Logo

యెషయా అధ్యాయము 28 వచనము 14

యెషయా 28:10 ఆజ్ఞవెంబడి ఆజ్ఞ ఆజ్ఞవెంబడి ఆజ్ఞ సూత్రమువెంబడి సూత్రము సూత్రమువెంబడి సూత్రము కొంత ఇచ్చట కొంత అచ్చట చెప్పుచున్నాడని వారనుకొందురు.

యిర్మియా 23:36 యెహోవా భారమను మాట మీరికమీదట జ్ఞాపకము చేసికొనవద్దు; జీవముగల మన దేవుని మాటలను, సైన్యములకధిపతియు దేవుడునగు యెహోవా మాటలను, మీరు అపార్థము చేసితిరి; కాగా ఎవనిమాట వానికే భారమగును.

యిర్మియా 23:37 యెహోవా నీకేమని ప్రత్యుత్తర మిచ్చుచున్నాడనియు, యెహోవా యేమి చెప్పుచున్నాడనియు మీరు ప్రవక్తను అడుగవలెను గాని యెహోవా భారమను మాట మీరెత్తినయెడల

యిర్మియా 23:38 అందునుగూర్చి యెహోవా ఈలాగు సెలవిచ్చుచున్నాడు మీరు యెహోవా భారమను మాట యెత్తవద్దని నేను మీకు ఆజ్ఞ ఇచ్చినను మీరు యెహోవా భారమను మాట యెత్తుచునే యున్నారు.

హోషేయ 6:5 కాబట్టి నేను చేసిన తీర్పులు వెలుగువలె ప్రకాశించునట్లు ప్రవక్తలచేత నేను వారిని కొట్టి బద్దలు చేసియున్నాను, నానోటి మాటలచేత వారిని వధించి యున్నాను.

హోషేయ 8:12 నేను అతని కొరకు నా ధర్మశాస్త్రమును పరిపూర్ణముగా వ్రాయించి నియమించినను వాటిని అతడు అన్యములుగా ఎంచెను.

యెషయా 6:9 ఆయన నీవు పోయి యీ జనులతో ఇట్లనుము మీరు నిత్యము వినుచుందురు గాని గ్రహింపకుందురు; నిత్యము చూచుచుందురు గాని తెలిసికొనకుందురు.

యెషయా 6:10 వారు కన్నులతో చూచి, చెవులతో విని, హృదయముతో గ్రహించి, మనస్సు మార్చుకొని స్వస్థత పొందకపోవునట్లు ఈ జనుల హృదయము క్రొవ్వచేసి వారి చెవులు మందపరచి వారి కన్నులు మూయించుమని చెప్పెను.

యెషయా 8:14 అయితే ఆయన ఇశ్రాయేలుయొక్క రెండు కుటుంబములకు తగులు రాయిగాను అభ్యంతరము కలిగించు బండగాను ఉండును యెరూషలేము నివాసులకు బోనుగాను చిక్కువలగాను ఉండును

యెషయా 8:15 అనేకులు వాటికి తగిలి తొట్రిల్లుచు పడి కాళ్లుచేతులు విరిగి చిక్కుబడి పట్టబడుదురు.

కీర్తనలు 69:22 వారి భోజనము వారికి ఉరిగా నుండును గాక వారు నిర్భయులై యున్నప్పుడు అది వారికి ఉరిగా నుండును గాక.

మత్తయి 13:14 మనస్సు త్రిప్పుకొని నావలన స్వస్థత పొందకుండునట్లు వారి హృదయము క్రొవ్వినది, వారి చెవులు వినుటకు మందములైనవి, వారు తమ కన్నులు మూసికొనియున్నారు

మత్తయి 21:44 మరియు ఈ రాతిమీద పడువాడు తునకలైపోవును గాని అది ఎవనిమీద పడునో వానిని నలి చేయుననెను.

రోమీయులకు 11:9 మరియు వారి భోజనము వారికి ఉరిగాను, బోనుగాను, ఆటంకముగాను వారి క్రియలకు ప్రతిఫలముగాను ఉండును గాక.

2కొరిందీయులకు 2:16 నశించువారికి మరణార్థమైన మరణపు వాసనగాను రక్షింపబడువారికి జీవార్థమైన జీవపు వాసనగాను ఉన్నాము.

