Logo

1సమూయేలు అధ్యాయము 27 వచనము 11

1సమూయేలు 22:22 దావీదు ఆ దినమున ఎదోమీయుడైన దోయేగు అక్కడనున్నందున వాడు సౌలునకు నిశ్చయముగా సంగతి తెలుపునని నేననుకొంటిని; నీ తండ్రి యింటివారికందరికిని మరణము రప్పించుటకు నేను కారకుడనైతిని గదా.

సామెతలు 12:19 నిజమాడు పెదవులు నిత్యము స్థిరమైయుండును అబద్ధమాడు నాలుక క్షణమాత్రమే యుండును.

సామెతలు 29:25 భయపడుటవలన మనుష్యులకు ఉరి వచ్చును యెహోవాయందు నమ్మిక యుంచువాడు సురక్షితముగా నుండును.

1సమూయేలు 27:1 తరువాత దావీదు నేను ఇక్కడ నిలుచుట మంచిది కాదు, ఏదో ఒక దినమున నేను సౌలుచేత నాశనమగుదును; నేను ఫిలిష్తీయుల దేశములోనికి తప్పించుకొని పోవుదును, అప్పుడు సౌలు ఇశ్రాయేలీయుల సరిహద్దులలో నన్ను వెదకుట మానుకొనును గనుక నేను అతని చేతిలోనుండి తప్పించుకొందునని అనుకొని

1సమూయేలు 30:2 ఘనులనేమి అల్పులనేమి అందులోనున్న ఆడువారందరిని చెరపట్టుకొని చంపక వారిని తీసికొని వెళ్లిపోయియుండిరి.

2సమూయేలు 17:20 అబ్షాలోము సేవకులు ఆ యింటి ఆమెయొద్దకు వచ్చి అహిమయస్సును యోనాతానును ఎక్కడ ఉన్నారని అడుగగా ఆమె వారు ఏరుదాటి పోయిరని వారితో చెప్పెను గనుక వారు పోయి వెదకి వారిని కానక యెరూషలేమునకు తిరిగివచ్చిరి.

యిర్మియా 41:4 అతడు గెదల్యాను చంపిన రెండవనాడు అది ఎవరికిని తెలియబడక మునుపు