Logo

1సమూయేలు అధ్యాయము 23 వచనము 29

కీర్తనలు 63:1 దేవా, నా దేవుడవు నీవే, వేకువనే నిన్ను వెదకుదును

1సమూయేలు 24:1 సౌలు ఫిలిష్తీయులను తరుముట మాని తిరిగిరాగా దావీదు ఏన్గెదీ అరణ్యమందున్నాడని అతనికి వర్తమానము వచ్చెను.

ఆదికాండము 14:7 తిరిగి కాదేషను ఏన్మిష్పతుకు వచ్చి అమాలేకీయుల దేశమంతటిని హససోన్‌ తామారులో కాపురమున్న అమోరీయులను కూడ కొట్టిరి.

యెహోషువ 15:62 వాటి పల్లెలు పోగా ఆరు పట్టణములు.

2దినవృత్తాంతములు 20:2 అంతలో కొందరు వచ్చి సముద్రము ఆవలనుండు సిరియనుల తట్టునుండి గొప్ప సైన్యమొకటి నీమీదికి వచ్చుచున్నది; చిత్తగించుము, వారు హససోన్‌తామారు అను ఏన్గెదీలో ఉన్నారని యెహోషాపాతునకు తెలియజేసిరి.

పరమగీతము 1:14 నాకు నా ప్రియుడు ఏన్గెదీ ద్రాక్షావనములోని కర్పూరపు పూగుత్తులతో సమానుడు.

యెహెజ్కేలు 47:10 మరియు దానియొద్ద ఏన్గెదీ పట్టణము మొదలుకొని ఏనెగ్లాయీము పట్టణమువరకును చేపలు పట్టువారు దాని ప్రక్కల నిలిచి వలలు వేయుదురు; మహాసముద్రములో నున్నట్లు సకల జాతి చేపలును దానియందు బహు విస్తారముగా నుండును.

యెహోషువ 2:16 ఆమెమిమ్మును తరుమబోయినవారు మీకెదు రుగా వచ్చెదరేమో, మీరు కొండలకువెళ్లి తరుమబోయిన వారు తిరిగి వచ్చువరకు మూడుదినములు అచ్చట దాగి యుండుడి, తరువాత మీ త్రోవను వెళ్లుడని వారితో అనగా

1సమూయేలు 24:22 అప్పుడు సౌలు ఇంటికి తిరిగి వచ్చెను; అయితే దావీదును అతని జనులును తమ కొండస్థలములకు వెళ్లిపోయిరి.

1దినవృత్తాంతములు 12:8 మరియు గాదీయులలో పరాక్రమశాలులు కొందరు అరణ్యమందు దాగియున్న దావీదునొద్ద చేరిరి; వీరు డాలును ఈటెను వాడుకచేయగల యుద్ధప్రవీణులు, సింహముఖమువంటి ముఖములు గలవారు, కొండలలోనుండు జింకలంత పాదవేగము గలవారు.