Logo

ఆదికాండము అధ్యాయము 43 వచనము 34

2సమూయేలు 11:8 తరువాత దావీదు ఇంటికిపోయి శ్రమ తీర్చుకొనుమని ఊరియాకు సెలవియ్యగా, ఊరియా రాజనగరిలోనుండి బయలువెళ్లెను.

ఆదికాండము 45:22 అతడు వారికి రెండేసి దుస్తుల బట్టలు ఇచ్చెను; బెన్యామీనుకు మూడువందల తులముల వెండియును ఐదు దుస్తుల బట్టలు ఇచ్చెను,

1సమూయేలు 1:5 హన్నా తనకు ప్రియముగా నున్నందున ఆమెకు రెండుపాళ్లు ఇచ్చుచు వచ్చెను. యెహోవా ఆమెకు సంతులేకుండచేసెను.

1సమూయేలు 9:22 అయితే సమూయేలు సౌలును అతని పనివానిని భోజనపు సాలలోనికి తోడుకొనిపోయి, పిలువబడిన దాదాపు ముప్పదిమందిలో ప్రధానస్థలమందు వారిని కూర్చుండబెట్టి

1సమూయేలు 9:23 పచనకర్తతో నేను నీ దగ్గరనుంచుమని చెప్పి నీచేతికి ఇచ్చిన భాగమును తీసికొని రమ్మనగా

1సమూయేలు 9:24 పచనకర్త జబ్బను దాని మీదనున్న దానిని తీసికొనివచ్చి సౌలు ఎదుట ఉంచగా సమూయేలు సౌలుతో ఇట్లనెను చూడుము, మనము కలిసికొను కాలమునకై దాచియుంచబడిన దానిని నీకు పెట్టియున్నాడు, జనులను పిలిచితినని నేను పచనకర్తతో చెప్పినప్పుడు ఇది నీకొరకుంచవలసినదని చెప్పితిని. ఆ దినమున సౌలు సమూయేలుతో కూడ భోజనము చేసెను,

సామెతలు 31:6 ప్రాణము పోవుచున్నవానికి మద్యము నియ్యుడి మనోవ్యాకులము గలవారికి ద్రాక్షారసము నియ్యుడి.

ప్రసంగి 9:7 నీవు పోయి సంతోషముగా నీ అన్నము తినుము, ఉల్లాసపు మనస్సుతో నీ ద్రాక్షారసము త్రాగుము; ఇదివరకే దేవుడు నీ క్రియలను అంగీకరించెను.

ప్రసంగి 10:19 నవ్వులాటలు పుట్టించుటకై వారు విందు చేయుదురు, ద్రాక్షారసపానము వారి ప్రాణమునకు సంతోషకరము; ద్రవ్యము అన్నిటికి అక్కరకు వచ్చును.

పరమగీతము 5:1 నా సహోదరీ, ప్రాణేశ్వరీ, నా ఉద్యానవనమునకు నేను ఏతెంచితిని నా జటామాంసిని నా గంధవర్గములను కూర్చుకొనుచున్నాను తేనెయు తేనెపట్టును భుజించుచున్నాను క్షీరసహిత ద్రాక్షారసము పానము చేయుచున్నాను. నా సఖులారా, భుజించుడి లెస్సగా పానము చేయుడి స్నేహితులారా, పానము చేయుడి.

హబక్కూకు 1:6 ఆలకించుడి, తమవికాని ఉనికిపట్టులను ఆక్రమించవలెనని భూదిగంతములవరకు సంచరించు ఉద్రేకముగల క్రూరులగు కల్దీయులను నేను రేపుచున్నాను.

మత్తయి 11:19 మనుష్యకుమారుడు తినుచును త్రాగుచును వచ్చెను గనుక ఇదిగో వీడు తిండిబోతును మద్యపానియు సుంకరులకును పాపులకును స్నేహితుడునని వారనుచున్నారు. అయినను జ్ఞానము జ్ఞానమని దాని క్రియలనుబట్టి తీర్పుపొందుననెను.

యోహాను 2:10 ప్రతివాడును మొదట మంచి ద్రాక్షారసమును పోసి, జనులు మత్తుగా ఉన్నప్పుడు జబ్బురసము పోయును; నీవైతే ఇదివరకును మంచి ద్రాక్షారసము ఉంచుకొని యున్నావని అతనితో చెప్పెను.

ఆదికాండము 33:4 అప్పుడు ఏశావు అతనిని ఎదుర్కొన పరుగెత్తి అతనిని కౌగలించుకొని అతని మెడమీద పడి ముద్దుపెట్టుకొనెను; వారిద్దరు కన్నీరు విడిచిరి.

రూతు 3:7 బోయజు మనస్సున సంతోషించునట్లు అన్నపానములు పుచ్చుకొని లోపలికి పోయి ధాన్యపు కుప్పయొద్ద పండుకొనినప్పుడు ఆమె మెల్లగా పోయి అతని కాళ్లమీదనున్న బట్ట తీసి పండుకొనెను.

1సమూయేలు 9:23 పచనకర్తతో నేను నీ దగ్గరనుంచుమని చెప్పి నీచేతికి ఇచ్చిన భాగమును తీసికొని రమ్మనగా

ఎస్తేరు 1:10 ఏడవ దినమందు రాజు ద్రాక్షారసము త్రాగి సంతోషముగా నున్నప్పుడు, కూడివచ్చిన జనమునకును, అధిపతులకును రాణియైన వష్తియొక్క సౌందర్యమును కనుపరచవలెనని రాజ కిరీటము ధరించుకొనిన ఆమెను తన సన్నిధికి పిలుచుకొని వచ్చునట్లు

కీర్తనలు 11:6 దుష్టులమీద ఆయన ఉరులు కురిపించును అగ్నిగంధకములును వడగాలియు వారికి పానీయభాగమగును.

జెకర్యా 10:7 ఎఫ్రాయిమువారు బలాఢ్యులవంటి వారగుదురు, ద్రాక్షారస పానము చేయువారు సంతోషించునట్లు వారు మనస్సున ఆనందింతురు, వారి బిడ్డలు దాని చూచి ఆనందపడుదురు, యెహోవానుబట్టి వారు హృదయపూర్వకముగా ఉల్లసించుదురు.