Logo

లూకా అధ్యాయము 24 వచనము 30

లూకా 14:23 అందుకు యజమానుడు--నా యిల్లు నిండునట్లు నీవు రాజమార్గముల లోనికిని కంచెల లోనికిని వెళ్లి లోపలికి వచ్చుటకు అక్కడివారిని బలవంతము చేయుము;

ఆదికాండము 19:3 అయినను అతడు మిక్కిలి బలవంతము చేసినప్పుడు వారు అతనితట్టు తిరిగి అతని యింట ప్రవేశించిరి. అతడు వారికి విందుచేసి పొంగని రొట్టెలు కాల్చగా వారు భోజనము చేసిరి.

2రాజులు 4:8 ఒక దినమందు ఎలీషా షూనేము పట్టణమునకు పోగా అచ్చట ఘనురాలైన యొక స్త్రీ భోజనమునకు రమ్మని అతని బలవంతముచేసెను గనుక అతడు ఆ మార్గమున వచ్చినప్పుడెల్ల ఆమె యింట భోజనము చేయుచు వచ్చెను.

అపోస్తలులకార్యములు 16:14 అప్పుడు లూదియయను దైవభక్తిగల యొక స్త్రీ వినుచుండెను. ఆమె ఊదారంగు పొడిని అమ్ము తుయతైర పట్టణస్థురాలు. ప్రభువు ఆమె హృదయము తెరచెను గనుక పౌలు చెప్పిన మాటలయందు లక్ష్యముంచెను

ఆదికాండము 19:2 నా ప్రభువులారా, దయచేసి మీ దాసుని యింటికి వచ్చి రాత్రి వెళ్లబుచ్చి కాళ్లు కడుగుకొనుడి, మీరు పెందలకడ లేచి మీ త్రోవను వెళ్ళవచ్చుననెను. అందుకు వారు ఆలాగు కాదు, నడివీధిలో రాత్రి వెళ్లబుచ్చెదమని చెప్పిరి

ఆదికాండము 32:26 ఆయన తెల్లవారుచున్నది గనుక నన్ను పోనిమ్మనగా అతడు నీవు నన్ను ఆశీర్వదించితేనే గాని నిన్ను పోనియ్యననెను.

న్యాయాధిపతులు 19:9 ఆ మనుష్యుడు తానును అతని ఉపపత్నియు అతని దాసుడును వెళ్ల లేచినప్పుడు ఆ చిన్నదాని తండ్రియగు అతని మామఇదిగో ప్రొద్దు గ్రుంకుటకు సమీపమాయెను, నీవు దయచేసి యీ రాత్రి యిక్కడ ఉండుము, ఇదిగో ప్రొద్దు గ్రుంకుచున్నది, సంతోషించి యిక్కడ రాత్రి గడుపుము, రేపు నీ గుడారమునకు వెళ్లుటకు నీవు వేకువనే లేచి నీ త్రోవను పోవచ్చునని అతనితో చెప్పినను

రూతు 1:16 అందుకు రూతు నా వెంబడి రావద్దనియు నన్ను విడిచి పెట్టుమనియు నన్ను బ్రతిమాలుకొనవద్దు. నీవు వెళ్లు చోటికే నేను వచ్చెదను, నీవు నివసించు చోటనే నేను నివసించెదను, నీ జనమే నా జనము నీ దేవుడే నా దేవుడు;

1సమూయేలు 15:26 అందుకు సమూయేలు నీతోకూడ నేను తిరిగిరాను; నీవు యెహోవా ఆజ్ఞను విసర్జించితివి గనుక ఇశ్రాయేలీయులమీద రాజుగా ఉండకుండ యెహోవా నిన్ను విసర్జించెనని చెప్పి

1సమూయేలు 28:23 అతడు ఒప్పక భోజనము చేయననెను; అయితే అతని సేవకులు ఆ స్త్రీతో ఏకమై యతని బలవంతము చేయగా అతడు వారు చెప్పినమాట ఆలకించి నేలనుండి లేచి మంచముమీద కూర్చుండెను.

2సమూయేలు 13:25 రాజు నా కుమారుడా, మమ్మును పిలువవద్దు; మేము నీకు అధిక భారముగా ఉందుము; మేమందరము రాతగదని చెప్పినను అబ్షాలోము రాజును బలవంతము చేసెను.

సామెతలు 7:21 అది తన అధికమైన లాలన మాటలచేత వానిని లోపరచుకొనెను తాను పలికిన యిచ్చకపు మాటలచేత వాని నీడ్చుకొని పోయెను.

లూకా 4:42 ఉదయమైనప్పుడు ఆయన బయలుదేరి అరణ్య ప్రదేశమునకు వెళ్లెను. జనసమూహము ఆయనను వెదకుచు ఆయన యొద్దకు వచ్చి, తమ్మును విడిచిపోకుండ ఆపగా

యోహాను 1:39 వచ్చి చూడుడని ఆయన వారితో చెప్పగా వారు వెళ్లి, ఆయన కాపురమున్న స్థలము చూచి, ఆ దినము ఆయనయొద్ద బసచేసిరి. అప్పుడు పగలు రమారమి నాలుగు గంటల వేళ ఆయెను.

యోహాను 4:40 ఆ సమరయులు ఆయనయొద్దకు వచ్చి, తమయొద్ద ఉండుమని ఆయనను వేడుకొనిరి గనుక ఆయన అక్కడ రెండు దినములుండెను.

అపోస్తలులకార్యములు 1:8 అయినను పరిశుద్ధాత్మ మీ మీదికి వచ్చునప్పుడు మీరు శక్తినొందెదరు గనుక మీరు యెరూషలేములోను, యూదయ సమరయ దేశముల యందంతటను భూదిగంతముల వరకును నాకు సాక్షులైయుందురని వారితో చెప్పెను

అపోస్తలులకార్యములు 16:15 ఆమెయు ఆమె యింటివారును బాప్తిస్మము పొందినప్పుడు, ఆమె--నేను ప్రభువునందు విశ్వాసము గలదాననని మీరు యెంచితే, నా యింటికి వచ్చియుండుడని వేడుకొని మమ్మును బలవంతము చేసెను.

2కొరిందీయులకు 5:14 క్రీస్తు ప్రేమ మమ్మును బలవంతము చేయుచున్నది; ఏలాగనగా అందరికొరకు ఒకడు మృతిపొందెను గనుక అందరును మృతిపొందిరనియు,