Logo

యెషయా అధ్యాయము 34 వచనము 2

యెషయా 18:3 పర్వతములమీద ఒకడు ధ్వజమెత్తునప్పుడు లోక నివాసులైన మీరు భూమిమీద కాపురముండు మీరు చూడుడి బాకా ఊదునప్పుడు ఆలకించుడి.

యెషయా 33:13 దూరస్థులారా, ఆలకించుడి నేను చేసినదాని చూడుడి సమీపస్థులారా, నా పరాక్రమమును తెలిసికొనుడి.

యెషయా 41:1 ద్వీపములారా, నాయెదుట మౌనముగా నుండుడి జనములారా, నూతనబలము పొందుడి. వారు నా సన్నిధికి వచ్చి మాటలాడవలెను వ్యాజ్యెము తీర్చుకొనుటకు మనము కూడుకొందము రండి.

యెషయా 43:9 సర్వజనులారా, గుంపుకూడి రండి జనములు కూర్చబడవలెను వారిలో ఎవరు ఇట్టి సంగతులు తెలియజేయుదురు? పూర్వకాలమున జరిగినవాటిని ఎవరు మాకు వినిపించుదురు? తాము నిర్దోషులమని తీర్పుపొందునట్లు తమ సాక్షులను తేవలెను లేదా, విని సత్యమే యని యొప్పుకొనవలెను.

యెషయా 49:1 ద్వీపములారా, నా మాట వినుడి, దూరముననున్న జనములారా, ఆలకించుడి, నేను గర్భమున పుట్టగానే యెహోవా నన్ను పిలిచెను తల్లి నన్ను ఒడిలో పెట్టుకొనినది మొదలుకొని ఆయన నా నామము జ్ఞాపకము చేసికొనెను.

న్యాయాధిపతులు 5:3 రాజులారా వినుడి, అధిపతులారా ఆలకించుడి యెహోవాకు గానముచేసెదను.

న్యాయాధిపతులు 5:31 యెహోవా నీ శత్రువులందరు ఆలాగుననే నశిం చెదరు ఆయనను ప్రేమించువారు బలముతో ఉదయించు సూర్యునివలె నుందురు అనిపాడిరి. తరువాత దేశము నలువది సంవత్సరములు నిమ్మళముగా నుండెను.

కీర్తనలు 49:1 సర్వజనులారా ఆలకించుడి.

కీర్తనలు 49:2 సామాన్యులేమి సామంతులేమి ధనికులేమి దరిద్రులేమి లోకనివాసులారా, మీరందరు ఏకముగా కూడి చెవియొగ్గుడి. నా నోరు విజ్ఞాన విషయములను పలుకును

కీర్తనలు 50:1 దేవాది దేవుడైన యెహోవా ఆజ్ఞ ఇచ్చుచున్నాడు తూర్పుదిక్కు మొదలుకొని పడమటి దిక్కువరకు భూనివాసులను రమ్మని ఆయన పిలుచుచున్నాడు.

కీర్తనలు 96:10 యెహోవా రాజ్యము చేయుచున్నాడు లోకము కదలకుండ స్థిరపరచబడియున్నది న్యాయమునుబట్టి ఆయన జనములను పరిపాలన చేయును. ఈ వార్తను అన్యజనులలో ప్రకటించుడి

మార్కు 16:15 మరియుమీరు సర్వలోకమునకు వెళ్లి సర్వసృష్టికి సువార్తను ప్రకటించుడి.

మార్కు 16:16 నమ్మి బాప్తిస్మము పొందినవాడు రక్షింపబడును; నమ్మని వానికి శిక్ష విధింపబడును.

ప్రకటన 2:7 చెవిగలవాడు ఆత్మ సంఘములతో చెప్పుచున్న మాట వినునుగాక. జయించు వానికి దేవుని పరదైసులో ఉన్న జీవవృక్ష ఫలములు భుజింపనిత్తును.

యెషయా 1:2 యెహోవా మాటలాడుచున్నాడు ఆకాశమా, ఆలకించుము; భూమీ, చెవియొగ్గుము. నేను పిల్లలను పెంచి గొప్పవారినిగా చేసితిని వారు నామీద తిరుగబడియున్నారు.

ద్వితియోపదేశాకాండము 4:26 మీరు ఈ యొర్దాను దాటి స్వాధీనపరచుకొనబోవు దేశములో ఉండకుండ త్వరలోనే బొత్తిగా నశించిపోదురని భూమ్యాకాశములను మీమీద సాక్షులుగా ఉంచుచున్నాను. ఆ దేశమందు బహు దినములుండక మీరు బొత్తిగా నశించిపోదురు.

ద్వితియోపదేశాకాండము 32:1 ఆకాశమండలమా, చెవినొగ్గుము; నేను మాటలాడుదును భూమండలమా, నా నోటిమాట వినుము.

