Logo

యెషయా అధ్యాయము 50 వచనము 9

రోమీయులకు 8:32 తన సొంతకుమారుని అనుగ్రహించుటకు వెనుకతీయక మన అందరికొరకు ఆయనను అప్పగించినవాడు ఆయనతో పాటు సమస్తమును మనకెందుకు అనుగ్రహింపడు?

రోమీయులకు 8:33 దేవునిచేత ఏర్పరచబడిన వారిమీద నేరము మోపువాడెవడు? నీతిమంతులుగా తీర్చువాడు దేవుడే;

రోమీయులకు 8:34 శిక్ష విధించువాడెవడు? చనిపోయిన క్రీస్తుయేసే; అంతేకాదు, మృతులలోనుండి లేచినవాడును దేవుని కుడిపార్శ్వమున ఉన్నవాడును మనకొరకు విజ్ఞాపనము కూడ చేయువాడును ఆయనే

1తిమోతి 3:16 నిరాక్షేపముగా దైవభక్తినిగూర్చిన మర్మము గొప్పదైయున్నది; ఆయన సశరీరుడుగా ప్రత్యక్షుడయ్యెను. ఆత్మ విషయమున నీతిపరుడని తీర్పునొందెను దేవదూతలకు కనబడెను రక్షకుడని జనములలో ప్రకటింపబడెను లోకమందు నమ్మబడెను ఆరోహణుడై తేజోమయుడయ్యెను.

యెషయా 41:1 ద్వీపములారా, నాయెదుట మౌనముగా నుండుడి జనములారా, నూతనబలము పొందుడి. వారు నా సన్నిధికి వచ్చి మాటలాడవలెను వ్యాజ్యెము తీర్చుకొనుటకు మనము కూడుకొందము రండి.

యెషయా 41:21 వ్యాజ్యెమాడుడని యెహోవా అనుచున్నాడు మీ రుజువు చూపించుడని యాకోబు రాజు చెప్పుచున్నాడు.

నిర్గమకాండము 22:9 ప్రతి విధమైన ద్రోహమునుగూర్చి, అనగా ఎద్దునుగూర్చి గాడిదనుగూర్చి గొఱ్ఱనుగూర్చి బట్టనుగూర్చి పోయినదాని నొకడు చూచి యిది నాదని చెప్పిన దానిగూర్చి ఆ యిద్దరి వ్యాజ్యెము దేవుని యొద్దకు తేబడవలెను. దేవుడు ఎవనిమీద నేరము స్థాపించునో వాడు తన పొరుగువానికి రెండంతలు అచ్చుకొనవలెను.

ద్వితియోపదేశాకాండము 19:17 ఆ వివాదముగల ఇద్దరు మనుష్యులు యెహోవా సన్నిధిని, అనగా ఆ కాలములోనున్న యాజకుల యెదుటను న్యాయాధిపతుల యెదుటను నిలువవలెను.

యోబు 23:3 ఆయన నివాసస్థానమునొద్ద నేను చేరునట్లుగా ఆయనను ఎక్కడ కనుగొందునో అది నాకు తెలియబడును గాక.

యోబు 23:4 ఆయన సన్నిధిని నేను నా వ్యాజ్యెమును విశదపరచెదను వాదములతో నా నోరు నింపుకొనెదను.

యోబు 23:5 ఆయన నాకు ప్రత్యుత్తరముగా ఏమి పలుకునో అది నేను తెలిసికొందును ఆయన నాతో పలుకు మాటలను గ్రహించుకొందును.

యోబు 23:6 ఆయన తన అధికబలముచేత నాతో వ్యాజ్యెమాడునా? ఆయన ఆలాగు చేయక నా మనవి ఆలకించును

యోబు 23:7 అప్పుడు యథార్ధవంతుడు ఆయనతో వ్యాజ్యెమాడవచ్చును. కావున నేను ఎన్నటికిని నా న్యాయాధిపతివలన శిక్ష నొందకపోవుదును.

మత్తయి 5:25 నీ ప్రతివాదితో నీవును త్రోవలో ఉండగానే త్వరగా వానితో సమాధానపడుము; లేనియెడల ఒకవేళ నీ ప్రతివాది నిన్ను న్యాయాధిపతికి అప్పగించును, న్యాయాధిపతి నిన్ను బంట్రౌతుకు అప్పగించును, అంతట నీవు చెరసాలలో వేయబడుదువు.

జెకర్యా 3:1 మరియు యెహోవా దూత యెదుట ప్రధానయాజకుడైన యెహోషువ నిలువబడుటయు, సాతాను ఫిర్యాదియై అతని కుడిపార్శ్వమున నిలువబడుటయు అతడు నాకు కనుపరచెను.

జెకర్యా 3:2 సాతానూ, యెహోవా నిన్ను గద్దించును, యెరూషలేమును కోరుకొను యెహోవా నిన్ను గద్దించును ఇతడు అగ్నిలోనుండి తీసిన కొరవివలెనేయున్నాడుగదా అని యెహోవా దూత సాతానుతో అనెను.

