Logo

1సమూయేలు అధ్యాయము 30 వచనము 26

1దినవృత్తాంతములు 12:1 దావీదు కీషు కుమారుడైన సౌలునకు భయపడి యింకను దాగియుండగా సౌలు బంధువులగు బెన్యామీనీయులలో పరాక్రమశాలులు కొందరు దావీదునకు యుద్ధ సహాయము చేయుటకై అతనియొద్దకు సిక్లగునకు వచ్చిరి.

1దినవృత్తాంతములు 12:2 వీరు విలుకాండ్రయి కుడి యెడమ చేతులతో వడిసెలచేత రాళ్లు రువ్వుటకును వింటిచేత అంబులు విడుచుటకును సమర్థులైనవారు.

1దినవృత్తాంతములు 12:3 వారెవరనగా గిబియావాడైన షెమాయా కుమారులైన అహీయెజెరు, ఇతడు అధిపతి; ఇతని తరువాతివాడగు యోవాషు, అజ్మావెతు కుమారులైన యెజీయేలు, పెలెటు, బెరాకా, అనెతోతీయుడైన యెహూ,

1దినవృత్తాంతములు 12:4 ముప్పదిమందిలో పరాక్రమశాలియు ముప్పది మందికి పెద్దయునైన ఇష్మయా అను గిబియోనీయుడు, యిర్మీయా, యహజీయేలు, యోహానాను, గెదేరాతీయుడైన యోజాబాదు,

1దినవృత్తాంతములు 12:5 ఎలూజై, యెరీమోతు, బెయల్యా, షెమర్యా, హరీపీయుడైన షెఫటయా,

1దినవృత్తాంతములు 12:6 కోరహీయులగు ఎల్కానా, యెష్షీయా, అజరేలు, యోహెజెరు, యాషాబాము,

1దినవృత్తాంతములు 12:7 గెదోరు ఊరివాడైన యెరోహాము కుమారులగు యోహేలా, జెబద్యా అనువారును.

1దినవృత్తాంతములు 12:8 మరియు గాదీయులలో పరాక్రమశాలులు కొందరు అరణ్యమందు దాగియున్న దావీదునొద్ద చేరిరి; వీరు డాలును ఈటెను వాడుకచేయగల యుద్ధప్రవీణులు, సింహముఖమువంటి ముఖములు గలవారు, కొండలలోనుండు జింకలంత పాదవేగము గలవారు.

1దినవృత్తాంతములు 12:9 వారెవరనగా మొదటివాడు ఏజెరు, రెండవవాడు ఓబద్యా, మూడవవాడు ఏలీయాబు,

1దినవృత్తాంతములు 12:10 నాల్గవవాడు దుష్మన్నా, అయిదవవాడు యిర్మీయా,

1దినవృత్తాంతములు 12:11 ఆరవవాడు అత్తయి, యేడవవాడు ఎలీయేలు,

1దినవృత్తాంతములు 12:12 ఎనిమిదవవాడు యోహానాను, తొమ్మిదవవాడు ఎల్జాబాదు,

1దినవృత్తాంతములు 12:13 పదియవవాడు యిర్మీయా, పదకొండవవాడు మక్బన్నయి.

1దినవృత్తాంతములు 12:14 గాదీయులగు వీరు సైన్యమునకు అధిపతులై యుండిరి; వారిలో అత్యల్పుడైనవాడు నూరుమందికి అధిపతి, అత్యధికుడైనవాడు వెయ్యిమందికి అధిపతి,

1దినవృత్తాంతములు 12:15 యొర్దాను గట్టులమీదుగా పొర్లి పారుచుండు మొదటి నెలయందు దానిని దాటిపోయి తూర్పులోయలలోను పడమటిలోయలలోను ఉన్న వారినందరిని తరిమివేసినవారు వీరే.

కీర్తనలు 35:27 నా నిర్దోషత్వమునుబట్టి ఆనందించువారు ఉత్సాహధ్వనిచేసి సంతోషించుదురు గాక తన సేవకుని క్షేమమును చూచి ఆనందించు యెహోవా ఘనపరచబడును గాక అని వారు నిత్యము పలుకుదురు.

కీర్తనలు 68:18 నీవు ఆరోహణమైతివి పట్టబడినవారిని చెరపట్టుకొనిపోతివి మనుష్యులచేత నీవు కానుకలు తీసికొనియున్నావు. యెహోవా అను దేవుడు అక్కడ నివసించునట్లు విశ్వాసఘాతకులచేత సహితము నీవు కానుకలు తీసికొనియున్నావు.

