Logo

1సమూయేలు అధ్యాయము 31 వచనము 6

1సమూయేలు 4:10 ఫిలిష్తీయులు యుద్దము చేయగా ఇశ్రాయేలీయులు ఓడిపోయి అందరు తమ డేరాలకు పరుగెత్తివచ్చిరి. అప్పుడు అత్యధికమైన వధ జరిగెను; ఇశ్రాయేలీయులలో ముప్పదివేల కాల్బలము కూలెను.

1సమూయేలు 4:11 మరియు దేవుని మందసము పట్టబడెను; అదికాకను హొఫ్నీ ఫీనెహాసులను ఏలీ యొక్క యిద్దరు కుమారులు హతులైరి.

1సమూయేలు 11:15 జనులందరు గిల్గాలునకు వచ్చి గిల్గాలులో యెహోవా సన్నిధిని సమాధానబలులను అర్పించి, యెహోవా సన్నిధిని సౌలునకు పట్టాభిషేకము చేసిరి. సౌలును ఇశ్రాయేలీయులందరును అక్కడ బహుగా సంతోషించిరి.

1సమూయేలు 12:17 గోధుమ కోతకాలము ఇదే గదా? మీరు రాజును నిర్ణయింపుమని అడిగినందుచేత యెహోవా దృష్టికి మీరు చేసిన కీడు గొప్పదని మీరు గ్రహించి తెలిసికొనుటకై యెహోవా ఉరుములను వర్షమును పంపునట్లుగా నేను ఆయనను వేడుకొనుచున్నాను.

1సమూయేలు 12:25 మీరు కీడుచేయు వారైతే తప్పకుండ మీరును మీ రాజును నాశనమగుదురు.

1సమూయేలు 28:19 యెహోవా నిన్నును ఇశ్రాయేలీయులను ఫిలిష్తీయుల చేతికి అప్పగించును; యెహోవా ఇశ్రాయేలీయుల దండును ఫిలిష్తీయులచేతికి అప్పగించును; రేపు నీవును నీ కుమారులును నాతోకూడ ఉందురు అని సౌలుతో చెప్పగా

1దినవృత్తాంతములు 10:6 ఆ ప్రకారమే సౌలును అతని ముగ్గురు కుమారులును చచ్చిరి. మరియు అతని యింటివారందరును చచ్చిరి.

ప్రసంగి 9:1 నీతిమంతులును జ్ఞానులును వారి క్రియలును దేవుని వశమను సంగతిని, స్నేహము చేయుటయైనను ద్వేషించుటయైనను మనుష్యుల వశమున లేదను సంగతిని, అదియంతయు వారివలన కాదను సంగతిని పూర్తిగా పరిశీలన చేయుటకై నా మనస్సు నిలిపి నిదానింప బూనుకొంటిని.

ప్రసంగి 9:2 సంభవించునవి అన్నియు అందరికిని ఏకరీతిగానే సంభవించును; నీతిమంతులకును దుష్టులకును, మంచివారికిని పవిత్రులకును అపవిత్రులకును బలులర్పించువారికిని బలులనర్పింపని వారికిని గతియొక్కటే; మంచివారికేలాగుననో పాపాత్ములకును ఆలాగుననే తటస్థించును; ఒట్టుపెట్టుకొను వారికేలాగుననో ఒట్టుకు భయపడువారికిని ఆలాగుననే జరుగును.

హోషేయ 13:10 నీ పట్టణములలో దేనియందును నీకు సహాయము చేయకుండ నీ రాజు ఏమాయెను? రాజును అధిపతులను నామీద నియమించుమని నీవు మనవి చేసికొంటివిగదా; నీ అధిపతులు ఏమైరి?

హోషేయ 13:11 కాగా కోపము తెచ్చుకొని నీకు రాజును నియమించితిని; క్రోధము కలిగి అతని కొట్టివేయుచున్నాను.

1సమూయేలు 26:10 యహోవా జీవముతోడు యెహోవాయే అతని మొత్తును, అతడు అపాయమువలన చచ్చును, లేదా యుద్ధమునకు పోయి నశించును;

2సమూయేలు 7:9 నీవు పోవు చోట్లనెల్లను నీకు తోడుగానుండి నీ శత్రువులనందరిని నీ యెదుట నిలువకుండ నిర్మూలము చేసి, లోకములోని ఘనులైన వారికి కలుగు పేరు నీకు కలుగజేసియున్నాను.

అపోస్తలులకార్యములు 13:22 తరువాత అతనిని తొలగించి దావీదును వారికి రాజుగా ఏర్పరచెను. మరియు ఆయన నేను యెష్షయి కుమారుడైన దావీదును కనుగొంటిని; అతడు నా యిష్టానుసారుడైన మనుష్యుడు, అతడు నా ఉద్దేశములన్నియు నెరవేర్చునని చెప్పి అతనినిగూర్చి సాక్ష్యమిచ్చెను.