Logo

ఆదికాండము అధ్యాయము 43 వచనము 31

ఆదికాండము 45:1 అప్పుడు యోసేపు తనయొద్ద నిలిచినవారందరి యెదుట తన్ను తాను అణచుకొనజాలక నాయొద్దనుండి ప్రతి మనుష్యుని వెలుపలికి పంపి వేయుడని బిగ్గరగా చెప్పెను. యోసేపు తన సహోదరులకు తన్నుతాను తెలియచేసికొనినప్పుడుఎవరును అతనియెద్ద నిలిచియుండలేదు

యెషయా 42:14 చిరకాలమునుండి నేను మౌనముగా ఉంటిని ఊరకొని నన్ను అణచుకొంటిని ప్రసవవేదన పడు స్త్రీవలె విడువకుండ నేను బలవంతముగా ఊపిరితీయుచు ఒగర్చుచు రోజుచునున్నాను.

యిర్మియా 31:16 యెహోవా ఈ ఆజ్ఞ ఇచ్చుచున్నాడు ఏడువక ఊరకొనుము, కన్నీళ్లు విడుచుట మానుము; నీ క్రియ సఫలమై, జనులు శత్రువుని దేశములోనుండి తిరిగివచ్చెదరు; ఇదే యెహోవా వాక్కు.

1పేతురు 3:10 జీవమును ప్రేమించి మంచి దినములు చూడగోరు వాడు చెడ్డదాని పలుకకుండ తన నాలుకను, కపటపు మాటలు చెప్పకుండ తన పెదవులను కాచుకొనవలెను.

ఆదికాండము 43:25 అక్కడ తాము భోజనము చేయవలెనని వినిరి గనుక మధ్యాహ్నమందు యోసేపు వచ్చు వేళకు తమ కానుకను సిద్ధముచేసిరి.

ఎస్తేరు 5:10 అయితే హామాను కోపము అణచుకొని తన యింటికిపోయి తనస్నేహితులను తన భార్యయైన జెరెషును పిలిపించి

యోహాను 11:33 ఆమె ఏడ్చుటయు, ఆమెతో కూడ వచ్చిన యూదులు ఏడ్చుటయు యేసు చూచి కలవరపడి ఆత్మలో మూలుగుచు అతనినెక్కడ నుంచితిరని అడుగగా,