Logo

లూకా అధ్యాయము 18 వచనము 25

మార్కు 6:26 రాజు బహుగా దుఃఖపడెను గాని తాను పెట్టుకొనిన ఒట్టు నిమిత్తమును తనతో కూర్చుండియున్నవారి నిమిత్తమును ఆమెకు ఇయ్యను అననొల్లక పోయెను.

2కొరిందీయులకు 7:9 మీరు దుఃఖపడితిరని సంతోషించుటలేదు గాని మీరు దుఃఖపడి మారుమనస్సు పొందితిరని యిప్పుడు సంతోషించుచున్నాను. ఏలయనగా ఏ విషయములోనైనను మావలన మీరు నష్టము పొందకుండుటకై, దైవచిత్తానుసారముగా దుఃఖపడితిరి.

2కొరిందీయులకు 7:10 దైవచిత్తానుసారమైన దుఃఖము రక్షణార్థమైన మారుమనస్సును కలుగజేయును; ఈ మారుమనస్సు దుఃఖమును పుట్టించదు. అయితే లోకసంబంధమైన దుఃఖము మరణమును కలుగజేయును.

ద్వితియోపదేశాకాండము 6:10 నీ దేవుడైన యెహోవా నీ పితరులైన అబ్రాహాము ఇస్సాకు యాకోబులతో చేసిన ప్రమాణమునుబట్టి నిన్ను ఆ దేశములో ప్రవేశపెట్టి, నీవు కట్టని గొప్పవగు మంచి పురములను

ద్వితియోపదేశాకాండము 6:11 నీవు నింపని మంచి ద్రవ్యములచేత నింపబడిన ఇండ్లను, నీవు త్రవ్వకపోయినను త్రవ్వబడిన బావులను, నీవు నాటని ద్రాక్షతోటలను ఒలీవల తోటలను నీకిచ్చిన తరువాత నీవు తిని తృప్తిపొందినప్పుడు

ద్వితియోపదేశాకాండము 6:12 దాసుల గృహమైన ఐగుప్తు దేశములోనుండి నిన్ను రప్పించిన యెహోవాను మరువకుండ నీవు జాగ్రత్తపడుము.

ద్వితియోపదేశాకాండము 8:11 నేడు నేను నీకాజ్ఞాపించు ఆయన ఆజ్ఞలను విధులను కట్టడలను నీవు అనుసరింపక నీ దేవుడైన యెహోవాను మరచి కడుపారతిని

ద్వితియోపదేశాకాండము 8:12 మంచి యిండ్లు కట్టించుకొని వాటిలో నివసింపగా,

ద్వితియోపదేశాకాండము 8:13 నీ పశువులు నీ గొఱ్ఱమేకలును వృద్ధియై నీకు వెండిబంగారములు విస్తరించి నీకు కలిగినదంతయు వర్థిల్లినప్పుడు

ద్వితియోపదేశాకాండము 8:14 నీ మనస్సు మదించి, దాసుల గృహమైన ఐగుప్తు దేశములోనుండి నిన్ను రప్పించిన నీ దేవుడైన యెహోవాను మరచెదవేమో.

ద్వితియోపదేశాకాండము 8:15 తాపకరమైన పాములును తేళ్లును కలిగి యెడారియై నీళ్లులేని భయంకరమైన ఆ గొప్ప అరణ్యములో ఆయన నిన్ను నడిపించెను, రాతిబండనుండి నీకు నీళ్లు తెప్పించెను,

ద్వితియోపదేశాకాండము 8:16 తుదకు నీకు మేలు చేయవలెనని నిన్ను అణుచుటకును శోధించుటకును నీ పితరులు ఎరుగని మన్నాతో అరణ్యమున నిన్ను పోషించెను.

ద్వితియోపదేశాకాండము 8:17 అయితే మీరు మా సామర్థ్యము మా బాహుబలము ఇంత భాగ్యము మాకు కలుగజేసెనని అనుకొందురేమో.

కీర్తనలు 10:3 దుష్టులు తమ మనోభిలాషనుబట్టి అతిశయపడుదురు లోభులు యెహోవాను తిరస్కరింతురు

కీర్తనలు 73:5 ఇతరులకు కలుగు ఇబ్బందులు వారికి కలుగవు ఇతరులకు పుట్టునట్లు వారికి తెగులు పుట్టదు.

కీర్తనలు 73:6 కావున గర్వము కంఠహారమువలె వారిని చుట్టుకొనుచున్నది వస్త్రమువలె వారు బలాత్కారము ధరించుకొందురు.

కీర్తనలు 73:7 క్రొవ్వుచేత వారి కన్నులు మెరకలైయున్నవి వారి హృదయాలోచనలు బయటికి కానవచ్చుచున్నవి

కీర్తనలు 73:8 ఎగతాళి చేయుచు బలాత్కారముచేత జరుగు కీడునుగూర్చి వారు మాటలాడుదురు. గర్వముగా మాటలాడుదురు.

