Logo

ఆదికాండము అధ్యాయము 37 వచనము 20

కీర్తనలు 64:5 వారు దురాలోచన దృఢపరచుకొందురు చాటుగా ఉరుల నొడ్డుటకు యోచించుకొనుచు మనలను ఎవరు చూచెదరని చెప్పుకొందురు.

సామెతలు 1:11 మాతోకూడ రమ్ము మనము ప్రాణము తీయుటకై పొంచియుందము నిర్దోషియైన యొకని పట్టుకొనుటకు దాగియుందము

సామెతలు 1:12 పాతాళము మనుష్యులను మింగివేయునట్లు వారిని జీవముతోనే మింగివేయుదము సమాధిలోనికి దిగువారు మింగబడునట్లు వారు పూర్ణ బలముతోనుండగా మనము వారిని మింగివేయుదము రమ్ము అని వారు చెప్పునప్పుడు ఒప్పకుము.

సామెతలు 1:16 కీడు చేయుటకై వారి పాదములు పరుగులెత్తును నరహత్య చేయుటకై వారు త్వరపడుచుందురు.

సామెతలు 6:17 అవేవనగా, అహంకార దృష్టియు కల్లలాడు నాలుకయు నిరపరాధులను చంపు చేతులును

సామెతలు 27:4 క్రోధము క్రూరమైనది కోపము వరదవలె పొర్లునది. రోషము ఎదుట ఎవడు నిలువగలడు?

తీతుకు 3:3 ఎందుకనగా మనము కూడ మునుపు అవివేకులమును అవిధేయులమును మోసపోయిన వారమును నానావిధములైన దురాశలకును భోగములకును దాసులమునైయుండి, దుష్టత్వము నందును అసూయ యందును కాలము గడుపుచు, అసహ్యులమై యొకని నొకడు ద్వేషించుచు ఉంటిమి గాని

యోహాను 3:12 భూసంబంధమైన సంగతులు నేను మీతో చెప్పితే మీరు నమ్మకున్నప్పుడు, పరలోకసంబంధమైనవి మీతో చెప్పినయెడల ఏలాగు నమ్ముదురు?

1రాజులు 13:24 అతడు బయలుదేరి మార్గమున పోవుచుండగా ఒక సింహము అతనికి ఎదురుపడి అతని చంపెను. అతని కళేబరము మార్గమందు పడియుండగా గాడిద దాని దగ్గర నిలిచియుండెను, సింహమును శవముదగ్గర నిలిచియుండెను.

2రాజులు 2:24 అతడు వెనుకకు తిరిగి వారిని చూచి యెహోవా నామమునుబట్టి వారిని శపించెను. అప్పుడు రెండు ఆడు ఎలుగు బంట్లు అడవిలోనుండి వచ్చి వారిలో నలువది యిద్దరు బాలురను చీల్చివేసెను.

సామెతలు 10:18 అంతరంగమున పగ ఉంచుకొనువాడు అబద్ధికుడు కొండెము ప్రచురము చేయువాడు బుద్ధిహీనుడు.

సామెతలు 28:13 అతిక్రమములను దాచిపెట్టువాడు వర్ధిల్లడు వాటిని ఒప్పుకొని విడిచిపెట్టువాడు కనికరము పొందును.

1సమూయేలు 24:20 నిశ్చయముగా నీవు రాజవగుదువనియు, ఇశ్రాయేలీయుల రాజ్యము నీకు స్థిరపరచబడుననియు నాకు తెలియును.

1సమూయేలు 26:2 సౌలు లేచి ఇశ్రాయేలీయులలో ఏర్పరచబడిన మూడువేల మందిని తీసికొని జీఫు అరణ్యములో దావీదును వెదకుటకు జీఫు అరణ్యమునకు పోయెను.

మత్తయి 2:2 యూదుల రాజుగా పుట్టినవాడెక్కడ నున్నాడు? తూర్పు దిక్కున మేము ఆయన నక్షత్రము చూచి, ఆయనను పూజింప వచ్చితిమని చెప్పిరి

మత్తయి 2:3 హేరోదు రాజు ఈ సంగతి విన్నప్పుడు అతడును అతనితో కూడ యెరూషలేము వారందరును కలవరపడిరి.

మత్తయి 2:4 కాబట్టి రాజు ప్రధానయాజకులను ప్రజలలోనుండు శాస్త్రులను అందరిని సమకూర్చి క్రీస్తు ఎక్కడ పుట్టునని వారినడిగెను.

