లేఖనాలను అన్వేషించండి

1సమూయేలు 9: 19

క్రాస్-రిఫరెన్స్‌లు

" సమూయేలు సౌలుతో నేనే దీర్ఘదర్శిని, ఉన్నతమైన స్థలమునకు నాకు ముందు వెళ్లుడి, నేడు మీరు నాతో కూడ భోజనము చేయవలెను, రేపు నీ మనస్సులో నున్నదంతయు నీకు తెలియజేసి నిన్ను వెళ్లనిచ్చెదను."

సంబంధిత రిఫరెన్స్‌లు

సంఖ్యాకాండము 24:4

అతడు పరవశుడై కన్నులు తెరచినవాడై సర్వశక్తుని దర్శనము పొందెను.

సంఖ్యాకాండము 24:16

దేవవాక్కులను వినినవాని వార్త మహాన్నతుని విద్యనెరిగినవాని వార్త. అతడు పరవశుడై కన్నులు తెరచినవాడై సర్వశక్తుని దర్శనము పొందెను.

యిర్మియా 14:4

దేశములో వర్షము కురువక పోయినందున నేల చీలియున్నది గనుక సేద్యము చేయువారు సిగ్గుపడి తలలు కప్పుకొనుచున్నారు.

యోహాను 4:29

మీరు వచ్చి, నేను చేసినవన్నియు నాతో చెప్పిన మనుష్యుని చూడుడి; ఈయన క్రీస్తుకాడా అని ఆ ఊరివారితో చెప్పగా

1కొరిందీయులకు 14:25

అప్పుడతని హృదయ రహస్యములు బయలుపడును. ఇందువలన దేవుడు నిజముగా మీలో ఉన్నాడని ప్రచురము చేయుచు అతడు సాగిలపడి దేవునికి నమస్కారము చేయును.