1పేతురు 2:7 విశ్వసించుచున్న మీకు, ఆయన అమూల్యమైనవాడు; విశ్వసింపనివారికైతే ఇల్లు కట్టువారు ఏ రాతిని నిషేధించిరో అదే మూలకు తలరాయి ఆయెను. మరియు అది అడ్డురాయియు అడ్డుబండయు ఆయెను.

1పేతురు 2:8 కట్టువారు వాక్యమునకవిధేయులై తొట్రిల్లుచున్నారు, దానికే వారు నియమింపబడిరి.

2పేతురు 3:16 వీటినిగూర్చి తన పత్రికలన్నిటిలోను బోధించుచున్నాడు; అయితే వాటిలో కొన్నిసంగతులు గ్రహించుటకు కష్టమైనవి. వీటిని విద్యావిహీనులును, అస్థిరులైనవారును, తక్కిన లేఖనములను అపార్థము చేసినట్లు, తమ స్వకీయ నాశనమునకు అపార్థము చేయుదురు.

కీర్తనలు 9:16 యెహోవా ప్రత్యక్షమాయెను, ఆయన తీర్పు తీర్చియున్నాడు. దుష్టులు తాము చేసికొనినదానిలో చిక్కియున్నారు(హిగ్గాయోన్‌ సెలా.)

కీర్తనలు 70:2 నా ప్రాణము తీయగోరువారు సిగ్గుపడి అవమానమొందుదురుగాక. నాకు కీడుచేయగోరువారు వెనుకకు మళ్లింపబడి సిగ్గునొందుదురు గాక.

కీర్తనలు 119:165 నీ ధర్మశాస్త్రమును ప్రేమించువారికి ఎంతో నెమ్మదికలదు వారు తూలి తొట్రిల్లుటకు కారణమేమియులేదు

యెషయా 8:9 జనులారా, రేగుడి మీరు ఓడిపోవుదురు; దూరదేశస్థులారా, మీరందరు ఆలకించుడి మీరు నడుము కట్టుకొనినను ఓడిపోవుదురు నడుము కట్టుకొనినను ఓడిపోవుదురు.

యెషయా 29:12 మరియు నీవు దయచేసి దీని చదువుమని చెప్పి అక్షరములు తెలియనివానికి దానిని అప్పగించును అతడు అక్షరములు నాకు తెలియవనును.

యిర్మియా 15:6 యెహోవా వాక్కు ఇదే నీవు నన్ను విసర్జించియున్నావు వెనుకతీసియున్నావు గనుక నిన్ను నశింపజేయునట్లు నేను నీ మీదికి నా చేతిని చాచియున్నాను; సంతాపపడి పడి నేను విసికియున్నాను.

యెహెజ్కేలు 33:31 నా జనులు రాదగిన విధముగా వారు నీయొద్దకు వచ్చి, నా జనులైనట్టుగా నీ యెదుట కూర్చుండి నీ మాటలు విందురుగాని వాటి ననుసరించి ప్రవర్తింపరు, వారు నోటితో ఎంతో ప్రేమ కనుపరచుదురు గాని వారి హృదయము లాభమును అపేక్షించుచున్నది.

మత్తయి 13:24 ఆయన మరియొక ఉపమానము వారితో చెప్పెను, ఏమనగా పరలోకరాజ్యము, తన పొలములో మంచి విత్తనము విత్తిన యొక మనుష్యుని పోలియున్నది.

లూకా 14:18 అయితే వారందరు ఏకమనస్సుతో నెపములు చెప్పసాగిరి. మొదటివాడు నేనొక పొలము కొనియున్నాను, అవశ్యముగా వెళ్లి దాని చూడవలెను, నన్ను క్షమింపవలెనని నిన్ను వేడు కొనుచున్నాననెను

2తిమోతి 2:26 ప్రభువు యొక్క దాసుడు అట్టివారిని సాత్వికముతో శిక్షించుచు, జగడమాడక అందరియెడల సాధువుగాను బోధింప సమర్థుడుగాను, కీడును సహించువాడుగాను ఉండవలెను.

హెబ్రీయులకు 5:12 కాలమునుబట్టి చూచితే మీరు బోధకులుగా ఉండవలసినవారై యుండగా, దేవోక్తులలో మొదటి మూలపాఠములను ఒకడు మీకు మరల బోధింపవలసి వచ్చెను. మీరు పాలు త్రాగవలసినవారే గాని బలమైన ఆహారము తినగలవారు కారు.