Logo

అపోస్తలులకార్యములు అధ్యాయము 28 వచనము 20

అపోస్తలులకార్యములు 25:10 అందుకు పౌలు కైసరు న్యాయపీఠము ఎదుట నిలువబడియున్నాను; నేను విమర్శింపబడవలసిన స్థలమిదే, యూదులకు నేను అన్యాయమేమియు చేయలేదని తమరికి బాగుగా తెలియును.

అపోస్తలులకార్యములు 25:11 నేను న్యాయము తప్పి మరణమునకు తగినదేదైనను చేసినయెడల మరణమునకు వెనుకతీయను; వీరు నామీద మోపుచున్న నేరములలో ఏదియు నిజముకానియెడల నన్ను వారికి అప్పగించుటకు ఎవరితరము కాదు; కైసరు ఎదుటనే చెప్పుకొందుననెను.

అపోస్తలులకార్యములు 25:12 అప్పుడు ఫేస్తు తన సభవారితో ఆలోచన చేసిన తరువాత కైసరు ఎదుట చెప్పుకొందునంటివే కైసరునొద్దకే పోవుదువని ఉత్తరమిచ్చెను.

అపోస్తలులకార్యములు 25:21 అయితే పౌలు, చక్రవర్తి విమర్శకు తన్ను నిలిపియుంచవలెనని చెప్పుకొనినందున నేనతనిని కైసరునొద్దకు పంపించువరకు నిలిపియుంచవలెనని ఆజ్ఞాపించితిననెను.

అపోస్తలులకార్యములు 25:25 ఇతడు మరణమునకు తగినది ఏమియు చేయలేదని నేను గ్రహించి, యితడు చక్రవర్తియెదుట చెప్పుకొందునని అనినందున ఇతని పంప నిశ్చయించియున్నాను.

అపోస్తలులకార్యములు 26:32 అందుకు అగ్రిప్ప ఈ మనుష్యుడు కైసరు ఎదుట చెప్పుకొందునని అననియెడల ఇతనిని విడుదల చేయవచ్చునని ఫేస్తుతో చెప్పెను.

రోమీయులకు 12:19 ప్రియులారా, మీకు మీరే పగతీర్చుకొనక, దేవుని ఉగ్రతకు చోటియ్యుడి పగతీర్చుట నా పని, నేనే ప్రతిఫలము నిత్తును అని ప్రభువు చెప్పుచున్నాడని వ్రాయబడియున్నది.

రోమీయులకు 12:20 కాబట్టి, నీ శత్రువు ఆకలిగొనియుంటే అతనికి భోజనము పెట్టుము, దప్పిగొనియుంటే దాహమిమ్ము; ఆలాగు చేయుటవలన అతని తలమీద నిప్పులు కుప్పగా పోయుదువు.

రోమీయులకు 12:21 కీడువలన జయింపబడక, మేలుచేత కీడును జయించుము.

1పేతురు 2:22 ఆయన పాపము చేయలేదు; ఆయన నోటను ఏ కపటమును కనబడలేదు.

1పేతురు 2:23 ఆయన దూషింపబడియు బదులు దూషింపలేదు; ఆయన శ్రమ పెట్టబడియు బెదిరింపక, న్యాయముగా తీర్పు తీర్చు దేవునికి తన్ను తాను అప్పగించుకొనెను.

యిర్మియా 37:20 రాజా, నా యేలినవాడా, చిత్తగించి వినుము, చిత్తగించి నా మనవి నీ సన్నిధికి రానిమ్ము, నేను అక్కడ చనిపోకుండునట్లు లేఖికుడైన యెనాతాను ఇంటికి నన్ను మరల పంపకుము.

అపోస్తలులకార్యములు 25:11 నేను న్యాయము తప్పి మరణమునకు తగినదేదైనను చేసినయెడల మరణమునకు వెనుకతీయను; వీరు నామీద మోపుచున్న నేరములలో ఏదియు నిజముకానియెడల నన్ను వారికి అప్పగించుటకు ఎవరితరము కాదు; కైసరు ఎదుటనే చెప్పుకొందుననెను.