మత్తయి 2:5 అందుకు వారు యూదయ బేత్లెహేములోనే; ఏలయనగా యూదయ దేశపు బేత్లెహేమా నీవు యూదా ప్రధానులలో ఎంత మాత్రమును అల్పమైనదానవు కావు;ఇశ్రాయేలను నా ప్రజలను పరిపాలించు అధిపతి నీలోనుండి వచ్చును అని ప్రవక్త ద్వారా వ్రాయబడి యున్నదనిరి

మత్తయి 2:6 అంతట హేరోదు ఆ జ్ఞానులను రహస్యముగా పిలిపించి,

మత్తయి 2:7 ఆ నక్షత్రము కనబడిన కాలము వారిచేత పరిష్కారముగా తెలిసికొని

మత్తయి 2:8 మీరు వెళ్లి, ఆ శిశువు విషయమై జాగ్రత్తగా విచారించి తెలిసికొనగానే, నేనును వచ్చి, ఆయనను పూజించునట్లు నాకు వర్తమానము తెండని చెప్పి వారిని బేత్లెహేమునకు పంపెను.

మత్తయి 2:9 వారు రాజు మాట విని బయలుదేరి పోవుచుండగా, ఇదిగో తూర్పు దేశమున వారు చూచిన నక్షత్రము ఆ శిశువు ఉండిన చోటికి మీదుగా వచ్చి నిలుచువరకు వారికి ముందుగా నడిచెను.

మత్తయి 2:10 వారు ఆ నక్షత్రమును చూచి, అత్యానందభరితులై యింటిలోనికి వచ్చి,

మత్తయి 2:11 తల్లియైన మరియను ఆ శిశువును చూచి, సాగిలపడి, ఆయనను పూజించి, తమ పెట్టెలు విప్పి, బంగారమును సాంబ్రాణిని బోళమును కానుకలుగా ఆయనకు సమర్పించిరి.

మత్తయి 2:12 తరువాత హేరోదు నొద్దకు వెళ్లవద్దని స్వప్నమందు దేవునిచేత బోధింపబడినవారై వారు మరియొక మార్గమున తమ దేశమునకు తిరిగి వెళ్లిరి.

మత్తయి 2:13 వారు వెళ్ళిన తరువాత ఇదిగో ప్రభువు దూత స్వప్నమందు యోసేపునకు ప్రత్యక్షమై హేరోదు ఆ శిశువును సంహరింపవలెనని ఆయనను వెదకబోవుచున్నాడు గనుక నీవు లేచి ఆ శిశువును ఆయన తల్లిని వెంటబెట్టుకొని ఐగుప్తునకు పారిపోయి, నేను నీతో తెలియజెప్పువరకు అక్కడనే యుండుమని అతనితో చెప్పెను.

మత్తయి 2:14 అప్పుడతడు లేచి, రాత్రివేళ శిశువును తల్లిని తోడుకొని,

మత్తయి 2:15 ఐగుప్తునకు వెళ్లి ఐగుప్తులోనుండి నా కుమారుని పిలిచితిని అని ప్రవక్త ద్వారా ప్రభువు సెలవిచ్చిన మాట నెరవేర్చబడునట్లు హేరోదు మరణము వరకు అక్కడనుండెను.

మత్తయి 2:16 ఆ జ్ఞానులు తన్ను అపహసించిరని హేరోదు గ్రహించి బహు ఆగ్రహము తెచ్చుకొని, తాను జ్ఞానులవలన వివరముగా తెలిసికొనిన కాలమునుబట్టి, బేత్లెహేములోను దాని సకల ప్రాంతములలోను, రెండు సంవత్సరములు మొదలుకొని తక్కువ వయస్సు గల మగపిల్లలనందరిని వధించెను.

మత్తయి 27:40 దేవాలయమును పడగొట్టి మూడు దినములలో కట్టువాడా, నిన్ను నీవే రక్షించుకొనుము; నీవు దేవుని కుమారుడవైతే సిలువమీదనుండి దిగుమని చెప్పుచు ఆయనను దూషించిరి

మత్తయి 27:41 ఆలాగే శాస్త్రులును పెద్దలును ప్రధానయాజకులును కూడ ఆయనను అపహసించుచు

మత్తయి 27:42 వీడు ఇతరులను రక్షించెను, తన్ను తానే రక్షించుకొనలేడు; ఇశ్రాయేలు రాజుగదా, యిప్పుడు సిలువమీదనుండి దిగినయెడల వాని నమ్ముదుము.

మార్కు 15:29 అప్పుడు ఆ మార్గమున వెళ్లుచున్నవారు తమ తలలూచుచు ఆహా దేవాలయమును పడగొట్టి మూడు దినములలో కట్టువాడా,

మార్కు 15:30 సిలువమీదనుండి దిగి, నిన్ను నీవే రక్షించుకొనుమని చెప్పి ఆయనను దూషించిరి.

మార్కు 15:31 అట్లు శాస్త్రులును ప్రధానయాజకులును అపహాస్యము చేయుచు వీడితరులను రక్షించెను, తన్ను తాను రక్షించుకొనలేడు.

మార్కు 15:32 ఇశ్రాయేలు రాజగు క్రీస్తు ఇప్పుడు సిలువమీదనుండి దిగి రావచ్చును. అప్పుడు మనము చూచి నమ్ముదమని యొకరితో ఒకరు చెప్పుకొనిరి. ఆయనతోకూడ సిలువ వేయబడినవారును ఆయనను నిందించిరి.

