Logo

అపోస్తలులకార్యములు అధ్యాయము 28 వచనము 25

అపోస్తలులకార్యములు 13:48 అన్యజనులు ఆ మాటవిని సంతోషించి దేవుని వాక్యమును మహిమపరచిరి; మరియు నిత్యజీవమునకు నిర్ణయింపబడిన వారందరు విశ్వసించిరి.

అపోస్తలులకార్యములు 13:49 ప్రభువు వాక్యము ఆ ప్రదేశమందంతట వ్యాపించెను

అపోస్తలులకార్యములు 13:50 గాని యూదులు భక్తిమర్యాదలుగల స్త్రీలను ఆ పట్టణపు ప్రముఖులను రేపి పౌలునకు బర్నబాకును హింస కలుగజేసి, వారిని తమ ప్రాంతములనుండి వెళ్లగొట్టిరి.

అపోస్తలులకార్యములు 14:4 ఆ పట్టణపు జనసమూహములో భేదములు పుట్టగా కొందరు యూదుల పక్షముగాను కొందరు అపొస్తలుల పక్షముగాను ఉండిరి.

అపోస్తలులకార్యములు 17:4 వారిలో కొందరును, భక్తిపరులగు గ్రీసుదేశస్థులలో చాలమందియు, ఘనతగల స్త్రీలలో అనేకులును ఒప్పుకొని పౌలుతోను సీలతోను కలిసికొనిరి.

అపోస్తలులకార్యములు 17:5 అయితే యూదులు మత్సరపడి, పనిపాటులు లేక తిరుగు కొందరు దుష్టులను వెంటబెట్టుకొని గుంపుకూర్చి పట్టణమెల్ల అల్లరిచేయుచు, యాసోను ఇంటిమీదపడి వారిని జనుల సభయెదుటికి తీసికొని వచ్చుటకు యత్నముచేసిరి

అపోస్తలులకార్యములు 18:6 వారు ఎదురాడి దూషించినప్పుడు, అతడు తన వస్త్రములు దులుపుకొని మీ నాశనమునకు మీరే ఉత్తరవాదులు. నేను నిర్దోషిని; యికమీదట అన్యజనుల యొద్దకు పోవుదునని వారితో చెప్పి

అపోస్తలులకార్యములు 18:7 అక్కడనుండి వెళ్లి, దేవునియందు భక్తిగల తీతియు యూస్తు అను ఒకని యింటికి వచ్చెను. అతని యిల్లు సమాజమందిరమును ఆనుకొనియుండెను.

అపోస్తలులకార్యములు 18:8 ఆ సమాజమందిరపు అధికారియైన క్రిస్పు తన యింటివారందరితో కూడ ప్రభువునందు విశ్వాసముంచెను. మరియు కొరింథీయులలో అనేకులువిని విశ్వసించి బాప్తిస్మము పొందిరి.

అపోస్తలులకార్యములు 19:8 తరువాత అతడు సమాజమందిరములోనికి వెళ్లి ప్రసంగించుచు, దేవుని రాజ్యమునుగూర్చి తర్కించుచు, ఒప్పించుచు, ధైర్యముగా మాటలాడుచు మూడు నెలలు గడిపెను.

అపోస్తలులకార్యములు 19:9 అయితే కొందరు కఠినపరచబడినవారై యొప్పుకొనక, జనసమూహము ఎదుట ఈ మార్గమును దూషించుచున్నందున అతడు వారిని విడిచి, శిష్యులను ప్రత్యేకపరచుకొని ప్రతిదినము తురన్ను అను ఒకని పాటశాలలో తర్కించుచు వచ్చెను

రోమీయులకు 3:3 కొందరు అవిశ్వాసులైననేమి? వారు అవిశ్వాసులైనందున దేవుడు నమ్మతగినవాడు కాకపోవునా? అట్లనరాదు.

రోమీయులకు 11:4 అయితే దేవోక్తి అతనితో ఏమి చెప్పుచున్నది? బయలుకు మోకాళ్లూనని యేడువేలమంది పురుషులను నేను శేషముగా నుంచుకొనియున్నాను.

రోమీయులకు 11:5 ఆలాగుననే అప్పటికాలమందు సయితము కృపయొక్క యేర్పాటుచొప్పున శేషము మిగిలియున్నది.

రోమీయులకు 11:6 అది కృపచేతనైనయెడల ఇకను క్రియల మూలమైనది కాదు; కానియెడల కృప ఇకను కృప కాకపోవును.

లూకా 12:52 ఇప్పుటినుండి ఒక ఇంటిలో అయిదుగురు వేరుపడి, ఇద్దరికి విరోధముగా ముగ్గురును, ముగ్గురికి విరోధముగా యిద్దరును ఉందురు.

అపోస్తలులకార్యములు 4:4 వాక్యము వినినవారిలో అనేకులు నమ్మిరి. వారిలో పురుషుల సంఖ్య యించుమించు అయిదువేలు ఆయెను.

రోమీయులకు 10:16 అయినను అందరు సువార్తకు లోబడలేదు ప్రభువా, మేము తెలియజేసిన సమాచారమెవడు నమ్మెను అని యెషయా చెప్పుచున్నాడు గదా?

రోమీయులకు 11:11 కాబట్టి నేనడుగునది ఏమనగా, వారు పడిపోవునట్లుగా తొట్రిల్లిరా? అట్లనరాదు.

2దెస్సలోనీకయులకు 3:2 మేము మూర్ఖులైన దుష్టమనుష్యులచేతిలోనుండి తప్పింపబడు నిమిత్తమును, మాకొరకు ప్రార్థించుడి; విశ్వాసము అందరికి లేదు.