Logo

1సమూయేలు అధ్యాయము 3 వచనము 6

1సమూయేలు 4:16 ఆ మనుష్యుడు యుద్ధములోనుండి వచ్చినవాడను నేనే, నేడు యుద్ధములోనుండి పరుగెత్తి వచ్చితినని ఏలీతో అనగా అతడు నాయనా, అక్కడ ఏమి జరిగెనని అడిగెను.

ఆదికాండము 43:29 అప్పుడతడు కన్నులెత్తి తన తల్లి కుమారుడును తన తమ్ముడైన బెన్యామీనును చూచి మీరు నాతో చెప్పిన మీ తమ్ముడు ఇతడేనా? అని అడిగి నా కుమారుడా, దేవుడు నిన్ను కరుణించును గాక

2సమూయేలు 18:22 అయితే సాదోకు కుమారుడైన అహిమయస్సు కూషీతోకూడ నేనును పరుగెత్తికొని పోవుటకు సెలవిమ్మని యోవాబుతో మనవిచేయగా యోవాబు నాయనా నీవెందుకు పోవలెను? చెప్పుటకు నీకు బహుమానము తెచ్చు విశేషమైన సమాచార మేదియు లేదు గదా అని అతనితో అనగా

మత్తయి 9:2 ఇదిగో జనులు పక్షవాయువుతో మంచముపట్టియున్న యొకని ఆయనయొద్దకు తీసికొనివచ్చిరి. యేసు వారి విశ్వాసము చూచి కుమారుడా ధైర్యముగా ఉండుము, నీ పాపములు క్షమింపబడియున్నవని పక్షవాయువు గల వానితో చెప్పెను.

ఆదికాండము 31:11 మరియు ఆ స్వప్నమందు దేవుని దూత యాకోబూ అని నన్ను పిలువగా చిత్తము ప్రభువా అని చెప్పితిని.

నిర్గమకాండము 3:4 దానిని చూచుటకు అతడు ఆ తట్టు వచ్చుట యెహోవా చూచెను. దేవుడు ఆ పొద నడుమనుండి మోషే మోషే అని అతనిని పిలిచెను. అందుకతడు చిత్తము ప్రభువా అనెను.

రూతు 2:8 అప్పుడు బోయజు రూతుతో నా కుమారీ, నా మాట వినుము; వేరొక పొలములో ఏరుకొనుటకు పోవద్దు, దీనిని విడిచి పోవద్దు, ఇచ్చట నా పనికత్తెలయొద్ద నిలకడగా ఉండుము.

1సమూయేలు 25:8 నీ పనివారిని నీవు అడిగినయెడల వారాలాగు చెప్పుదురు. కాబట్టి నా పనివారికి దయచూపుము. శుభదినమున మేము వచ్చితివిు గదా; నీ కిష్టము వచ్చినట్టు నీ దాసులకును నీ కుమారుడైన దావీదునకును ఇమ్ము.

యోహాను 20:16 యేసు ఆమెను చూచి మరియా అని పిలిచెను. ఆమె ఆయనవైపు తిరిగి ఆయనను హెబ్రీ భాషతో రబ్బూనీ అని పిలిచెను. ఆ మాటకు బోధకుడని అర్థము.