యోహాను 12:10 అతనినిబట్టి యూదులలో అనేకులు తమవారిని విడిచి యేసునందు విశ్వాసముంచిరి గనుక

యోహాను 12:11 ప్రధానయాజకులు లాజరునుకూడ చంప నాలోచనచేసిరి.

అపోస్తలులకార్యములు 4:16 ఈ మనుష్యులను మనమేమి చేయుదము? వారిచేత ప్రసిద్ధమైన సూచక క్రియ చేయబడియున్నదని యెరూషలేములో కాపురమున్న వారికందరికి స్పష్టమే, అది జరుగలేదని చెప్పజాలము

అపోస్తలులకార్యములు 4:17 అయినను ఇది ప్రజలలో ఇంక వ్యాపింపకుండుటకై ఇకమీదట ఈ నామమునుబట్టి యే మనుష్యులతోనైనను మాటలాడకూడదని మనము వారిని బెదరుపెట్టవలెనని చెప్పుకొనిరి.

అపోస్తలులకార్యములు 4:18 అప్పుడు వారిని పిలిపించి మీరు యేసు నామమునుబట్టి యెంతమాత్రమును మాటలాడకూడదు, బోధింపను కూడదని వారికాజ్ఞాపించిరి.

ఆదికాండము 37:26 అప్పుడు యూదా మనము మన సహోదరుని చంపి వాని మరణమును దాచి పెట్టినందువలన ఏమి ప్రయోజనము?

ఆదికాండము 37:30 తన సహోదరులయొద్దకు తిరిగివెళ్లి చిన్నవాడు లేడే; అయ్యో నేనెక్కడికి పోదుననగా

ఆదికాండము 37:33 అతడు దానిని గురుతుపట్టి ఈ అంగీ నా కుమారునిదే; దుష్టమృగము వానిని తినివేసెను; యోసేపు నిశ్చయముగా చీల్చబడెననెను.

ఆదికాండము 42:36 అప్పుడు వారి తండ్రియైన యాకోబు వారిని చూచి మీరు నన్ను పుత్రహీనునిగా చేయుచున్నారు; యోసేపు లేడు; షిమ్యోను లేడు; మీరు బెన్యామీనును కూడ తీసికొనపోవుదురు; ఇవన్నియు నాకు ప్రతికూలముగా ఉన్నవని వారితో చెప్పెను

ఆదికాండము 43:26 యోసేపు ఇంటికి వచ్చినప్పుడు వారు తమచేతులలోనున్న కానుకను ఇంటిలోనికి తెచ్చి అతనికిచ్చి, అతనికి నేలను సాగిలపడిరి.

నిర్గమకాండము 2:14 అప్పుడతడు అన్యాయము చేసినవాని చూచి నీవేల నీ పొరుగువాని కొట్టుచున్నావని అడుగగా అతడు మామీద నిన్ను అధికారినిగాను తీర్పరినిగాను నియమించిన వాడెవడు? నీవు ఆ ఐగుప్తీయుని చంపినట్లు నన్నును చంపవలెనని అనుకొనుచున్నావా అనెను. అందుకు మోషే - నిశ్చయముగా ఈ సంగతి బయలుపడెననుకొని భయపడెను

సామెతలు 19:21 నరుని హృదయములో ఆలోచనలు అనేకములుగా పుట్టును యెహోవా యొక్క తీర్మానమే స్థిరము.

మత్తయి 26:68 కొందరు ఆయనను అరచేతులతో కొట్టి క్రీస్తూ, నిన్ను కొట్టినవాడెవడో ప్రవచింపుమనిరి.

మార్కు 12:7 అయితే ఆ కాపులు ఇతడు వారసుడు; ఇతని చంపుదము రండి, అప్పుడు స్వాస్థ్యము మనదగునని తమలోతాము చెప్పుకొని

మార్కు 15:18 యూదుల రాజా, నీకు శుభమని చెప్పి ఆయనకు వందనము చేయసాగిరి.

లూకా 23:35 ప్రజలు నిలువబడి చూచుచుండిరి; అధికారులును వీడు ఇతరులను రక్షించెను; వీడు దేవుడేర్పరచుకొనిన క్రీస్తు అయినయెడల తన్నుతాను రక్షించుకొనునని అపహసించిరి.

యోహాను 7:3 ఆయన సహోదరులు ఆయనను చూచి నీవు చేయుచున్న క్రియలు నీ శిష్యులును చూచునట్లు ఈ స్థలము విడిచి యూదయకు వెళ్లుము.

రోమీయులకు 3:7 దేవునికి మహిమకలుగునట్లు నా అసత్యమువలన దేవుని సత్యము ప్రబలినయెడల నేనికను పాపినైనట్టు తీర్పు పొందనేల?