కీర్తనలు 73:9 ఆకాశముతట్టు వారు ముఖము ఎత్తుదురు వారి నాలుక భూసంచారము చేయును.

కీర్తనలు 73:10 వారి జనము వారిపక్షము చేరును వారు జలపానము సమృద్ధిగా చేయుదురు.

కీర్తనలు 73:11 దేవుడు ఎట్లు తెలిసికొనును మహోన్నతునికి తెలివియున్నదా? అని వారనుకొందురు.

కీర్తనలు 73:12 ఇదిగో ఇట్టివారు భక్తిహీనులు. వీరు ఎల్లప్పుడు నిశ్చింతగలవారై ధనవృద్ధి చేసికొందురు.

సామెతలు 11:28 ధనమును నమ్ముకొనువాడు పాడైపోవును నీతిమంతులు చిగురాకువలె వృద్ధినొందుదురు

సామెతలు 18:11 ధనవంతునికి వాని ఆస్తి ఆశ్రయపట్టణము వాని దృష్టికి అది యెత్తయిన ప్రాకారము.

సామెతలు 30:9 ఎక్కువైనయెడల నేను కడుపు నిండినవాడనై నిన్ను విసర్జించి యెహోవా యెవడని అందునేమో లేక బీదనై దొంగిలి నా దేవుని నామమును దూషింతునేమో.

యిర్మియా 2:31 ఈ తరము వారలారా, యెహోవా సెలవిచ్చు మాట లక్ష్యపెట్టుడి నేను ఇశ్రాయేలునకు అరణ్యమువలెనైతినా? గాఢాంధకార దేశమువలెనైతినా? మేము స్వేచ్ఛగా తిరుగులాడువారమైతివిు; ఇకను నీయొద్దకు రామని నా ప్రజలేల చెప్పుచున్నారు?

యిర్మియా 5:5 ఘనులైనవారియొద్దకు పోయెదను వారితో మాటలాడెదను, వారు యెహోవా మార్గమును, తమ దేవుని న్యాయవిధిని ఎరిగినవారై యుందురుగదా అని నేననుకొంటిని. అయితే ఒకడును తప్పకుండ వారు కాడిని విరిచినవారుగాను కట్లను తెంపుకొనినవారుగాను ఉన్నారు.

మత్తయి 19:23 యేసు తన శిష్యులను చూచి ధనవంతుడు పరలోకరాజ్యములో ప్రవేశించుట దుర్లభమని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను.

మత్తయి 19:24 ఇదిగాక ధనవంతుడు పరలోకరాజ్యములో ప్రవేశించుటకంటె సూదిబెజ్జములో ఒంటె దూరుట సులభమని మీతో చెప్పుచున్నాననెను.

మత్తయి 19:25 శిష్యులు ఈ మాట విని మిక్కిలి ఆశ్చర్యపడి ఆలాగైతే ఎవడు రక్షణ పొందగలడని అడుగగా

మార్కు 10:23 అప్పుడు యేసు చుట్టు చూచి ఆస్తిగలవారు దేవుని రాజ్యములో ప్రవేశించుట ఎంతో దుర్లభమని తన శిష్యులతో చెప్పెను.

మార్కు 10:24 ఆయన మాటలకు శిష్యులు విస్మయమొందిరి. అందుకు యేసు తిరిగి వారితో ఇట్లనెను పిల్లలారా, తమ ఆస్తియందు నమ్మికయుంచువారు దేవుని రాజ్యములో ప్రవేశించుట ఎంతో దుర్లభము;

మార్కు 10:25 ధనవంతుడు దేవుని రాజ్యములో ప్రవేశించుటకంటె ఒంటె సూదిబెజ్జములో దూరుట సులభము.

మార్కు 10:26 అందుకు వారు అత్యధికముగా ఆశ్చర్యపడి అట్లయితే ఎవడు రక్షణ పొందగలడని ఆయన నడిగిరి.

మార్కు 10:27 యేసు వారిని చూచి ఇది మనుష్యులకు అసాధ్యమే గాని, దేవునికి అసాధ్యము కాదు; దేవునికి సమస్తమును సాధ్యమే అనెను.

1కొరిందీయులకు 1:26 సహోదరులారా, మిమ్మును పిలిచిన పిలుపును చూడుడి. మీలో లోకరీతిని జ్ఞానులైనను, ఘనులైనను, గొప్ప వంశమువారైనను అనేకులు పిలువబడలేదు గాని

1కొరిందీయులకు 1:27 ఏ శరీరియు దేవుని యెదుట అతిశయింపకుండునట్లు,

1తిమోతి 6:9 ధనవంతులగుటకు అపేక్షించువారు శోధనలోను, ఉరిలోను, అవివేక యుక్తములును హానికరములునైన అనేక దురాశలలోను పడుదురు. అట్టివి మనుష్యులను నష్టములోను నాశనములోను ముంచివేయును.

