Logo

యెషయా అధ్యాయము 23 వచనము 8

యెషయా 22:2 ఏమివచ్చి నీలోనివారందరు మేడలమీది కెక్కియున్నారు? అల్లరితో నిండి కేకలువేయు పురమా, ఉల్లాసముతో బొబ్బలు పెట్టు దుర్గమా, నీలో హతులైనవారు ఖడ్గముచేత హతము కాలేదు యుద్ధములో వధింపబడలేదు.

యెహోషువ 19:29 అక్కడనుండి ఆ సరిహద్దు రామావరకును కోటగల సోరను పట్టణమువరకును వ్యాపించి అక్కడనుండి తిరిగి హోసా వరకు సాగి అక్కడనుండి అక్జీబు సరిహద్దునుపట్టి సముద్రమువరకు సాగెను.

యెషయా 47:1 కన్యకయైన బబులోనూ, క్రిందికి దిగి మంటిలో కూర్చుండుము కల్దీయుల కుమారీ, సింహాసనము లేకయే నేలమీద కూర్చుండుము నీవు మృదువువనియైనను సుకుమారివనియైనను జనులు ఇకమీదట చెప్పరు.

యెషయా 47:2 తిరుగటిదిమ్మలు తీసికొని పిండి విసరుము నీ ముసుకు పారవేయుము కాలిమీద జీరాడు వస్త్రము తీసివేయుము కాలిమీది బట్టతీసి నదులు దాటుము.

ప్రసంగి 10:7 పనివారు గుఱ్ఱములమీద కూర్చుండుటయు అధిపతులు సేవకులవలె నేలను నడుచుటయు నాకగపడెను.

రూతు 1:19 వారు బేత్లెహేమునకు వచ్చినప్పుడు ఆ ఊరి వారందరు వారియొద్దకు గుంపుకూడి వచ్చిఈమె నయోమి గదా అని అనుకొనుచుండగా

యెషయా 23:12 మరియు ఆయన సీదోను కన్యకా, చెరపబడినదానా, నీకికను సంతోషముండదు నీవు లేచి కిత్తీముకు దాటిపొమ్ము అక్కడనైనను నీకు నెమ్మది కలుగదు

యెహెజ్కేలు 26:13 ఇట్లు నేను నీ సంగీతనాదమును మాన్పించెదను, నీ సితారానాద మికను వినబడదు,