Logo

యెషయా అధ్యాయము 60 వచనము 5

యెషయా 49:18 కన్నులెత్తి నలుదిశల చూడుము వీరందరు కూడుకొనుచు నీయొద్దకు వచ్చుచున్నారు నీవు వీరినందరిని ఆభరణముగా ధరించుకొందువు పెండ్లికుమార్తె ఒడ్డాణము ధరించుకొనునట్లు నీవు వారిని అలంకారముగా ధరించుకొందువు నా జీవముతోడని ప్రమాణము చేయుచున్నానని యెహోవా సెలవిచ్చుచున్నాడు.

యోహాను 4:35 ఇంక నాలుగు నెలలైన తరువాత కోతకాలము వచ్చునని మీరు చెప్పుదురు గదా. ఇదిగో మీ కన్నులెత్తి పొలములను చూడుడి; అవి ఇప్పుడే తెల్లబారి కోతకు వచ్చియున్నవని మీతో చెప్పుచున్నాను.

అపోస్తలులకార్యములు 13:44 మరుసటి విశ్రాంతిదినమున దాదాపుగా ఆ పట్టణమంతయు దేవుని వాక్యము వినుటకు కూడివచ్చెను.

యెషయా 42:6 గ్రుడ్డివారి కన్నులు తెరచుటకును బంధింపబడినవారిని చెరసాలలోనుండి వెలుపలికి తెచ్చుటకును చీకటిలో నివసించువారిని బందీగృహములోనుండి వెలుపలికి తెచ్చుటకును

యెషయా 49:20 నీవు సంతానహీనురాలవైనప్పుడు నీకు పుట్టిన కుమారులు ఈ స్థలము మాకు ఇరుకుగా ఉన్నది. ఇంక విశాలమైన స్థలము మాకిమ్మని నీ చెవులలో చెప్పుదురు.

యెషయా 49:21 అప్పుడు నీవు నేను నా పిల్లలను పోగొట్టుకొని, సంతానహీనురాలను, ఒంటరినై ఇటు అటు తిరుగులాడుచున్న పరదేశురాలనే గదా? వీరిని నాయందు కనినవాడెవడు? వీరిని పెంచినవాడెవడు? నేను ఒంటరికత్తెనై విడువబడితిని, వీరు ఎక్కడ ఉండిరి? అని నీ మనస్సులో నీవనుకొందువు.

యెషయా 49:22 ప్రభువగు యెహోవా ఈలాగు సెలవిచ్చుచున్నాడు నేను జనములతట్టు నా చెయి యెత్తుచున్నాను జనములతట్టు నా ధ్వజము ఎత్తుచున్నాను వారు నీ కుమారులను రొమ్ముననుంచుకొని వచ్చెదరు నీ కుమార్తెలు వారి భుజములమీద మోయబడెదరు

యెషయా 66:11 ఆదరణకరమైన ఆమె స్తన్యమును మీరు కుడిచి తృప్తినొందెదరు ఆమె మహిమాతిశయము అనుభవించుచు ఆనందించెదరు.

యెషయా 66:12 యెహోవా ఈలాగు సెలవిచ్చుచున్నాడు ఆలకించుడి, నదివలె సమాధానమును ఆమెయొద్దకు పారజేయుదును మీరు జనముల ఐశ్వర్యము అనుభవించునట్లు ఒడ్డుమీద పొర్లిపారు జలప్రవాహమువలె మీయొద్దకు దానిని రాజేతును మీరు చంకను ఎత్తికొనబడెదరు మోకాళ్లమీద ఆడింపబడెదరు.

మత్తయి 8:11 అనేకులు తూర్పునుండియు పడమటనుండియు వచ్చి అబ్రాహాముతో కూడను, ఇస్సాకుతో కూడను, యాకోబుతో కూడను, పరలోకరాజ్యమందు కూర్చుందురు గాని

గలతీయులకు 3:28 ఇందులో యూదుడని గ్రీసుదేశస్థుడని లేదు, దాసుడని స్వతంత్రుడని లేదు, పురుషుడని స్త్రీ అని లేదు; యేసుక్రీస్తునందు మీరందరును ఏకముగా ఉన్నారు.

గలతీయులకు 3:29 మీరు క్రీస్తు సంబంధులైతే ఆ పక్షమందు అబ్రాహాముయొక్క సంతానమైయుండి వాగ్దాన ప్రకారము వారసులైయున్నారు.

ఆదికాండము 13:14 లోతు అబ్రామును విడిచిపోయిన తరువాత యెహోవా ఇదిగో నీ కన్నులెత్తి నీవు ఉన్నచోట నుండి ఉత్తరపుతట్టు దక్షిణపుతట్టు తూర్పుతట్టు పడమరతట్టును చూడుము;

కీర్తనలు 22:31 వారు వచ్చి ఆయన దీని చేసెనని పుట్టబోవు ప్రజలకు తెలియజేతురు ఆయన నీతిని వారికి ప్రచురపరతురు.