యిర్మియా 22:29 దేశమా, దేశమా, దేశమా, యెహోవా మాట వినుము.

మీకా 6:1 యెహోవా సెలవిచ్చు మాట ఆలకించుడి నీవువచ్చి పర్వతములను సాక్ష్యముపెట్టి వ్యాజ్యెమాడుము, కొండలకు నీ స్వరము వినబడనిమ్ము.

మీకా 6:2 తన జనులమీద యెహోవాకు వ్యాజ్యెము కలదు, ఆయన ఇశ్రాయేలీయులమీద వ్యాజ్యెమాడుచున్నాడు; నిశ్చలములై భూమికి పునాదులుగా ఉన్న పర్వతములారా, యెహోవా ఆడు వ్యాజ్యెము ఆలకించుడి.

కీర్తనలు 24:1 భూమియు దాని సంపూర్ణతయు లోకమును దాని నివాసులును యెహోవావే.

1కొరిందీయులకు 10:26 భూమియు దాని పరిపూర్ణతయు ప్రభునివైయున్నవి.

ఆదికాండము 25:23 రెండు జనములు నీ గర్భములో కలవు. రెండు జనపదములు నీ కడుపులోనుండి ప్రత్యేకముగా వచ్చును. ఒక జనపదము కంటె ఒక జనపదము బలిష్టమై యుండును. పెద్దవాడు చిన్నవానికి దాసుడగును అనెను.

యెషయా 18:6 అవి కొండలలోని క్రూరపక్షులకును భూమిమీదనున్న మృగములకును విడువబడును వేసవికాలమున క్రూరపక్షులును శీతకాలమున భూమిమీదనున్న మృగములును వాటిని తినును.

యెషయా 21:11 దూమానుగూర్చిన దేవోక్తి కావలివాడా, రాత్రి యెంత వేళైనది? కావలివాడా, రాత్రి యెంత వేళైనది? అని యొకడు శేయీరులోనుండి కేకలు వేసి నన్ను అడుగుచున్నాడు

యెషయా 47:3 నీ కోకయు తీసివేయబడును నీకు కలిగిన యవమానము వెల్లడియగును నేను ప్రతిదండన చేయుచు నరులను మన్నింపను.

యెషయా 48:12 యాకోబూ, నేను పిలిచిన ఇశ్రాయేలూ, నాకు చెవియొగ్గి వినుము. నేనే ఆయనను నేను మొదటివాడను కడపటివాడను

యిర్మియా 4:16 ముట్టడి వేయువారు దూరదేశమునుండి వచ్చి యూదా పట్టణములను పట్టుకొందుమని బిగ్గరగా అరచుచున్నారని యెరూషలేమునుగూర్చి ప్రకటనచేయుడి, జనములకు తెలియజేయుడి.

యిర్మియా 25:21 ఎదోమీయులును మోయాబీయులును అమ్మోనీయులును

యిర్మియా 49:7 సైన్యములకధిపతియగు యెహోవా ఎదోమునుగూర్చి ఈలాగు సెలవిచ్చుచున్నాడు తేమానులో జ్ఞానమిక నేమియులేదా? వివేకులకు ఇక ఆలోచన లేకపోయెనా? వారి జ్ఞానము వ్యర్థమాయెనా?

విలాపవాక్యములు 4:21 అతని నీడక్రిందను అన్యజనులమధ్యను బ్రదికెదమని మేమనుకొన్నవాడు పట్టబడెను. ఊజు దేశములో నివసించు ఎదోముకుమారీ, సంతోషించుము ఉత్సహించుము ఈ గిన్నెలోనిది త్రాగుట నీ పాలవును నీవు దానిలోనిది త్రాగి మత్తిల్లి నిన్ను దిగంబరినిగా చేసికొందువు

యెహెజ్కేలు 25:8 మరియు ప్రభువైన యెహోవా ఈ మాట సెలవిచ్చుచున్నాడు ఇతర జనములన్నిటికిని యూదా వారికిని భేదమేమియని మోయాబీయులును శేయీరు పట్టణపువారును అందురు గనుక

యెహెజ్కేలు 25:13 ఎదోముమీద నా చెయ్యిచాపి, మనుష్యులేమి పశువులేమి దానిలో నుండకుండ నేను సమస్తమును నిర్మూలము చేయుదును, తేమాను పట్టణము మొదలుకొని నేను దాని పాడుచేయుదును, దదానువరకు జనులందరును ఖడ్గముచేత కూలుదురు.

యెహెజ్కేలు 32:29 అక్కడ ఎదోమును దాని రాజులును దాని అధిపతులందరును ఉన్నారు; వారు పరాక్రమవంతులైనను కత్తిపాలైన వారియొద్ద ఉంచబడిరి; సున్నతిలేని వారియొద్దను పాతాళములోనికి దిగిపోయిన వారియొద్దను వారును పండుకొనిరి.

