Logo

యెషయా అధ్యాయము 40 వచనము 14

యోబు 21:22 ఎవడైనను దేవునికి జ్ఞానము నేర్పునా? పరలోకవాసులకు ఆయన తీర్పు తీర్చును గదా.

యోబు 36:22 ఆలోచించుము, దేవుడు శక్తిమంతుడై ఘనత వహించిన వాడు ఆయనను పోలిన బోధకుడెవడు?

యోబు 36:23 ఆయనకు మార్గము నియమించినవాడెవడు? నీవు దుర్మార్గపు పనులు చేయుచున్నావని ఆయనతో ఎవడు పలుక తెగించును?

లూకా 10:22 సమస్తమును నా తండ్రిచేత నాకు అప్పగింపబడియున్నది; కుమారుడెవడో, తండ్రి తప్ప మరెవడును ఎరుగడు; తండ్రి ఎవడో, కుమారుడును కుమారుడెవనికి ఆయనను బయలుపరచ నుద్దేశించునో వాడును తప్ప, మరెవడును ఎరుగడని చెప్పెను.

యోహాను 1:13 వారు దేవునివలన పుట్టినవారే గాని, రక్తమువలన నైనను శరీరేచ్ఛవలన నైనను మానుషేచ్ఛవలన నైనను పుట్టినవారు కారు.

రోమీయులకు 11:34 ప్రభువు మనస్సును ఎరిగినవాడెవడు? ఆయనకు ఆలోచన చెప్పిన వాడెవడు?

1కొరిందీయులకు 2:16 ప్రభువు మనస్సును ఎరిగి ఆయనకు బోధింపగలవాడెవడు? మనమైతే క్రీస్తు మనస్సు కలిగినవారము.

ఎఫెసీయులకు 1:11 మరియు క్రీస్తునందు ముందుగా నిరీక్షించిన మనము తన మహిమకు కీర్తి కలుగజేయవలెనని,

లేవీయకాండము 22:12 యాజకుని కుమార్తె అన్యునికియ్యబడినయెడల ఆమె ప్రతిష్ఠితమైన వాటిలో ప్రతిష్ఠార్పణమును తినకూడదు.

2దినవృత్తాంతములు 32:3 పట్టణముబయటనున్న ఊటల నీళ్లను అడ్డవలెనని తలచి, తన యధిపతులతోను పరాక్రమశాలులతోను యోచన చేయగా వారతనికి సహాయము చేసిరి.

యోబు 12:13 జ్ఞానశౌర్యములు ఆయనయొద్ద ఉన్నవి ఆలోచనయు వివేచనయు ఆయనకు కలవు.

యోబు 34:13 ఎవడైన భూమిని ఆయనకు అప్పగింత పెట్టెనా? ఎవడైన సర్వప్రపంచ భారమును ఆయన కప్పగించెనా?

యెషయా 19:12 నీ జ్ఞానులు ఏమైరి? సైన్యములకధిపతియగు యెహోవా ఐగుప్తునుగూర్చి నిర్ణయించినదానిని వారు గ్రహించి నీతో చెప్పవలెను గదా?

యిర్మియా 23:18 యెహోవా మాట విని గ్రహించునట్లు ఆయన సభలో నిలుచువాడెవడు? నా మాటను గ్రహించునట్లు దాని లక్ష్యము చేసినవాడెవడు?

యిర్మియా 32:19 ఆలోచన విషయములో నీవే గొప్పవాడవు, క్రియలు జరిగించు విషయములో శక్తి సంపన్నుడవు, వారి ప్రవర్తనలనుబట్టియు వారి క్రియాఫలమునుబట్టియు అందరికి ప్రతిఫలమిచ్చుటకై నరపుత్రుల మార్గములన్నిటిని నీవు కన్నులార చూచుచున్నావు.

అపోస్తలులకార్యములు 4:28 వాటినన్నిటిని చేయుటకై నీవు అభిషేకించిన నీ పరిశుద్ధ సేవకుడైన యేసునకు విరోధముగా హేరోదును పొంతిపిలాతును అన్యజనులతోను ఇశ్రాయేలు ప్రజలతోను ఈ పట్టణమందు నిజముగా కూడుకొనిరి.

ప్రకటన 5:3 అయితే పరలోకమందుగాని భూమిమీదగాని భూమిక్రిందగాని ఆ గ్రంథము విప్పుటకైనను చూచుటకైనను ఎవనికిని శక్తి లేకపోయెను.