కీర్తనలు 47:9 జనముల ప్రధానులు అబ్రాహాముయొక్క దేవునికి జనులై కూడుకొనియున్నారు.

కీర్తనలు 115:14 యెహోవా మిమ్మును మీ పిల్లలను వృద్ధిపొందించును.

యెషయా 54:7 నిమిషమాత్రము నేను నిన్ను విసర్జించితిని గొప్ప వాత్సల్యముతో నిన్ను సమకూర్చెదను

యెషయా 60:8 మేఘమువలెను ఎగయు గువ్వలవలెను గూళ్లకు ఎగసివచ్చు వీరెవరు?

యెషయా 60:9 నీ దేవుడైన యెహోవా నామమునుబట్టి ఆయన నిన్ను శృంగారించినందున ఇశ్రాయేలు పరిశుద్ధదేవుని నామమునుబట్టి దూరమునుండి నీ కుమారులను తమ వెండి బంగారములను తీసికొని వచ్చుటకు ద్వీపములు నాకొరకు కనిపెట్టుకొనుచున్నవి తర్షీషు ఓడలు మొదట వచ్చుచున్నవి.

యిర్మియా 30:10 మరియు యెహోవా సెలవిచ్చునదేమనగా నా సేవకుడవైన యాకోబూ, భయపడకుము; ఇశ్రాయేలూ, విస్మయమొందకుము,నేను దూరముననుండు నిన్నును, చెరలోనికిపోయిన దేశముననుండు నీ సంతానపువారిని రక్షించుచున్నాను; బెదరించువాడు లేకుండ యాకోబు సంతతి తిరిగివచ్చి నిమ్మళించి నెమ్మదిపొందును.

యెహెజ్కేలు 16:61 నీ అక్కచెల్లెండ్రు నీవు చేసిన నిబంధనలో పాలివారు కాకుండినను నేను వారిని నీకు కుమార్తెలుగా ఇయ్యబోవుచున్నాను. నీవు వారిని చేర్చుకొనునప్పుడు నీ వ్రవర్తన మనస్సునకు తెచ్చుకొని సిగ్గుపడుదువు.

యెహెజ్కేలు 17:23 ఇశ్రాయేలు దేశములోని యెత్తుగల పర్వతము మీద నేను దానిని నాటగా అది శాఖలు విడిచి బహుగా ఫలించు శ్రేష్ఠమైన దేవదారు చెట్టగును, సకల జాతుల పక్షులును దానిలో గూళ్లు కట్టుకొనును.

హోషేయ 1:10 ఇశ్రాయేలీయుల జనసంఖ్య అమితమై లెక్కలేని సముద్రపు ఇసుకంత విస్తారమగును; ఏ స్థలమందు మీరు నా జనులు కారన్నమాట జనులు వారితో చెప్పుదురో ఆ స్థలముననే మీరు జీవముగల దేవుని కుమారులైయున్నారని వారితో చెప్పుదురు.

మీకా 7:12 ఆ దినమందు అష్షూరు దేశమునుండియు, ఐగుప్తు దేశపు పట్టణములనుండియు, ఐగుప్తు మొదలుకొని యూఫ్రటీసు నదివరకు ఉన్న ప్రదేశమునుండియు, ఆ యా సముద్రముల మధ్య దేశములనుండియు, ఆ యా పర్వతముల మధ్య దేశములనుండియు జనులు నీయొద్దకు వత్తురు.

జెఫన్యా 3:10 చెదరిపోయినవారై నాకు ప్రార్థనచేయు నా జనులు కూషు దేశపు నదుల అవతలనుండి నాకు నైవేద్యముగా తీసికొని రాబడుదురు.

మత్తయి 24:31 మరియు ఆయన గొప్ప బూరతో తన దూతలను పంపును. వారు ఆకాశము యొక్క ఈ చివరనుండి ఆ చివరవరకు నలుదిక్కులనుండి ఆయన ఏర్పరచుకొనినవారిని పోగుచేతురు.

యోహాను 11:52 యేసు ఆ జనము కొరకును, ఆ జనము కొరకు మాత్రమేగాక చెదరిపోయిన దేవుని పిల్లలను ఏకముగా సమకూర్చుటకును, చావనైయున్నాడని ప్రవచించెను.

అపోస్తలులకార్యములు 15:3 కాబట్టి వారు సంఘమువలన సాగనంపబడి, ఫేనీకే సమరయ దేశములద్వారా వెళ్లుచు, అన్యజనులు దేవునివైపు తిరిగిన సంగతి తెలియపరచి సహోదరులకందరికిని మహా సంతోషము కలుగజేసిరి.

ఎఫెసీయులకు 2:13 అయినను మునుపు దూరస్థులైన మీరు ఇప్పుడు క్రీస్తుయేసునందు క్రీస్తు రక్తమువలన సమీపస్థులై యున్నారు.