తనలు 128:1 యెహోవాయందు భయభక్తులు కలిగి ఆయన త్రోవలయందు నడుచువారందరు ధన్యులు.

కీర్తనలు 128:2 నిశ్చయముగా నీవు నీచేతుల కష్టార్జితము ననుభవించెదవు నీవు ధన్యుడవు నీకు మేలు కలుగును.

కీర్తనలు 128:3 నీ లోగిట నీ భార్య ఫలించు ద్రాక్షావల్లివలె నుండును నీ భోజనపు బల్లచుట్టు నీ పిల్లలు ఒలీవ మొక్కలవలె నుందురు.

కీర్తనలు 128:4 యెహోవాయందు భయభక్తులు గలవాడు ఈలాగు ఆశీర్వదింపబడును.

కీర్తనలు 128:5 సీయోనులోనుండి యెహోవా నిన్ను ఆశీర్వదించును నీ జీవితకాలమంతయు యెరూషలేమునకు క్షేమము కలుగుట చూచెదవు

కీర్తనలు 128:6 నీ పిల్లల పిల్లలను నీవు చూచెదవు. ఇశ్రాయేలుమీద సమాధానముండును గాక.

మత్తయి 5:19 కాబట్టి యీ యాజ్ఞలలో మిగుల అల్పమైన యొకదానినైనను మీరి, మనుష్యులకు ఆలాగున చేయ బోధించువాడెవడో వాడు పరలోకరాజ్యములో మిగుల అల్పుడనబడును; అయితే వాటిని గైకొని బోధించువాడెవడో వాడు పరలోకరాజ్యములో గొప్పవాడనబడును.

మత్తయి 7:24 కాబట్టి యీ నా మాటలు విని వాటిచొప్పున చేయు ప్రతివాడును బండమీద తన యిల్లు కట్టుకొనిన బుద్ధిమంతుని పోలియుండును.

1కొరిందీయులకు 15:58 కాగా నా ప్రియ సహోదరులారా, మీ ప్రయాసము ప్రభువునందు వ్యర్థము కాదని యెరిగి, స్థిరులును, కదలనివారును, ప్రభువు కార్యాభివృద్ధియందు ఎప్పటికిని ఆసక్తులునై యుండుడి.

గలతీయులకు 5:6 యేసుక్రీస్తునందుండు వారికి సున్నతి పొందుటయందేమియు లేదు, పొందకపోవుటయందేమియు లేదు గాని ప్రేమవలన కార్యసాధకమగు విశ్వాసమే ప్రయోజనకరమగును.

హెబ్రీయులకు 11:8 అబ్రాహాము పిలువబడినప్పుడు విశ్వాసమునుబట్టి ఆ పిలుపునకు లోబడి, తాను స్వాస్థ్యముగా పొందనైయున్న ప్రదేశమునకు బయలువెళ్లెను. మరియు ఎక్కడికి వెళ్లవలెనో అది ఎరుగక బయలువెళ్లెను

యాకోబు 2:21 మన పితరుడైన అబ్రాహాము తన కుమారుడైన ఇస్సాకును బలిపీఠముమీద అర్పించినప్పుడు అతడు క్రియలవలన నీతిమంతుడని తీర్పు పొందలేదా?

ఆదికాండము 22:12 అప్పుడు ఆయన ఆ చిన్నవానిమీద చెయ్యి వేయకుము; అతనినేమియు చేయకుము; నీకు ఒక్కడైయున్న నీ కుమారుని నాకియ్య వెనుతీయలేదు గనుక నీవు దేవునికి భయపడువాడవని యిందువలన నాకు కనబడుచున్నదనెను

సంఖ్యాకాండము 9:23 యెహోవా మాటచొప్పున వారు తమ గుడారములను వేసికొనిరి; యెహోవా మాటచొప్పున వారు ప్రయాణముచేసిరి; మోషేద్వారా యెహోవా చెప్పిన మాటనుబట్టి యెహోవా ఆజ్ఞననుసరించి నడిచిరి.

1రాజులు 15:4 దావీదు హిత్తీయుడైన ఊరియా సంగతియందు తప్ప తన జీవిత దినములన్నియు యెహోవా దృష్టికి యథార్థముగా నడుచుకొనుచు, యెహోవా అతనికిచ్చిన ఆజ్ఞలలో దేని విషయమందును తప్పిపోకుండెను గనుక

2దినవృత్తాంతములు 13:11 వారు ఉదయాస్తమయములయందు యెహోవాకు దహనబలులు అర్పించుచు, సుగంధద్రవ్యములతో ధూపము వేయుచు, పవిత్రమైన బల్లమీద సన్నిధిరొట్టెలు ఉంచుచు, బంగారు దీపస్తంభమును ప్రమిదెలను ప్రతి సాయంత్రము ముట్టించుచు వచ్చుచున్నారు; మేము మా దేవుడైన యెహోవా యేర్పరచిన విధినిబట్టి సమస్తము జరిగించుచున్నాము గాని మీరు ఆయనను విసర్జించిన వారైతిరి.

కీర్తనలు 19:8 యెహోవా ఉపదేశములు నిర్దోషమైనవి, అవి హృదయమును సంతోషపరచును యెహోవా ఏర్పరచిన ధర్మము నిర్మలమైనది, అది కన్నులకు వెలుగిచ్చును.

యెహెజ్కేలు 18:21 అయితే దుష్టుడు తాను చేసిన పాపములన్నిటిని విడిచి, నా కట్టడలన్నిటిని అనుసరించి నీతిని అనుసరించి న్యాయము జరిగించినయెడల అతడు మరణమునొందడు, అవశ్యముగా అతడు బ్రదుకును.

జెకర్యా 3:7 సైన్యములకు అధిపతియగు యెహోవా సెలవిచ్చునదేమనగా నా మార్గములలొ నడుచుచు నేను నీకప్పగించిన దానిని భద్రముగా గైకొనినయెడల, నీవు నా మందిరముమీద అధికారివై నా ఆవరణములను కాపాడువాడవగుదువు; మరియు ఇక్కడ నిలువబడు వారికి కలిగినట్లు నా సన్నిధిని నిలుచు భాగ్యము నీకిత్తును.