Logo

ఆదికాండము అధ్యాయము 42 వచనము 5

ఆదికాండము 12:10 అప్పుడు ఆ దేశములో కరవు వచ్చెను. ఆ దేశములో కరవు భారముగా నున్నందున అబ్రాము ఐగుప్తు దేశములో నివసించుటకు అక్కడికి వెళ్లెను.

ఆదికాండము 26:1 అబ్రాహాము దినములలో వచ్చిన మొదటి కరవు గాక మరియొక కరవు ఆ దేశములో వచ్చెను. అప్పడు ఇస్సాకు గెరారులోనున్న ఫిలిష్తీయుల రాజైన అబీమెలెకు నొద్దకు వెళ్లెను.

ఆదికాండము 41:57 మరియు ఆ కరవు ప్రతి దేశమందు భారమైనందున సమస్త దేశస్థులు యోసేపు నొద్ద ధాన్యము కొనుటకు ఐగుప్తునకు వచ్చిరి.

అపోస్తలులకార్యములు 7:11 తరువాత ఐగుప్తు దేశమంతటికిని కనాను దేశమంతటికిని కరవును బహు శ్రమయువచ్చెను గనుక మన పితరులకు ఆహారము లేకపోయెను.

అపోస్తలులకార్యములు 11:28 వారిలో అగబు అను ఒకడు నిలువబడి, భూలోకమంతట గొప్ప కరవు రాబోవుచున్నదని ఆత్మద్వారా సూచించెను. అది క్లౌదియ చక్రవర్తి కాలమందు సంభవించెను.

ఆదికాండము 41:54 యోసేపు చెప్పిన ప్రకారము ఏడు కరవు సంవత్సరములు ఆరంభమాయెను గాని ఐగుప్తు దేశమందంతటను ఆహారముండెను.

ఆదికాండము 42:3 యోసేపు పదిమంది అన్నలు ఐగుప్తులో ధాన్యము కొనబోయిరి.

ఆదికాండము 43:1 ఆ దేశమందు కరవు భారముగా ఉండెను గనుక

కీర్తనలు 105:16 దేశముమీదికి ఆయన కరవు రప్పించెను జీవనాధారమైన ధాన్యమంతయు కొట్టివేసెను.