Logo

లూకా అధ్యాయము 24 వచనము 50

యెషయా 44:3 నేను దప్పిగలవానిమీద నీళ్లను ఎండిన భూమిమీద ప్రవాహజలములను కుమ్మరించెదను నీ సంతతిమీద నా ఆత్మను కుమ్మరించెదను నీకు పుట్టినవారిని నేనాశీర్వదించెదను.

యెషయా 44:4 నీటికాలువలయొద్ద నాటబడిన నిరవంజిచెట్లు గడ్డిలో ఎదుగునట్లు వారు ఎదుగుదురు.

యెషయా 59:20 సీయోనునొద్దకును యాకోబులో తిరుగుబాటు చేయుట మాని మళ్లుకొనిన వారియొద్దకును విమోచకుడు వచ్చును ఇదే యెహోవా వాక్కు.

యెషయా 59:21 నేను వారితో చేయు నిబంధన యిది నీ మీదనున్న నా ఆత్మయు నేను నీ నోటనుంచిన మాటలును నీ నోటనుండియు నీ పిల్లల నోటనుండియు నీ పిల్లల పిల్లల నోటనుండియు ఈ కాలము మొదలుకొని యెల్లప్పుడును తొలగిపోవు అని యెహోవా సెలవిచ్చుచున్నాడు.

యోవేలు 2:28 తరువాత నేను సర్వజనులమీద నా ఆత్మను కుమ్మరింతును; మీ కుమారులును మీ కుమార్తెలును ప్రవచనములు చెప్పుదురు; మీ ముసలివారు కలలుకందురు, మీ యౌవనులు దర్శనములు చూతురు.

యోవేలు 2:29 ఆ దినములలో నేను పనివారిమీదను పనికత్తెలమీదను నా ఆత్మను కుమ్మరింతును.

యోవేలు 2:30 మరియు ఆకాశమందును భూమియందును మహత్కార్యములను, అనగా రక్తమును అగ్నిని ధూమ స్తంభములను కనుపరచెదను

యోవేలు 2:31 యెహోవాయొక్క భయంకరమైన ఆ మహాదినము రాకముందు సూర్యుడు తేజోహీనుడగును, చంద్రుడు రక్తవర్ణమగును.

యోవేలు 2:32 యెహోవా సెలవిచ్చినట్లు సీయోను కొండమీదను యెరూషలేములోను తప్పించుకొనిన వారుందురు, శేషించినవారిలో యెహోవా పిలుచువారు కనబడుదురు. ఆ దినమున యెహోవా నామమునుబట్టి ఆయనకు ప్రార్థనచేయు వారందరును రక్షింపబడుదురు.

యోహాను 14:16 నేను తండ్రిని వేడుకొందును, మీయొద్ద ఎల్లప్పుడు నుండుటకై ఆయన వేరొక ఆదరణకర్తను, అనగా సత్యస్వరూపియగు ఆత్మను మీకనుగ్రహించును.

యోహాను 14:17 లోకము ఆయనను చూడదు, ఆయనను ఎరుగదు గనుక ఆయనను పొందనేరదు; మీరు ఆయనను ఎరుగుదురు. ఆయన మీతోకూడ నివసించును, మీలో ఉండును.

యోహాను 14:26 ఆదరణకర్త, అనగా తండ్రి నా నామమున పంపబోవు పరిశుద్ధాత్మ సమస్తమును మీకు బోధించి నేను మీతో చెప్పిన సంగతులన్నిటిని మీకు జ్ఞాపకము చేయును.

యోహాను 15:26 తండ్రియొద్దనుండి మీయొద్దకు నేను పంపబోవు ఆదరణకర్త, అనగా తండ్రియొద్దనుండి బయలుదేరు సత్యస్వరూపియైన ఆత్మ వచ్చినప్పుడు ఆయన నన్నుగూర్చి సాక్ష్యమిచ్చును.

యోహాను 16:7 అయితే నేను మీతో సత్యము చెప్పుచున్నాను, నేను వెళ్లిపోవుటవలన మీకు ప్రయోజనకరము; నేను వెళ్లనియెడల ఆదరణకర్త మీయొద్దకు రాడు; నేను వెళ్ళినయెడల ఆయనను మీయొద్దకు పంపుదును

యోహాను 16:8 ఆయన వచ్చి, పాపమును గూర్చియు నీతిని గూర్చియు తీర్పును గూర్చియు లోకమును ఒప్పుకొనజేయును.

