లేఖనాలను అన్వేషించండి

1దినవృత్తాంతములు 23: 3

క్రాస్-రిఫరెన్స్‌లు

" అప్పుడు లేవీయులు ముప్పది సంవత్సరములు మొదలుకొని అంతకు పైవయస్సు గలవారు కవిలెలో చేర్చబడిరి; వారి సంఖ్య ముప్పది యెనిమిది వేల పురుషులు."

సంబంధిత రిఫరెన్స్‌లు

సంఖ్యాకాండము 4:2

నీవు లేవీయులలో కహాతీయులను వారి వారి వంశముల చొప్పునను వారి వారి పితరుల కుటుంబముల చొప్పునను

సంఖ్యాకాండము 4:3

ముప్పది యేండ్లు మొదలుకొని, యేబది యేండ్లవరకు ప్రాయము కలిగి, ప్రత్యక్షపు గుడారములో పనిచేయుటకు సేనగా చేరగలవారందరి సంఖ్యను వ్రాయించుము.

సంఖ్యాకాండము 4:23

ముప్పది యేండ్లు మొదలుకొని యేబది యేండ్లవరకు వయస్సు కలిగి ప్రత్యక్షపు గుడారములో సేవచేయుటకు సేనలో పనిచేయ చేరువారందరిని లెక్కింపవలెను.

సంఖ్యాకాండము 4:30

ముప్పది యేండ్లు మొదలుకొని యేబది యేండ్లవరకు వయస్సు కలిగి ప్రత్యక్షపు గుడారములో పనిచేయుటకు సేనగా చేరువారందరిని లెక్కింపవలెను.

సంఖ్యాకాండము 4:35

యేబది యేండ్లవరకు ప్రాయము కలిగి ప్రత్యక్షపు గుడారములో సేవచేయుటకు సేనగా చేరువారందరిని లెక్కించిరి.

సంఖ్యాకాండము 4:43

అనగా ముప్పది యేండ్లు మొదలుకొని యేబది యేండ్లవరకు ప్రాయము కలిగి ప్రత్యక్షపు గుడారములో సేవ చేయుటకు సేనగా చేరువారు

సంఖ్యాకాండము 4:47

ముప్పది యేండ్లు మొదలుకొని యేబది యేండ్లవరకు ప్రాయము కలిగి తమ తమ వంశముల చొప్పునను తమ తమ పితరుల కుటుంబముల చొప్పునను లెక్కింపబడినవారు

సంఖ్యాకాండము 4:48

అనగా ప్రత్యక్షపు గుడారములో సేవయు మోతయు జరిగించు నిమిత్తమై చేరువారందరు, అనగా వారిలో లెక్కింపబడినవారు ఎనిమిదివేల ఐదువందల ఎనుబదిమంది.

సంఖ్యాకాండము 8:24

ఇరువదియైదేండ్లు మొదలుకొని పై ప్రాయముగల ప్రతివాడును ప్రత్యక్షపు గుడారముయొక్క సేవలో పనిచేయుటకు రావలెను.

2సమూయేలు 7:5

నీవు పోయి నా సేవకుడగు దావీదుతో ఇట్లనుము యెహోవా నీకాజ్ఞ ఇచ్చునదేమనగా నాకు నివాసముగా ఒక మందిరమును కట్టింతువా?

2రాజులు 11:5

మీరు చేయవలసినదేమనగా, విశ్రాంతి దినమున లోపల ప్రవేశించు మీరు మూడు భాగములై యొక భాగము రాజమందిరమునకు కావలి కాయువారై యుండవలెను;

1దినవృత్తాంతములు 23:24

వీరు తమ పితరుల యింటివారినిబట్టి లేవీయులుగా ఎంచబడిరి; పితరుల యిండ్లకు పెద్దలైన వీరు ఇరువది సంవత్సరములు మొదలుకొని అంతకు పైవయస్సు గలవారై తమ తమ పేరుల లెక్కప్రకారము ఒక్కొక్కరుగా నెంచబడి యెహోవా మందిరపు సేవచేయు పనివారైయుండిరి.

1దినవృత్తాంతములు 23:27

దావీదు ఇచ్చిన కడవరి యాజ్ఞనుబట్టి లేవీయులలో ఇరువది సంవత్సరములు మొదలుకొని అంతకు పైవయస్సు గలవారు ఎంచబడిరి.

2దినవృత్తాంతములు 23:4

కాబట్టి మీరు చేయవలసినదేమనగా, మీలో యాజకులైనవారేమి లేవీయులైనవారేమి విశ్రాంతిదినమున లోపల ప్రవేశించువారు మూడు భాగములై, యొక భాగము ద్వారపాలకులుగా ఉండవలెను.

ఎజ్రా 8:17

కాసిప్యా అను స్థలమందుండు అధికారియైన ఇద్దోయొద్దకు వారిని పంపి, మా దేవుని మందిరమునకు పరిచారకులను మాయొద్దకు తీసికొని వచ్చునట్లుగా కాసిప్యా అను స్థలమందుండు ఇద్దోతోను అతని బంధువులైన నెతీనీయులతోను చెప్పవలసిన మాటలను వారికి తెలియజెప్పితిని.