జెకర్యా 3:3 యెహోషువ మలిన వస్త్రములు ధరించినవాడై దూత సముఖములో నిలువబడియుండగా

జెకర్యా 3:4 దూత దగ్గర నిలిచియున్నవారిని పిలిచి ఇతని మైలబట్టలు తీసివేయుడని ఆజ్ఞాపించి నేను నీ దోషమును పరిహరించి ప్రశస్తమైన వస్త్రములతో నిన్ను అలంకరించుచున్నాను అని సెలవిచ్చెను.

జెకర్యా 3:5 అతని తలమీద తెల్లని పాగా పెట్టించుడని నేను మనవిచేయగా వారు అతని తలమీద తెల్లని పాగాపెట్టి వస్త్రములతో అతనిని అలంకరించిరి; యెహోవా దూత దగ్గర నిలుచుండెను.

జెకర్యా 3:6 అప్పుడు యెహోవా దూత యెహోషువకు ఈలాగు ఆజ్ఞ ఇచ్చెను.

జెకర్యా 3:7 సైన్యములకు అధిపతియగు యెహోవా సెలవిచ్చునదేమనగా నా మార్గములలొ నడుచుచు నేను నీకప్పగించిన దానిని భద్రముగా గైకొనినయెడల, నీవు నా మందిరముమీద అధికారివై నా ఆవరణములను కాపాడువాడవగుదువు; మరియు ఇక్కడ నిలువబడు వారికి కలిగినట్లు నా సన్నిధిని నిలుచు భాగ్యము నీకిత్తును.

జెకర్యా 3:8 ప్రధానయాజకుడవైన యెహోషువా, నీయెదుట కూర్చుండు నీ సహకారులు సూచనలుగా ఉన్నారు; నీవును వారును నామాట ఆలకింపవలెను, ఏదనగా చిగురు అను నా సేవకుని నేను రప్పింపబోవుచున్నాను.

జెకర్యా 3:9 యెహోషువ యెదుట నేనుంచిన రాతిని తేరి చూడుడి, ఆ రాతికి ఏడు నేత్రములున్నవి, దాని చెక్కడపు పని చేయువాడను నేను. ఇదే సైన్యములకు అధిపతియగు యెహోవా వాక్కు; మరియు ఒక దినములోగానే నేను ఈ దేశము యొక్క దోషమును పరిహరింతును;

జెకర్యా 3:10 ఆ దినమున ద్రాక్షచెట్ల క్రిందను అంజూరపుచెట్ల క్రిందను కూర్చుండుటకు మీరందరు ఒకరినొకరు పిలుచుకొని పోవుదురు; ఇదే సైన్యములకు అధిపతియగు యెహోవా వాక్కు.

ప్రకటన 12:10 మరియు ఒక గొప్ప స్వరము పరలోకమందు ఈలాగు చెప్పుట వింటిని రాత్రింబగళ్లు మన దేవుని యెదుట మన సహోదరులమీద నేరము మోపువాడైన అపవాది పడద్రోయబడియున్నాడు గనుక ఇప్పుడు రక్షణయు శక్తియు రాజ్యమును మన దేవునివాయెను; ఇప్పుడు అధికారము ఆయన క్రీస్తుదాయెను.

యోబు 13:19 నాతో వ్యాజ్యెమాడ చూచువాడెవడు? ఎవడైన నుండినయెడల నేను నోరుమూసికొని ప్రాణము విడిచెదను.

యోబు 40:2 ఆక్షేపణలు చేయజూచువాడు సర్వశక్తుడగు దేవునితో వాదింపవచ్చునా? దేవునితో వాదించువాడు ఇప్పుడు ప్రత్యుత్తర మియ్యవలెను.

యెషయా 54:17 నీకు విరోధముగా రూపింపబడిన యే ఆయుధమును వర్ధిల్లదు న్యాయవిమర్శలో నీకు దోషారోపణచేయు ప్రతివానికి నీవు నేరస్థాపన చేసెదవు యెహోవాయొక్క సేవకుల నీతి నావలన కలుగుచున్నది; ఇది వారి స్వాస్థ్యము, ఇదే యెహోవా వాక్కు.

యోహాను 7:26 ఇదిగో ఈయన బహిరంగముగా మాటలాడుచున్నను ఈయనను ఏమనరు; ఈయన క్రీస్తని అధికారులు నిజముగా తెలిసికొనియుందురా?

అపోస్తలులకార్యములు 28:21 అందుకు వారు యూదయనుండి నిన్నుగూర్చి పత్రికలు మాకు రాలేదు; ఇక్కడికి వచ్చిన సహోదరులలో ఒక్కడైనను నిన్నుగూర్చి చెడుసంగతి ఏదియు మాకు తెలియపరచనులేదు, మరియు ఎవరును చెప్పుకొనను లేదు

రోమీయులకు 8:33 దేవునిచేత ఏర్పరచబడిన వారిమీద నేరము మోపువాడెవడు? నీతిమంతులుగా తీర్చువాడు దేవుడే;

1పేతురు 5:8 నిబ్బరమైన బుద్ధి గలవారై మెలకువగా ఉండుడి; మీ విరోధియైన అపవాది గర్జించు సింహమువలె ఎవరిని మింగుదునా అని వెదకుచు తిరుగుచున్నాడు.