యోహాను 16:9 లోకులు నాయందు విశ్వాసముంచలేదు గనుక పాపమును గూర్చియు,

యోహాను 16:10 నేను తండ్రియొద్దకు వెళ్లుటవలన మీరిక నన్ను చూడరు గనుక నీతిని గూర్చియు,

యోహాను 16:11 ఈ లోకాధికారి తీర్పు పొందియున్నాడు గనుక తీర్పును గూర్చియు ఒప్పుకొనజేయును.

యోహాను 16:12 నేను మీతో చెప్పవలసినవి ఇంకను అనేక సంగతులు కలవు గాని యిప్పుడు మీరు వాటిని సహింపలేరు.

యోహాను 16:13 అయితే ఆయన, అనగా సత్యస్వరూపియైన ఆత్మ వచ్చినప్పుడు మిమ్మును సర్వసత్యములోనికి నడిపించును; ఆయన తనంతట తానే యేమియు బోధింపక, వేటిని వినునో వాటిని బోధించి సంభవింపబోవు సంగతులను మీకు తెలియజేయును

యోహాను 16:14 ఆయన నా వాటిలోనివి తీసికొని మీకు తెలియజేయును గనుక నన్ను మహిమపరచును.

యోహాను 16:15 తండ్రికి కలిగినవన్నియు నావి, అందుచేత ఆయన నావాటిలోనివి తీసికొని మీకు తెలియజేయునని నేను చెప్పితిని.

యోహాను 16:16 కొంచెము కాలమైన తరువాత మీరిక నన్ను చూడరు; మరి కొంచెము కాలమునకు నన్ను చూచెదరని చెప్పెను.

యెషయా 32:15 అవి అడవిగాడిదలకు ఇష్టమైనచోట్లుగాను మందలు మేయు భూమిగాను ఉండును అరణ్యము ఫలభరితమైన భూమిగాను ఫలభరితమైన భూమి వృక్షవనముగానుండును.

అపోస్తలులకార్యములు 1:4 ఆయన వారిని కలిసికొని యీలాగు ఆజ్ఞాపించెను మీరు యెరూషలేమునుండి వెళ్లక, నావలన వినిన తండ్రియొక్క వాగ్దానము కొరకు కనిపెట్టుడి;

అపోస్తలులకార్యములు 1:8 అయినను పరిశుద్ధాత్మ మీ మీదికి వచ్చునప్పుడు మీరు శక్తినొందెదరు గనుక మీరు యెరూషలేములోను, యూదయ సమరయ దేశముల యందంతటను భూదిగంతముల వరకును నాకు సాక్షులైయుందురని వారితో చెప్పెను

అపోస్తలులకార్యములు 2:1 పెంతెకొస్తను పండుగదినము వచ్చినప్పుడు అందరు ఒకచోట కూడియుండిరి.

అపోస్తలులకార్యములు 2:2 అప్పుడు వేగముగా వీచు బలమైన గాలివంటి యొకధ్వని ఆకాశమునుండి అకస్మాత్తుగా, వారు కూర్చుండియున్న యిల్లంతయు నిండెను.

అపోస్తలులకార్యములు 2:3 మరియు అగ్నిజ్వాలలవంటి నాలుకలు విభాగింపబడినట్టుగా వారికి కనబడి, వారిలో ఒక్కొక్కని మీద వ్రాలగ

అపోస్తలులకార్యములు 2:4 అందరు పరిశుద్ధాత్మతో నిండినవారై ఆ ఆత్మ వారికి వాక్‌శక్తి అనుగ్రహించినకొలది అన్యభాషలతో మాటలాడసాగిరి.

అపోస్తలులకార్యములు 2:5 ఆ కాలమున ఆకాశము క్రిందనుండు ప్రతి జనములోనుండి వచ్చిన భక్తిగల యూదులు యెరూషలేములో కాపురముండిరి.

అపోస్తలులకార్యములు 2:6 ఈ శబ్దము కలుగగా జనులు గుంపులుగా కూడివచ్చి, ప్రతి మనుష్యుడు తన తన స్వభాషతో వారు మాటలాడుట విని కలవరపడిరి.