సామెతలు 18:16 ఒకడు ఇచ్చు కానుక వానికి వీలు కలుగజేయును అది గొప్పవారియెదుటికి వానిని రప్పించును

సామెతలు 18:17 వ్యాజ్యెమందు వాది పక్షము న్యాయముగా కనబడును అయితే ఎదుటివాడు వచ్చినమీదట వాని సంగతి తేటపడును.

సామెతలు 18:18 చీట్లు వేయుటచేత వివాదములు మానును అది పరాక్రమశాలులను సమాధానపరచును.

సామెతలు 18:19 బలమైన పట్టణమును వశపరచుకొనుటకంటె ఒకనిచేత అన్యాయమునొందిన సహోదరుని వశపరచుకొనుట కష్టతరము. వివాదములు నగరు తలుపుల అడ్డగడియలంత స్థిరములు.

సామెతలు 18:20 ఒకని నోటి ఫలముచేత వాని కడుపు నిండును తన పెదవుల ఆదాయముచేత వాడు తృప్తిపొందును.

సామెతలు 18:21 జీవమరణములు నాలుక వశము దానియందు ప్రీతిపడువారు దాని ఫలము తిందురు

సామెతలు 18:22 భార్య దొరికినవానికి మేలు దొరికెను అట్టివాడు యెహోవావలన అనుగ్రహము పొందినవాడు.

సామెతలు 18:23 దరిద్రుడు బతిమాలి మనవి చేసికొనును ధనవంతుడు దురుసుగా ప్రత్యుత్తరమిచ్చును.

సామెతలు 18:24 బహుమంది చెలికాండ్రు గలవాడు నష్టపడును సహోదరునికంటెను ఎక్కువగా హత్తియుండు స్నేహితుడు కలడు.

యెషయా 32:8 ఘనులు ఘనకార్యములు కల్పించుదురు వారు ఘనకార్యములనుబట్టి నిలుచుదురు.

1సమూయేలు 25:27 అయితే నేను నా యేలినవాడవగు నీయొద్దకు తెచ్చిన యీ కానుకను నా యేలినవాడవగు నిన్ను వెంబడించు పనివారికి ఇప్పించి

ఆదికాండము 33:11 నేను నీయొద్దకు తెచ్చిన కానుకను చిత్తగించి పుచ్చుకొనుము; దేవుడు నన్ను కనికరించెను; మరియు నాకు కావలసినంత ఉన్నదని చెప్పి అతని బలవంతము చేసెను గనుక అతడు దాని పుచ్చుకొని

2రాజులు 5:15 అప్పుడతడు తన పరివారముతోకూడ దైవజనుని దగ్గరకు తిరిగివచ్చి అతని ముందర నిలిచి చిత్తగించుము; ఇశ్రాయేలులోనున్న దేవుడు తప్ప లోకమంతటియందును మరియొక దేవుడు లేడని నేను ఎరుగుదును; ఇప్పుడు నీవు నీ దాసుడనైన నాయొద్ద బహుమానము తీసికొనవలసినదని అతనితో చెప్పగా

2కొరిందీయులకు 9:5 కావున లోగడ ఇచ్చెదమని మీరు చెప్పిన ధర్మము పిసినితనముగా ఇయ్యక ధారాళముగా ఇయ్యవలెనని చెప్పి, సహోదరులు మీయొద్దకు ముందుగావచ్చి దానిని జమచేయుటకై వారిని హెచ్చరించుట అవసరమని తలంచితిని.

1సమూయేలు 30:20 మరియు దావీదు అమాలేకీయుల గొఱ్ఱలన్నిటిని గొడ్లన్నిటిని పట్టుకొనెను. ఇవి దావీదునకు దోపుడు సొమ్మని జనులు మిగిలిన తమ స్వంత పశువులకు ముందుగా వీటిని తోలిరి.

1దినవృత్తాంతములు 19:2 అప్పుడు దావీదు హానూను తండ్రియైన నాహాషు నాయెడల దయచూపించెను గనుక నేను అతని కుమారునియెడల దయచూపెదనని యనుకొని, అతని తండ్రి నిమిత్తము అతని పరామర్శించుటకు దూతలను పంపెను. దావీదు సేవకులు హానూనును పరామర్శించుటకై అమ్మోనీయుల దేశమునకు వచ్చినప్పుడు

సామెతలు 18:24 బహుమంది చెలికాండ్రు గలవాడు నష్టపడును సహోదరునికంటెను ఎక్కువగా హత్తియుండు స్నేహితుడు కలడు.

ఎఫెసీయులకు 4:8 అందుచేత ఆయన ఆరోహణమైనప్పుడు, చెరను చెరగా పట్టుకొనిపోయి మనష్యులకు ఈవులను అనుగ్రహించెనని చెప్పబడియున్నది.