Logo

1సమూయేలు అధ్యాయము 5 వచనము 5

కీర్తనలు 115:4 వారి విగ్రహములు వెండి బంగారువి అవి మనుష్యుల చేతిపనులు

కీర్తనలు 115:5 వాటికి నోరుండియు పలుకవు కన్నులుండియు చూడవు

కీర్తనలు 115:6 చెవులుండియు వినవు ముక్కులుండియు వాసనచూడవు

కీర్తనలు 115:7 చేతులుండియు ముట్టుకొనవు పాదములుండియు నడువవు గొంతుకతో మాటలాడవు.

కీర్తనలు 135:15 అన్యజనుల విగ్రహములు వెండి బంగారువి అవి మనుష్యుల చేతిపనులు.

కీర్తనలు 135:16 వాటికి నోరుండియు పలుకవు కన్నులుండియు చూడవు

కీర్తనలు 135:17 చెవులుండియు వినవు వాటి నోళ్లలో ఊపిరి లేశమైన లేదు.

కీర్తనలు 135:18 వాటిని చేయువారును వాటియందు నమ్మికయుంచు వారందరును వాటితో సమానులగుదురు.

యెహోషువ 5:15 అందుకు యెహోవా సేనాధిపతి నీవు నిలిచియున్న యీ స్థలము పరిశుద్ధమైనది, నీ పాద రక్షలను తీసి వేయుమని యెహోషువతో చెప్పగా యెహో షువ ఆలాగు చేసెను.

జెఫన్యా 1:9 మరియు ఇండ్ల గడపలు దాటివచ్చి యజమానుని యింటిని మోసముతోను బలాత్కారముతోను నింపువారిని ఆ దినమందు నేను శిక్షింతును.

ఆదికాండము 32:32 అందుచేత ఆయన యాకోబు తొడగూటిమీది తుంటినరము కొట్టినందున నేటివరకు ఇశ్రాయేలీయులు తొడగూటిమీద నున్న తుంటినరము తినరు.

నిర్గమకాండము 20:23 మీరు నన్ను కొలుచుచు, వెండి దేవతలనైనను బంగారు దేవతలనైనను చేసికొనకూడదు.