Logo

అపోస్తలులకార్యములు అధ్యాయము 28 వచనము 7

అపోస్తలులకార్యములు 12:22 జనులు ఇది దైవస్వరమేకాని మానవస్వరము కాదని కేకలు వేసిరి.

అపోస్తలులకార్యములు 14:11 జనసమూహములు పౌలు చేసినదాని చూచి, లుకయోనియ భాషలో --దేవతలు మనుష్యరూపము తాల్చి మనయొద్దకు దిగివచ్చి యున్నారని కేకలువేసి,

అపోస్తలులకార్యములు 14:12 బర్నబాకు ద్యుపతి అనియు, పౌలు ముఖ్యప్రసంగి యైనందున అతనికి హెర్మే అనియు పేరుపెట్టిరి.

అపోస్తలులకార్యములు 14:13 పట్టణమునకు ఎదురుగా ఉన్న ద్యుపతి యొక్క పూజారి యెడ్లను పూదండలను ద్వారముల యొద్దకు తీసికొనివచ్చి సమూహముతో కలిసి, బలి అర్పింపవలెనని యుండెను.

మత్తయి 21:9 జనసమూహములలో ఆయనకు ముందు వెళ్లుచుండినవారును వెనుక వచ్చుచుండినవారును దావీదు కుమారునికి జయము ప్రభువు పేరట వచ్చువాడు స్తుతింపబడునుగాక సర్వోన్నతమైన స్థలములలో జయము అని కేకలు వేయుచుండిరి.

మత్తయి 27:22 అందుకు పిలాతు ఆలాగైతే క్రీస్తనబడిన యేసును ఏమిచేతునని వారినడుగగా సిలువ వేయుమని అందరును చెప్పిరి.

దానియేలు 2:46 అంతట రాజగు నెబుకద్నెజరు దానియేలునకు సాష్ఠాంగ నమస్కారము చేసి అతని పూజించి, నైవేద్య ధూపములు అతనికి సమర్పింప ఆజ్ఞాపించెను.