Logo

ఆదికాండము అధ్యాయము 42 వచనము 2

ఆదికాండము 43:2 వారు ఐగుప్తునుండి తెచ్చిన ధాన్యము తినివేసిన తరువాత వారి తండ్రి మీరు మరల వెళ్లి మనకొరకు కొంచెము ఆహారము కొనుడని వారితో అనగా

ఆదికాండము 43:4 కాబట్టి నీవు మా తమ్ముని మాతో కూడ పంపినయెడల మేము వెళ్లి నీకొరకు ఆహారము కొందుము.

ఆదికాండము 45:9 మీరు త్వరగా నా తండ్రియొద్దకు వెళ్లి అతనితో నీ కుమారుడైన యోసేపు దేవుడు నన్ను ఐగుప్తు దేశమంతటికి ప్రభువుగా నియమించెను, నాయొద్దకు రమ్ము, అక్కడ ఉండవద్దు;

ఆదికాండము 43:8 యూదా తన తండ్రియైన ఇశ్రాయేలును చూచి ఆ చిన్న వానిని నాతో కూడ పంపుము, మేము లేచి వెళ్లుదుము, అప్పుడు మేమే కాదు నీవును మా పిల్లలును చావక బ్రదుకుదుము;

కీర్తనలు 118:17 నేను చావను సజీవుడనై యెహోవా క్రియలు వివరించెదను.

యెషయా 38:1 ఆ దినములలో హిజ్కియాకు మరణకరమైన రోగము కలుగగా ప్రవక్తయు ఆమోజు కుమారుడునైన యెషయా అతనియొద్దకు వచ్చి నీవు మరణమవుచున్నావు, బ్రదుకవు గనుక నీవు నీ యిల్లు చక్కబెట్టుకొనుమని యెహోవా సెలవిచ్చుచున్నాడని చెప్పగా

మత్తయి 4:4 అందుకాయన మనుష్యుడు రొట్టెవలన మాత్రము కాదుగాని దేవుని నోటనుండి వచ్చు ప్రతి మాటవలనను జీవించును అని వ్రాయబడి యున్నదనెను.

ఆదికాండము 41:54 యోసేపు చెప్పిన ప్రకారము ఏడు కరవు సంవత్సరములు ఆరంభమాయెను గాని ఐగుప్తు దేశమందంతటను ఆహారముండెను.

ఆదికాండము 42:1 ధాన్యము ఐగుప్తులో నున్నదని యాకోబు తెలిసికొనినప్పుడు మీరేల ఒకరి ముఖము ఒకరు చూచుచున్నారని తన కుమారులతో అనెను.

ఆదికాండము 42:19 మీరు యథార్థవంతులైతిరా మీ సహోదరులలో ఒకడు ఈ చెరసాలలో బంధింపబడవలెను; మీరు వెళ్లి మీ కుటుంబముల కరవు తీరుటకు ధాన్యము తీసికొని పోవుడి.

నెహెమ్యా 5:2 ఏదనగా కొందరు మేమును మా కుమారులును మా కుమార్తెలును అనేకులము. అందుచేత మేము తిని బ్రదుకుటకు ధాన్యము మీయొద్ద తీసికొందుమనిరి.