అపోస్తలులకార్యములు 2:7 అంతట అందరు విభ్రాంతినొంది ఆశ్చర్యపడి ఇదిగో మాటలాడుచున్న వీరందరు గలిలయులు కారా?

అపోస్తలులకార్యములు 2:8 మనలో ప్రతివాడు తాను పుట్టిన దేశపు భాషతో వీరు మాటలాడుట మనము వినుచున్నామే; ఇదేమి?

అపోస్తలులకార్యములు 2:9 పార్తీయులు మాదీయులు ఏలామీయులు, మెసొపొతమియ యూదయ కప్పదొకియ, పొంతు ఆసియ ఫ్రుగియ పంపులియ ఐగుప్తు అను దేశములయందలి వారు,

అపోస్తలులకార్యములు 2:10 కురేనేదగ్గర లిబియ ప్రాంతములయందు కాపురమున్నవారు, రోమానుండి పరవాసులుగా వచ్చినవారు, యూదులు, యూదమత ప్రవిష్టులు,

అపోస్తలులకార్యములు 2:11 క్రేతీయులు అరబీయులు మొదలైన మనమందరమును, వీరు మన భాషలతో దేవుని గొప్పకార్యములను వివరించుట వినుచున్నామని చెప్పుకొనిరి.

అపోస్తలులకార్యములు 2:12 అందరు విభ్రాంతినొంది యెటుతోచక యిదేమగునో అని ఒకనితో ఒకడు చెప్పుకొనిరి.

అపోస్తలులకార్యములు 2:13 కొందరైతే వీరు క్రొత్త మద్యముతో నిండియున్నారని అపహాస్యము చేసిరి.

అపోస్తలులకార్యములు 2:14 అయితే పేతురు ఆ పదునొకరితో కూడ లేచి నిలిచి బిగ్గరగా వారితో ఇట్లనెను యూదయ మనుష్యులారా, యెరూషలేములో కాపురమున్న సమస్తజనులారా, యిది మీకు తెలియుగాక, చెవియొగ్గి నా మాటలు వినుడి

అపోస్తలులకార్యములు 2:15 మీరు ఊహించునట్టు వీరు మత్తులు కారు, ప్రొద్దుబొడిచి జామయిన కాలేదు.

అపోస్తలులకార్యములు 2:16 యోవేలు ప్రవక్త ద్వారా చెప్పబడిన సంగతి యిదే, ఏమనగా

అపోస్తలులకార్యములు 2:17 అంత్యదినములయందు నేను మనుష్యులందరిమీద నా ఆత్మను కుమ్మరించెదను మీ కుమారులును మీ కుమార్తెలును ప్రవచించెదరు మీ యౌవనులకు దర్శనములు కలుగును మీ వృద్ధులు కలలు కందురు

అపోస్తలులకార్యములు 2:18 ఆ దినములలో నా దాసులమీదను నా దాసురాండ్రమీదను నా ఆత్మను కుమ్మరించెదను గనుక వారు ప్రవచించెదరు.

అపోస్తలులకార్యములు 2:19 పైన ఆకాశమందు మహత్కార్యములను క్రింద భూమిమీద సూచక క్రియలను రక్తమును అగ్నిని పొగఆవిరిని కలుగజేసెదను.

అపోస్తలులకార్యములు 2:20 ప్రభువు ప్రత్యక్షమగు ఆ మహాదినము రాకమునుపు సూర్యుడు చీకటిగాను చంద్రుడు రక్తముగాను మారుదురు.

అపోస్తలులకార్యములు 2:21 అప్పుడు ప్రభువు నామమునుబట్టి ప్రార్థన చేయువారందరును రక్షణ పొందుదురు అని దేవుడు చెప్పుచున్నాడు.

యెహోషువ 6:10 మరియు యెహోషువమీరు కేకలు వేయుడని నేను మీతో చెప్పు దినమువరకు మీరు కేకలువేయవద్దు. మీ కంఠధ్వని వినబడనీయవద్దు, మీ నోటనుండి యే ధ్వనియు రావలదు, నేను చెప్పునప్పుడే మీరు కేకలు వేయవలెనని జనులకు ఆజ్ఞ ఇచ్చెను.

