Logo

లూకా అధ్యాయము 18 వచనము 29

లూకా 5:11 వారు దోనెలను దరికి చేర్చి, సమస్తమును విడిచిపెట్టి ఆయనను వెంబడించిరి.

మత్తయి 4:19 ఆయన నా వెంబడి రండి, నేను మిమ్మును మనుష్యులను పట్టు జాలరులనుగాచేతునని వారితో చెప్పెను;

మత్తయి 4:20 వెంటనే వారు తమ వలలు విడిచిపెట్టి ఆయనను వెంబడించిరి.

మత్తయి 4:21 ఆయన అక్కడనుండి వెళ్లి జెబెదయి కుమారుడైన యాకోబు, అతని సహోదరుడైన యోహాను అను మరి యిద్దరు సహోదరులు తమ తండ్రియైన జెబెదయియొద్ద దోనెలో తమ వలలు బాగుచేసి కొనుచుండగా చూచి వారిని పిలిచెను.

మత్తయి 4:22 వంటనే వారు తమ దోనెను తమ తండ్రిని విడిచిపెట్టి ఆయనను వెంబడించిరి.

మత్తయి 9:9 యేసు అక్కడనుండి వెళ్లుచు సుంకపు మెట్టునొద్ద కూర్చుండియున్న మత్తయి అను ఒక మనుష్యుని చూచి నన్ను వెంబడించుమని అతనితో చెప్పగా అతడు లేచి ఆయనను వెంబడించెను.

మత్తయి 19:27 పేతురు ఇదిగో మేము సమస్తమును విడిచిపెట్టి నిన్ను వెంబడించితివిు గనుక మాకేమి దొరకునని ఆయనను అడుగగా

మార్కు 10:28 పేతురు ఇదిగో మేము సమస్తమును విడిచిపెట్టి నిన్ను వెంబడించితిమని ఆయనతో చెప్పసాగెను.

ఫిలిప్పీయులకు 3:7 అయినను ఏవేవి నాకు లాభకరములై యుండెనో వాటిని క్రీస్తు నిమిత్తము నష్టముగా ఎంచుకొంటిని.

సామెతలు 20:6 దయచూపు వానిని కలిసికొనుట అనేకులకు తటస్థించును నమ్ముకొనదగినవాడు ఎవరికి కనబడును?

మత్తయి 4:20 వెంటనే వారు తమ వలలు విడిచిపెట్టి ఆయనను వెంబడించిరి.

మత్తయి 13:46 అతడు అమూల్యమైన యొక ముత్యమును కనుగొని, పోయి తనకు కలిగినదంతయు అమ్మి దాని కొనును.

మార్కు 1:18 వెంటనే వారు తమ వలలు విడిచి ఆయనను వెంబడించిరి.

లూకా 14:33 ఆ ప్రకారమే మీలో తనకు కలిగినదంతయు విడిచిపెట్టనివాడు నా శిష్యుడు కానేరడు.

1కొరిందీయులకు 13:3 బీదల పోషణకొరకు నా ఆస్తి అంతయు ఇచ్చినను, కాల్చబడుటకు నా శరీరమును అప్పగించినను, ప్రేమ లేనివాడనైతే నాకు ప్రయోజనమేమియు లేదు.