1దినవృత్తాంతములు 26: 22
క్రాస్-రిఫరెన్స్‌లు
" యెహీయేలీ కుమారులైన జేతామును వాని సహోదరుడైన యోవేలును యెహోవా మందిరపు బొక్కసములకు కావలి కాయువారు."
సంబంధిత రిఫరెన్స్‌లు
పెద్దవాడగు యెహీయేలు, జేతాము యోవేలు
తమయొద్ద రత్నములున్నవారు వాటిని తెచ్చి యెహోవా మందిరపు బొక్కసముమీదనున్న గెర్షోనీయుడైన యెహీయేలునకు ఇచ్చిరి.
కడకు లేవీయులలో అహీయా అనువాడు దేవుని మందిరపు బొక్కసమును ప్రతిష్ఠితములగు వస్తువుల బొక్కసములను కాచువాడుగా నియమింపబడెను.
లేవీయులు ఆ పదియవ వంతును తీసికొనిరాగా అహరోను సంతతివాడైన యాజకుడు ఒకడును వారితోకూడ ఉండవలెననియు, పదియవ వంతులలో ఒకవంతు లేవీయులు మా దేవుని మందిరములో ఉన్న ఖజానా గదులలోనికి తీసికొని రావలెననియు నిర్ణయించుకొంటిమి,
వారు ప్రత్యక్షపు గుడారము నెదుట మందిరపు సేవ చేయవలెను. తాము కాపాడవలసినదానిని, సర్వసమాజము కాపాడవలసినదానిని, వారు కాపాడవలెను.
ప్రత్యక్షపు గుడారములో గెర్షోను కుమారులు కాపాడవలసినవేవనగా, మందిరము గుడారము దాని పైకప్పు ప్రత్యక్షపు గుడారము ద్వారపు తెరయు
వారిలో కొందరు సేవోపకరణములను కనిపెట్టువారు, వారు లెక్కచొప్పున వాటిని లోపలికి కొనిపోవలెను, లెక్కచొప్పున వెలుపలికి తీసికొనిరావలెను.