కీర్తనలు 68:18 నీవు ఆరోహణమైతివి పట్టబడినవారిని చెరపట్టుకొనిపోతివి మనుష్యులచేత నీవు కానుకలు తీసికొనియున్నావు. యెహోవా అను దేవుడు అక్కడ నివసించునట్లు విశ్వాసఘాతకులచేత సహితము నీవు కానుకలు తీసికొనియున్నావు.

యెహెజ్కేలు 47:3 ఆ మనుష్యుడు కొలనూలు చేతపట్టుకొని తూర్పు మార్గమున బయలువెళ్లి వెయ్యి మూరలు కొలిచి ఆ నీళ్లగుండ నన్ను నడిపింపగా నీళ్లు చీలమండ లోతుండెను.

జెకర్యా 11:11 అది విరువబడిన దినమున నేను చెప్పినది యెహోవా వాక్కు అని మందలో బలహీనములై నన్ను కనిపెట్టుకొని యున్న గొఱ్ఱలు తెలిసికొనెను.

మత్తయి 10:1 ఆయన తన పండ్రెండుమంది శిష్యులను పిలిచి, అపవిత్రాత్మలను వెళ్లగొట్టుటకును, ప్రతివిధమైన రోగమును ప్రతివిధమైన వ్యాధిని స్వస్థపరచుటకును, వారికి అధికారమిచ్చెను.

యోహాను 7:39 తనయందు విశ్వాసముంచువారు పొందబోవు ఆత్మనుగూర్చి ఆయన ఈ మాట చెప్పెను. యేసు ఇంకను మహిమపరచబడలేదు గనుక ఆత్మ ఇంకను అనుగ్రహింపబడియుండలేదు.

యోహాను 20:17 యేసు ఆమెతో నేను ఇంకను తండ్రియొద్దకు ఎక్కిపోలేదు గనుక నన్ను ముట్టుకొనవద్దు; అయితే నా సహోదరులయొద్దకు వెళ్లినా తండ్రియు మీ తండ్రియు, నా దేవుడును మీ దేవుడునైన వానియొద్దకు ఎక్కిపోవుచున్నానని వారితో చెప్పుమనెను.

అపోస్తలులకార్యములు 2:33 కాగా ఆయన దేవుని కుడిపార్శ్వమునకు హెచ్చింపబడి, పరిశుద్ధాత్మను గూర్చిన వాగ్దానమును తండ్రివలన పొంది, మీరు చూచుచు వినుచునున్న దీనిని కుమ్మరించియున్నాడు.

అపోస్తలులకార్యములు 4:33 ఇదియుగాక అపొస్తలులు బహు బలముగా ప్రభువైన యేసు పునరుత్థానమునుగూర్చి సాక్ష్యమిచ్చిరి. దైవకృప అందరియందు అధికముగా ఉండెను.

1కొరిందీయులకు 12:10 మరియొకనికి అద్భుతకార్యములను చేయు శక్తియు, మరియొకనికి ప్రవచన వరమును, మరియొకనికి ఆత్మల వివేచనయు, మరియొకనికి నానావిధ భాషలును, మరి యొకనికి భాషల అర్థము చెప్పు శక్తియు అనుగ్రహింపబడియున్నవి.

2కొరిందీయులకు 3:5 మావలన ఏదైన అయినట్లుగా ఆలోచించుటకు మాయంతట మేమే సమర్థులమని కాదు; మా సామర్థ్యము దేవుని వలననే కలిగియున్నది.

గలతీయులకు 3:14 ఇందునుగూర్చి మ్రానుమీద వ్రేలాడిన ప్రతివాడును శాపగ్రస్తుడు అని వ్రాయబడియున్నది.

ఎఫెసీయులకు 1:13 మీరును సత్యవాక్యమును, అనగా మీ రక్షణ సువార్తను విని, క్రీస్తునందు విశ్వాసముంచి, వాగ్దానము చేయబడిన ఆత్మచేత ముద్రింపబడితిరి.

2తిమోతి 1:7 దేవుడు మనకు శక్తియు ప్రేమయు, ఇంద్రియ నిగ్రహమును గల ఆత్మనే యిచ్చెను గాని పిరికితనము గల ఆత్మ నియ్యలేదు.