యెహెజ్కేలు 35:2 నరపుత్రుడా, శేయీరు పర్వతమువైపు నీ ముఖము త్రిప్పుకొని

యెహెజ్కేలు 36:5 ప్రభువైన యెహోవా సెలవిచ్చునదేమనగా సంతుష్ట హృదయులై నా దేశమును హీనముగా చూచి దోపుడు సొమ్ముగా ఉండుటకై తమకు అది స్వాస్థ్యమని దాని స్వాధీనపరచుకొనిన ఎదోమీయులనందరినిబట్టియు, శేషించిన అన్యజనులనుబట్టియు నారోషాగ్నితో యథార్థముగా మాట ఇచ్చియున్నాను.

యెహెజ్కేలు 38:17 ప్రభువగు యెహోవా సెలవిచ్చునదేమనగా నిన్ను వారిమీదికి రప్పించెదనని పూర్వమందు ఏటేట ప్రవచించుచు వచ్చిన ఇశ్రాయేలీయుల ప్రవక్తలైన నా సేవకులద్వారా నేను సెలవిచ్చినమాట నిన్నుగూర్చినదే గదా?

హోషేయ 4:1 ఇశ్రాయేలు వారలారా, యెహోవా మాట ఆలకించుడి. సత్యమును కనికరమును దేవునిగూర్చిన జ్ఞానమును దేశమందు లేకపోవుట చూచి యెహోవా దేశనివాసులతో వ్యాజ్యెమాడుచున్నాడు.

యోవేలు 1:2 పెద్దలారా, ఆలకించుడి దేశపు కాపురస్థులారా, మీరందరు చెవియొగ్గి వినుడి ఈలాటి సంగతి మీ దినములలో గాని మీ పితరుల దినములలోగాని జరిగినదా?

యోవేలు 3:9 అన్యజనులకు ఈ సమాచారము ప్రకటన చేయుడి యుద్ధము ప్రతిష్ఠించుడి, బలాఢ్యులను రేపుడి, యోధులందరు సిద్ధపడి రావలెను.

యోవేలు 3:19 ఐగుప్తీయులును ఎదోమీయులును యూదావారిమీద బలాత్కారము చేసి తమ తమ దేశములలో నిర్దోషులగు వారికి ప్రాణహాని కలుగజేసిరి గనుక ఐగుప్తుదేశము పాడగును, ఎదోముదేశము నిర్జనమైన యెడారిగా ఉండును.

ఆమోసు 1:11 యెహోవా సెలవిచ్చునదేమనగా ఎదోము మూడుసార్లు నాలుగుసార్లు చేసిన దోషములనుబట్టి నేను తప్పకుండ వానిని శిక్షింతును. ఏలయనగా వాడు కనికరము చాలించుకొని ఖడ్గము పట్టుకొని యెడతెగని కోపముతో తనకు సహోదరులగు వారిని మానక చీల్చుచువచ్చెను.

ఓబధ్యా 1:1 ఓబద్యాకు కలిగిన దర్శనము. ఎదోమును గురించి ప్రభువగు యెహోవా సెలవిచ్చునది. యెహోవాయొద్దనుండి వచ్చిన సమాచారము మాకు వినబడెను. ఎదోము మీద యుద్ధము చేయుదము లెండని జనులను రేపుటకై దూత పంపబడియున్నాడు.

జెకర్యా 14:12 మరియు యెహోవా తెగుళ్లు పుట్టించి యెరూషలేముమీద యుద్ధము చేసిన జనములనందరిని ఈలాగున మొత్తును; వారు నిలిచియున్న పాటుననే వారి దేహములు కుళ్లిపోవును, వారి కన్నులు కనుతొఱ్ఱలలో ఉండియే కుళ్లిపోవును వారి నాలుకలు నోళ్లలో ఉండియే కుళ్లిపోవును.

ప్రకటన 11:18 జనములు కోపగించినందున నీకు కోపము వచ్చెను. మృతులు తీర్పు పొందుటకును, నీ దాసులగు ప్రవక్తలకును పరిశుద్ధులకును, నీ నామమునకు భయపడువారికిని తగిన ఫలమునిచ్చుటకును, గొప్పవారేమి కొద్దివారేమి భూమిని నశింపజేయువారిని నశింపజేయుటకును సమయము వచ్చియున్నదని చెప్పిరి.

ప్రకటన 16:14 అవి సూచనలు చేయునట్టి దయ్యముల ఆత్మలే; అవి సర్వాధికారియైన దేవుని మహాదినమున జరుగు యుద్ధమునకు లోకమంతట ఉన్న రాజులను పోగుచేయవలెనని వారియొద్దకు బయలు వెళ్లి

ప్రకటన 19:17 మరియు ఒక దూత సూర్యబింబములో నిలిచియుండుట చూచితిని.