Logo

1సమూయేలు అధ్యాయము 16 వచనము 22

ఆదికాండము 30:27 అందుకు లాబాను అతనితో నీ కటాక్షము నా మీదనున్నయెడల నా మాట వినుము; నిన్నుబట్టి యెహోవా నన్ను ఆశీర్వదించెనని శకునము చూచి తెలిసికొంటినని చెప్పెను.

ఆదికాండము 39:4 యోసేపు మీద అతనికి కటాక్షము కలిగెను గనుక అతనియొద్ద పరిచర్య చేయువాడాయెను. మరియు అతడు తన యింటిమీద విచారణకర్తగా అతని నియమించి తనకు కలిగినదంతయు అతనిచేతికప్పగించెను.

ద్వితియోపదేశాకాండము 1:38 అతడు ఇశ్రాయేలీయులు దాని స్వాధీనపరచుకొనచేయును గనుక అతని ధైర్యపరచుము.

1సమూయేలు 16:16 మా యేలినవాడవైన నీవు ఆజ్ఞ ఇమ్ము, నీ దాసులమైన మేము సిద్ధముగా నున్నాము. సితారా చమత్కారముగా వాయింపగల యొకని విచారించుటకై మాకు సెలవిమ్ము దేవుని యొద్దనుండి దురాత్మ వచ్చి నిన్ను పట్టినప్పుడెల్ల అతడు సితారా చేతపట్టుకొని వాయించుటచేత నీవు బాగుపడుదువని అతనితో ననిరి

1సమూయేలు 17:55 సౌలు దావీదు ఫిలిష్తీయునికి ఎదురుగా పోవుట చూచినప్పుడు తన సైన్యాధిపతియైన అబ్నేరును పిలిచి అబ్నేరూ, ఈ యౌవనుడు ఎవని కుమారుడని అడుగగా అబ్నేరు రాజా, నీ ప్రాణముతోడు నాకు తెలియదనెను.

1రాజులు 1:2 కాబట్టి వారు మా యేలినవాడవును రాజవునగు నీకొరకు తగిన చిన్నదాని వెదకుట మంచిది; ఆమె రాజైన నీ సముఖమందుండి నిన్ను ఆదరించి వెట్ట కలుగుటకు నీ కౌగిటిలో పండుకొనునని చెప్పి

కీర్తనలు 131:1 యెహోవా, నా హృదయము అహంకారము గలది కాదు నా కన్నులు మీదు చూచునవి కావు నాకు అందనివాటి యందైనను గొప్పవాటి యందైనను నేను అభ్యాసము చేసికొనుటలేదు.

దానియేలు 1:5 మరియు రాజు తాను భుజించు ఆహారములోనుండియు తాను పానముచేయు ద్రాక్షారసములోనుండియు అనుదిన భాగము వారికి నియమించి, మూడు సంవత్సరములు వారిని పోషించి పిమ్మట వారిని తన యెదుట నిలువబెట్టునట్లు ఆజ్ఞ ఇచ్చెను.