Logo

ఆదికాండము అధ్యాయము 26 వచనము 30

ఆదికాండము 19:3 అయినను అతడు మిక్కిలి బలవంతము చేసినప్పుడు వారు అతనితట్టు తిరిగి అతని యింట ప్రవేశించిరి. అతడు వారికి విందుచేసి పొంగని రొట్టెలు కాల్చగా వారు భోజనము చేసిరి.

ఆదికాండము 21:8 ఆ పిల్లవాడు పెరిగి పాలు విడిచెను. ఇస్సాకు పాలు విడిచిన దినమందు అబ్రాహాము గొప్ప విందు చేసెను.

ఆదికాండము 31:54 యాకోబు ఆ కొండమీద బలియర్పించి భోజనము చేయుటకు తన బంధువులను పిలువగా వారు భోజనముచేసి కొండమీద ఆ రాత్రి వెళ్లబుచ్చిరి.

రోమీయులకు 12:18 శక్యమైతే మీచేతనైనంతమట్టుకు సమస్త మనుష్యులతో సమాధానముగా ఉండుడి.

హెబ్రీయులకు 12:14 అందరితో సమాధానమును పరిశుద్ధతయు కలిగి యుండుటకు ప్రయత్నించుడి. పరిశుద్ధత లేకుండ ఎవడును ప్రభువును చూడడు.

1పేతురు 4:9 సణుగుకొనకుండ ఒకనికి ఒకడు ఆతిథ్యము చేయుడి.

ఆదికాండము 43:16 యోసేపు వారితో నున్న బెన్యామీనును చూచి తన గృహనిర్వాహకునితో ఈ మనుష్యులను ఇంటికి తీసికొనిపోయి ఒక వేటను కోసి వంట సిద్ధము చేయించుము; మధ్యాహ్నమందు ఈ మనుష్యులు నాతో భోజనము చేయుదురని చెప్పెను.

2సమూయేలు 3:20 అందు నిమిత్తమై అబ్నేరు ఇరువదిమందిని వెంటబెట్టుకొని హెబ్రోనులోనున్న దావీదునొద్దకు రాగా దావీదు అబ్నేరుకును అతని వారికిని విందు చేయించెను.

1దినవృత్తాంతములు 12:39 వారి సహోదరులు వారికొరకు భోజనపదార్థములను సిద్ధము చేసియుండగా వారు దావీదుతోకూడ అచ్చట మూడు దినములుండి అన్నపానములు పుచ్చుకొనిరి.