Logo

ఆదికాండము అధ్యాయము 33 వచనము 3

యోహాను 10:4 మరియు అతడు తన సొంత గొఱ్ఱలనన్నిటిని వెలుపలికి నడిపించునపుడెల్ల వాటికి ముందుగా నడుచును; గొఱ్ఱలు అతని స్వరమెరుగును గనుక అవి అతనిని వెంబడించును.

యోహాను 10:11 నేను గొఱ్ఱలకు మంచి కాపరిని; మంచి కాపరి గొఱ్ఱలకొరకు తన ప్రాణము పెట్టును.

యోహాను 10:12 జీతగాడు గొఱ్ఱల కాపరి కాడు గనుక గొఱ్ఱలు తనవి కానందున తోడేలు వచ్చుట చూచి గొఱ్ఱలను విడిచిపెట్టి పారిపోవును, తోడేలు ఆ గొఱ్ఱలను పట్టి చెదరగొట్టును.

యోహాను 10:15 తండ్రి నన్ను ఏలాగున ఎరుగునో నేను తండ్రిని ఏలాగు ఎరుగుదునో ఆలాగే నేను నా గొఱ్ఱలను ఎరుగుదును, నా గొఱ్ఱలు నన్ను ఎరుగును. మరియు గొఱ్ఱల కొరకు నా ప్రాణము పెట్టుచున్నాను.

ఆదికాండము 18:2 అతడు కన్నులెత్తి చూచినప్పుడు ముగ్గురు మనుష్యులు అతని యెదుట నిలువబడి యుండిరి. అతడు వారిని చూచి గుడారపు వాకిటనుండి వారిని ఎదుర్కొనుటకు పరుగెత్తి, నేలమట్టుకు వంగి

ఆదికాండము 42:6 అప్పుడు యోసేపు ఆ దేశమంతటిమీద అధికారియై యుండెను. అతడే ఆ దేశ ప్రజలందరికిని ధాన్యమమ్మకము చేయువాడు గనుక యోసేపు సహోదరులు వచ్చి ముఖములు నేలను మోపి అతనికి వందనము చేసిరి

ఆదికాండము 43:26 యోసేపు ఇంటికి వచ్చినప్పుడు వారు తమచేతులలోనున్న కానుకను ఇంటిలోనికి తెచ్చి అతనికిచ్చి, అతనికి నేలను సాగిలపడిరి.

సామెతలు 6:3 నా కుమారుడా, నీ చెలికానిచేత చిక్కుబడితివి. నీవు త్వరపడి వెళ్లి విడిచిపెట్టుమని నీ చెలికానిని బలవంతము చేయుము.

ప్రసంగి 10:4 ఏలువాడు నీమీద కోపపడినయెడల నీ ఉద్యోగమునుండి నీవు తొలగిపోకుము; ఓర్పు గొప్ప ద్రోహకార్యములు జరుగకుండ చేయును.

లూకా 14:11 తన్నుతాను హెచ్చించుకొను ప్రతివాడును తగ్గింపబడును; తన్నుతాను తగ్గించుకొనువాడు హెచ్చింపబడునని చెప్పెను.

1సమూయేలు 2:5 తృప్తిగా భుజించినవారు అన్నము కావలెనని కూలికిపోవుదురు ఆకలి గొనినవారు ఆకలితీర తిందురు గొడ్రాలు ఏడుగురు పిల్లలను కనును అనేకమైన పిల్లలను కనినది కృశించిపోవును.

ఆదికాండము 25:23 రెండు జనములు నీ గర్భములో కలవు. రెండు జనపదములు నీ కడుపులోనుండి ప్రత్యేకముగా వచ్చును. ఒక జనపదము కంటె ఒక జనపదము బలిష్టమై యుండును. పెద్దవాడు చిన్నవానికి దాసుడగును అనెను.

ఆదికాండము 32:17 మరియు వారిలో మొదటివానితో నా సహోదరుడైన ఏశావు నిన్ను ఎదుర్కొని నీవెవరివాడవు? ఎక్కడికి వెళ్లుచున్నావు? నీ ముందరనున్నవి యెవరివని నిన్ను అడిగినయెడల

ఆదికాండము 48:12 యోసేపు అతని మోకాళ్ల మధ్యనుండి వారిని తీసికొని అతనికి సాష్టాంగ నమస్కారము చేసెను.

నిర్గమకాండము 18:7 మోషే తన మామను ఎదుర్కొన పోయి వందనము చేసి అతని ముద్దు పెట్టుకొనెను. వారు ఒకరి క్షేమము ఒకరు తెలిసికొని గుడారములోనికి వచ్చిరి.

2సమూయేలు 9:6 సౌలు కుమారుడైన యోనాతానునకు పుట్టిన మెఫీబోషెతు దావీదునొద్దకు వచ్చి సాగిలపడి నమస్కారము చేయగా దావీదు మెఫీబోషెతూ అని అతని పిలిచినప్పుడు అతడు చిత్తము, నీ దాసుడనైన నేనున్నాననెను.

మత్తయి 5:25 నీ ప్రతివాదితో నీవును త్రోవలో ఉండగానే త్వరగా వానితో సమాధానపడుము; లేనియెడల ఒకవేళ నీ ప్రతివాది నిన్ను న్యాయాధిపతికి అప్పగించును, న్యాయాధిపతి నిన్ను బంట్రౌతుకు అప్పగించును, అంతట నీవు చెరసాలలో వేయబడుదువు.