Logo

ఆదికాండము అధ్యాయము 33 వచనము 17

యెహోషువ 13:27 లోయలో బేతారాము బేత్నిమ్రా సుక్కోతు సాపోను, అనగా హెష్బోను రాజైన సీహోను రాజ్యశేషమును తూర్పు దిక్కున యొర్దాను అవతల కిన్నె రెతు సముద్రతీరమువరకునున్న యొర్దాను ప్రదేశమును.

న్యాయాధిపతులు 8:5 అతడునా వెంటనున్న జనులు అలసియున్నారు, ఆహార మునకు రొట్టెలు వారికి దయచేయుడి; మేము మిద్యాను రాజులైన జెబహును సల్మున్నాను తరుముచున్నామని సుక్కోతువారితో చెప్పగా

న్యాయాధిపతులు 8:8 అక్కడనుండి అతడు పెనూయేలునకు పోయి ఆలాగుననే వారితోను చెప్పగా సుక్కోతువారు ఉత్తరమిచ్చినట్లు పెనూయేలువారును అతని కుత్తరమిచ్చిరి గనుక అతడు

న్యాయాధిపతులు 8:16 ఆ ఊరిపెద్దలను పట్టుకొని నూర్చుకొయ్యలను బొమ్మజెముడును తీసికొని వాటివలన సుక్కోతువారికి బుద్ధి చెప్పెను.

1రాజులు 7:46 యొర్దాను మైదానమందు సుక్కోతునకును సారెతానునకును మధ్య జిగట భూమియందు రాజు వాటిని పోత పోయించెను.

కీర్తనలు 60:6 తన పరిశుద్ధతతోడని దేవుడు మాట యిచ్చియున్నాడు నేను ప్రహర్షించెదను షెకెమును పంచిపెట్టెదను సుక్కోతు లోయను కొలిపించెదను.

నిర్గమకాండము 12:37 అప్పుడు ఇశ్రాయేలీయులు రామసేసునుండి సుక్కోతుకు ప్రయాణమైపోయిరి వారు పిల్లలు గాక కాల్బలము ఆరులక్షల వీరులు.

నిర్గమకాండము 13:20 వారు సుక్కోతునుండి ప్రయాణమైపోయి, అరణ్యము దగ్గరనున్న ఏతాములో దిగిరి.

లేవీయకాండము 23:42 నేను ఐగుప్తు దేశములోనుండి ఇశ్రాయేలీయులను రప్పించినప్పుడు వారిని పర్ణశాలలో నివసింపచేసితినని మీ జనులు ఎరుగునట్లు ఏడు దినములు మీరు పర్ణశాలలలో నివసింపవలెను. ఇశ్రాయేలీయులలో పుట్టిన వారందరు పర్ణశాలలలో నివసింపవలెను.

సంఖ్యాకాండము 32:16 అందుకు వారు అతనియొద్దకు వచ్చి మేము ఇక్కడ మా మందలకొరకు దొడ్లను మా పిల్లలకొరకు పురములను కట్టుకొందుము.

నెహెమ్యా 8:14 యెహోవా మోషేకు దయచేసిన గ్రంథములో చూడగా, ఏడవ మాసపు ఉత్సవకాలమందు ఇశ్రాయేలీయులు పర్ణశాలలో నివాసము చేయవలెనని వ్రాయబడియుండుట కనుగొనెను

కీర్తనలు 108:7 తన పరిశుద్ధత తోడని దేవుడు మాట యిచ్చియున్నాడు నేను ప్రహర్షించెదను షెకెమును పంచిపెట్టెదను సుక్కోతు లోయను కొలిపించెదను.