Logo

1కొరిందీయులకు అధ్యాయము 16 వచనము 8

1కొరిందీయులకు 4:19 ప్రభువు చిత్తమైతే త్వరలోనే మీయొద్దకు వచ్చి, ఉప్పొంగుచున్న వారి మాటలను కాదు వారి శక్తినే తెలిసికొందును.

సామెతలు 19:21 నరుని హృదయములో ఆలోచనలు అనేకములుగా పుట్టును యెహోవా యొక్క తీర్మానమే స్థిరము.

యిర్మియా 10:23 యెహోవా, తమ మార్గము నేర్పరచుకొనుట నరుల వశములో లేదనియు, మనుష్యులు తమ ప్రవర్తనయందు సన్మార్గమున ప్రవర్తించుట వారి వశములో లేదనియు నేనెరుగుదును.

అపోస్తలులకార్యములు 18:21 అతడు ఒప్పక దేవుని చిత్తమైతే మీయొద్దకు తిరిగివత్తునని చెప్పి, వారియొద్ద సెలవు పుచ్చుకొని, ఓడ యెక్కి ఎఫెసునుండి బయలుదేరెను.

రోమీయులకు 1:10 మిమ్మునుగూర్చి యెడతెగక జ్ఞాపకము చేసికొనుచున్నాను. ఇందుకు ఆయన కుమారుని సువార్త విషయమై నేను నా ఆత్మయందు సేవించుచున్న దేవుడే నాకు సాక్షి.

యాకోబు 4:15 కనుక ప్రభువు చిత్తమైతే మనము బ్రదికియుండి ఇది అదిచేతమని చెప్పుకొనవలెను.

హెబ్రీయులకు 6:3 దేవుడు సెలవిచ్చినయెడల మనమాలాగు చేయుదము.