1తిమోతి 6:10 ఎందుకనగా ధనాపేక్ష సమస్తమైన కీడులకు మూలము; కొందరు దానిని ఆశించి విశ్వాసము నుండి తొలగిపోయి నానాబాధలతో తమ్మును తామే పొడుచుకొనిరి.

యాకోబు 2:5 నా ప్రియ సహోదరులారా, ఆలకించుడి; ఈ లోక విషయములో దరిద్రులైనవారిని విశ్వాసమందు భాగ్యవంతులుగాను, తన్ను ప్రేమించువారికి తాను వాగ్దానము చేసిన రాజ్యమునకు వారసులుగాను ఉండుటకు దేవుడేర్పరచుకొనలేదా?

యాకోబు 2:6 అయితే మీరు దరిద్రులను అవమానపరచుదురు. ధనవంతులు మీమీద కఠినముగా అధికారము చూపుదురు; మిమ్మును న్యాయసభలకు ఈడ్చుచున్నవారు వీరే గదా?

యాకోబు 2:7 మీకు పెట్టబడిన శ్రేష్ఠమైన నామమును దూషించువారు వీరే గదా?

యాకోబు 5:1 ఇదిగో ధనవంతులారా, మీమీదికి వచ్చెడి ఉపద్రవములనుగూర్చి ప్రలాపించి యేడువుడి.

యాకోబు 5:2 మీ ధనము చెడిపోయెను; మీ వస్త్రములు చిమ్మటలు కొట్టినవాయెను.

యాకోబు 5:3 మీ బంగారమును మీ వెండియు తుప్పుపట్టినవి; వాటి తుప్పు మీమీద సాక్ష్యముగా ఉండి అగ్నివలె మీ శరీరములను తినివేయును; అంత్యదినములయందు ధనము కూర్చు కొంటిరి.

యాకోబు 5:4 ఇదిగో మీ చేలు కోసిన పనివారికియ్యక, మీరు మోసముగా బిగపట్టిన కూలి మొఱ్ఱపెట్టుచున్నది. మీ కోతవారి కేకలు సైన్యములకు అధిపతియగు ప్రభువు యొక్క చెవులలో చొచ్చియున్నవి.

యాకోబు 5:5 మీరు భూమిమీద సుఖముగా జీవించి భోగాసక్తులై వధ దినమునందు మీ హృదయములను పోషించుకొంటిరి.

యాకోబు 5:6 మీరు నీతిమంతుడైనవానికి శిక్షవిధించి చంపుదురు, అతడు మిమ్మును ఎదిరింపడు.

మత్తయి 5:20 శాస్త్రుల నీతికంటెను పరిసయ్యుల నీతికంటెను మీ నీతి అధికము కానియెడల మీరు పరలోకరాజ్యములో ప్రవేశింపనేరరని మీతో చెప్పుచున్నాను.

మత్తయి 6:19 భూమిమీద మీకొరకు ధనమును కూర్చుకొనవద్దు; ఇక్కడ చిమ్మెటయు, తుప్పును తినివేయును, దొంగలు కన్నమువేసి దొంగిలెదరు.

మత్తయి 13:22 ముండ్లపొదలలో విత్తబడినవాడు వాక్యము వినువాడే గాని ఐహికవిచారమును ధనమోహమును ఆ వాక్యమును అణచివేయును గనుక వాడు నిష్ఫలుడవును.

మత్తయి 13:44 పరలోకరాజ్యము, పొలములో దాచబడిన ధనమును పోలియున్నది. ఒక మనుష్యుడు దాని కనుగొని దాచిపెట్టి, అది దొరికిన సంతోషముతో వెళ్లి, తనకు కలిగినదంతయు అమ్మి ఆ పొలమును కొనును.

లూకా 1:53 ఆకలిగొనిన వారిని మంచి పదార్థములతో సంతృప్తి పరచి ధనవంతులను వట్టిచేతులతో పంపివేసెను.

లూకా 8:14 ముండ్ల పొదలలో పడిన (విత్తనమును పోలిన) వారెవరనగా, విని కాలము గడిచినకొలది యీ జీవనసంబంధమైన విచారములచేతను ధనభోగములచేతను అణచివేయబడి పరిపక్వముగా ఫలింపనివారు.

లూకా 14:18 అయితే వారందరు ఏకమనస్సుతో నెపములు చెప్పసాగిరి. మొదటివాడు నేనొక పొలము కొనియున్నాను, అవశ్యముగా వెళ్లి దాని చూడవలెను, నన్ను క్షమింపవలెనని నిన్ను వేడు కొనుచున్నాననెను

లూకా 16:19 ధనవంతుడొకడుండెను. అతడు ఊదారంగు బట్టలును సన్నపు నార వస్త్రములును ధరించుకొని ప్రతి దినము బహుగా సుఖపడుచుండువాడు.

లూకా 19:2 దానిగుండా పోవుచుండెను. ఇదిగో సుంకపు గుత్తదారుడును ధనవంతుడునైన జక్కయ్య అను పేరుగల ఒకడు