Logo

యెషయా అధ్యాయము 30 వచనము 4

యెషయా 30:5 వారందరును తమకు అక్కరకు రాకయే సహాయమునకైనను ఏ ప్రయోజనమునకైనను పనికిరాక సిగ్గును నిందయు కలుగజేయు ఆ జనుల విషయమై సిగ్గుపడుదురు.

యెషయా 30:6 దక్షిణ దేశములోనున్న క్రూరమృగములనుగూర్చిన దేవోక్తి సింహీ సింహములును పాములును తాపకరమైన మిడునాగులు నున్న మిక్కిలి శ్రమ బాధలుగల దేశముగుండ వారు గాడిదపిల్లల వీపులమీద తమ ఆస్తిని ఒంటెల మూపులమీద తమ ద్రవ్యములను ఎక్కించుకొని తమకు సహాయము చేయలేని జనమునొద్దకు వాటిని తీసికొనిపోవుదురు.

యెషయా 30:7 ఐగుప్తువలని సహాయము పనికిమాలినది, నిష్ప్రయోజనమైనది అందుచేతను ఏమియు చేయక ఊరకుండు గప్పాలమారి అని దానికి పేరు పెట్టుచున్నాను.

యెషయా 20:5 వారు తాము నమ్ముకొనిన కూషీయులనుగూర్చియు, తాము అతి శయకారణముగా ఎంచుకొనిన ఐగుప్తీయులనుగూర్చియు విస్మయమొంది సిగ్గుపడుదురు.

యిర్మియా 37:5 ఫరో దండు ఐగుప్తులోనుండి బయలుదేరగా యెరూషలేమును ముట్టడివేయుచున్న కల్దీయులు సమాచారము విని యెరూషలేము దగ్గరనుండి బయలుదేరిరి.

యిర్మియా 37:6 అప్పుడు యెహోవా వాక్కు ప్రవక్తయైన యిర్మీయాకు ప్రత్యక్షమై యీలాగు సెలవిచ్చెను

యిర్మియా 37:7 ఇశ్రాయేలు దేవుడగు యెహోవా ఆజ్ఞ ఇచ్చునదేమనగా నాయొద్ద విచారించుడని నిన్ను నాయొద్దకు పంపిన యూదా రాజుతో నీవీలాగు చెప్పవలెను మీకు సహాయము చేయుటకై బయలుదేరి వచ్చుచున్న ఫరోదండు తమ స్వదేశమైన ఐగుప్తులోనికి తిరిగివెళ్లును.

యిర్మియా 37:8 కల్దీయులు తిరిగివచ్చి యీ పట్టణముమీద యుద్ధముచేసి దాని పట్టుకొని అగ్నిచేత కాల్చివేయుదురు.

యిర్మియా 37:9 యెహోవా ఈ మాట సెలవిచ్చుచున్నాడు కల్దీయులు నిశ్చయముగా మాయొద్దనుండి వెళ్లెదరనుకొని మిమ్మును మీరు మోసపుచ్చుకొనకుడి, వారు వెళ్లనేవెళ్లరు.

యిర్మియా 37:10 మీతో యుద్ధముచేయు కల్దీయుల దండువారినందరిని మీరు హతముచేసి వారిలో గాయపడిన వారిని మాత్రమే మిగిలించినను వారే తమ గుడారములలోనుండి వచ్చి యీ పట్టణమును అగ్నితో కాల్చివేయుదురు.

యెషయా 45:16 విగ్రహములు చేయువారు సిగ్గుపడినవారైరి వారందరు విస్మయము పొందియున్నారు. ఒకడును మిగులకుండ అందరు కలవరపడుదురు.

యెషయా 45:17 యెహోవావలన ఇశ్రాయేలు నిత్యమైన రక్షణ పొందియున్నది మీరు ఎన్నటెన్నటికి సిగ్గుపడకయు విస్మయ మొందకయు నుందురు.

యిర్మియా 17:5 యెహోవా ఈలాగు సెలవిచ్చుచున్నాడు. నరులను ఆశ్రయించి శరీరులను తనకాధారముగా చేసికొనుచు తన హృదయమును యెహోవామీదనుండి తొలగించుకొనువాడు శాపగ్రస్తుడు.

