Logo

1కొరిందీయులకు అధ్యాయము 16 వచనము 6

అపోస్తలులకార్యములు 19:21 ఈలాగు జరిగిన తరువాత పౌలు మాసిదోనియ అకయ దేశముల మార్గమునవచ్చి యెరూషలేమునకు వెళ్లవలెనని మనస్సులో ఉద్దేశించి నేనక్కడికి వెళ్లిన తరువాత రోమాకూడ చూడవలెనని అనుకొనెను.

అపోస్తలులకార్యములు 20:1 ఆ యల్లరి అణగిన తరువాత పౌలు శిష్యులను తనయొద్దకు పిలువనంపించి హెచ్చరించిన మీదట వారియొద్ద సెలవు పుచ్చుకొని మాసిదోనియకు వెళ్లుటకు బయలుదేరెను.

అపోస్తలులకార్యములు 20:2 ఆ ప్రదేశములయందు సంచరించి, పెక్కుమాటలతో వారిని హెచ్చరించి గ్రీసునకు వచ్చెను.

అపోస్తలులకార్యములు 20:3 అతడు అక్కడ మూడునెలలు గడిపి ఓడయెక్కి సిరియకు వెళ్లవలెనని యుండగా అతని విషయమై యూదులు కుట్ర చేయుచున్నందున మాసిదోనియ మీదుగా తిరిగిరావలెనని నిశ్చయించుకొనెను.

2కొరిందీయులకు 1:15 మరియు ఈ నమ్మిక గలవాడనై మీకు రెండవ కృపావరము లభించునట్లు మొదట మీయొద్దకు వచ్చి,

2కొరిందీయులకు 1:16 మీయొద్దనుండి మాసిదోనియకు వెళ్లి మాసిదోనియనుండి మరల మీయొద్దకు వచ్చి, మీచేత యూదయకు సాగనంపబడవలెనని ఉద్దేశించితిని.

2కొరిందీయులకు 1:17 కావున నేనీలాగు ఉద్దేశించి చపలచిత్తుడనుగా నడుచుకొంటినా? అవును అవునని చెప్పుచు, కాదు కాదనునట్టు ప్రవర్తింపవలెనని నా యోచనలను శరీరానుసారముగా యోచించుచున్నానా?

రోమీయులకు 15:24 నేను స్పెయిను దేశమునకు వెళ్లునప్పుడు మార్గములో మిమ్మును చూచి, మొదట మీ సహవాసమువలన కొంతమట్టుకు సంతృప్తిపొంది, మీచేత అక్కడికి సాగనంపబడుదునని నిరీక్షించుచున్నాను.

1కొరిందీయులకు 11:34 మీరు కూడివచ్చుట శిక్షావిధికి కారణము కాకుండునట్లు, ఎవడైనను ఆకలిగొనినయెడల తన యింటనే భోజనము చేయవలెను. నేను వచ్చినప్పుడు మిగిలిన సంగతులను క్రమపరతును.

2కొరిందీయులకు 1:16 మీయొద్దనుండి మాసిదోనియకు వెళ్లి మాసిదోనియనుండి మరల మీయొద్దకు వచ్చి, మీచేత యూదయకు సాగనంపబడవలెనని ఉద్దేశించితిని.

2కొరిందీయులకు 7:5 మేము మాసిదోనియకు వచ్చినప్పుడును మా శరీరము ఏమాత్రమును విశ్రాంతి పొందలేదు. ఎటుబోయినను మాకు శ్రమయే కలిగెను; వెలుపట పోరాటములు లోపట భయములు ఉండెను.

2కొరిందీయులకు 12:14 ఇదిగో, యీ మూడవసారి మీయొద్దకు వచ్చుటకు సిద్ధముగా ఉన్నాను; వచ్చినప్పుడు మీకు భారముగా నుండను. మీ సొత్తును కాదు మిమ్మునే కోరుచున్నాను. పిల్లలు తలిదండ్రులకొరకు కాదు తలిదండ్రులే పిల్లలకొరకు ఆస్తి కూర్చతగినది గదా

1తిమోతి 3:14 శీఘ్రముగా నీయొద్దకు వత్తునని నిరీక్షించుచున్నాను;

2యోహాను 1:12 అనేక సంగతులు మీకు వ్రాయవలసి యుండియు సిరాతోను కాగితముతోను వ్రాయ మనస్సు లేక మీ సంతోషము పరిపూర్ణమవునట్లు మిమ్మును కలిసికొని ముఖాముఖిగా మాటలాడ నిరీక్షించుచున్నాను