యిర్మియా 17:6 వాడు ఎడారిలోని అరుహావృక్షమువలె ఉండును; మేలు వచ్చినప్పుడు అది వానికి కనబడదు, వాడు అడవిలో కాలిన నేలయందును నిర్జనమైన చవిటి భూమియందును నివసించును.

రోమీయులకు 5:5 ఎందుకనగా ఈ నిరీక్షణ మనలను సిగ్గుపరచదు. మనకు అనుగ్రహింపబడిన పరిశుద్ధాత్మద్వారా దేవుని ప్రేమ మన హృదయములలో కుమ్మరింపబడియున్నది.

రోమీయులకు 10:11 ఏమనగా, ఆయనయందు విశ్వాసముంచువాడెవడును సిగ్గుపడడని లేఖనము చెప్పుచున్నది.

సంఖ్యాకాండము 14:9 మెట్టుకు మీరు యెహోవామీద తిరుగబడకుడి, ఆ దేశ ప్రజలకు భయపడకుడి, వారు మనకు ఆహారమగుదురు, వారి నీడ వారిమీదనుండి తొలగిపోయెను. యెహోవా మనకు తోడైయున్నాడు, వారికి భయపడకుడనిరి. ఆ సర్వసమాజము వారిని రాళ్లతో కొట్టి చంపవలెననగా

2దినవృత్తాంతములు 28:20 అష్షూరురాజైన తిగ్లత్పిలేసెరు అతనియొద్దకు వచ్చి అతని బాధపరచెనే గాని అతని బలపరచలేదు.

కీర్తనలు 108:12 మనుష్యుల సహాయము వ్యర్థము. శత్రువులను జయించుటకు నీవు మాకు సహాయము దయచేయుము

కీర్తనలు 118:9 రాజులను నమ్ముకొనుటకంటె యెహోవాను ఆశ్రయించుట మేలు.

యెషయా 18:1 ఓహో కూషు నదుల అవతల తటతట కొట్టుకొనుచున్న రెక్కలుగల దేశమా!

యెషయా 31:2 అయినను ఆయనయు బుద్ధిమంతుడుగా ఉన్నాడు. మాట తప్పక దుష్టుల యింటివారిమీదను కీడుచేయువారికి తోడ్పడువారిమీదను ఆయన లేచును.

యిర్మియా 41:17 కారేహ కుమారుడైన యోహానానును అతనితో కూడనున్న సేనల యధిపతులందరును మిస్పాదగ్గరనుండి ఇష్మాయేలు నొద్దనుండి జనశేషమంతటిని, అనగా గిబియోను దగ్గరనుండి ఇష్మాయేలు కొనిపోయిన యోధులను స్త్రీలను పిల్లలను, రాజపరివారమును మరల రప్పించిరి;

యిర్మియా 46:25 ఇశ్రాయేలు దేవుడును సైన్యములకధిపతియునగు యెహోవా ఈలాగు సెలవిచ్చుచున్నాడు నోలోనుండు ఆమోను దేవతను ఫరోను ఐగుప్తును దాని దేవతలను దాని రాజులను ఫరోను అతని నాశ్రయించువారిని నేను దండించుచున్నాను.

యెహెజ్కేలు 16:33 నీ విటకాండ్రు నలుదిక్కులనుండి వచ్చి నీతో వ్యభిచరించునట్లు వారికందరికి నీవే సొమ్మిచ్చుచు వచ్చితివి, బహుమానముల నిచ్చుచు వచ్చితివి.

హోషేయ 2:7 అది తన విటకాండ్రను వెంటాడి వారిని ఎదుర్కొనలేక పోవును; ఎంత వెదకినను వారు దానికి కనబడక యుందురు. అప్పుడు అది ఇప్పటి కంటె పూర్వమే నా స్థితి బాగుగ నుండెను గనుక నేను తిరిగి నా మొదటి పెనిమిటియొద్దకు వెళ్లుదుననుకొనును.

హోషేయ 10:6 ఎఫ్రాయిము అవమానము నొందుటకు, ఇశ్రాయేలువారు తాము చేసిన ఆలోచనవలన సిగ్గు తెచ్చుకొనుటకు, అది అష్షూరు దేశములోనికి కొనిపోబడి రాజైన యారేబునకు కానుకగా ఇయ్యబడును.