1సమూయేలు 9: 4
క్రాస్-రిఫరెన్స్‌లు
" అతడు పోయి ఎఫ్రాయిము మన్యము తిరిగి షాలిషా దేశమున సంచరింపగా అవి కనబడలేదు. తరువాత వారు షయలీము దేశమును దాటి సంచారము చేసిరి గాని అవి కనబడకయుండెను. బెన్యామీనీయుల దేశము సంచరించి చూడగా అవి దొరకలేదు."
సంబంధిత రిఫరెన్స్‌లు
మీకా అను నొకడు ఎఫ్రాయిమీయుల మన్యదేశ ములో నుండెను.
ఇశ్రాయేలీయులకు రాజులేని దినములలో లేవీయు డైన యొకడు ఎఫ్రాయిమీయుల మన్యపు ఉత్తర భాగమున పరదేశిగా నివసించుచుండెను. అతడు యూదా బేత్లె హేములోనుండి ఒక స్త్రీని తనకు ఉపపత్నిగా తెచ్చు కొనగా
మరియు ఒకడు బయల్షాలిషానుండి మొదటిపంట బాపతు యవలపిండితో చేయబడిన యిరువది రొట్టెలను, క్రొత్త గోధుమ వెన్నులను కొన్ని పండ్లను తీసికొనివచ్చి దైవజనుడైన అతనికి కానుకగా ఇయ్యగా అతడు జనులు భోజనము చేయుటకు దాని వడ్డించుమనెను.
అట్లు యాకోబు పద్దనరాములో నుండి వచ్చిన తరువాత కనాను దేశములోనున్న షెకెమను ఊరికి సురక్షితముగా వచ్చి ఆ ఊరిముందర తన గుడారములు వేసెను.
సలీము దగ్గర నున్న ఐనోనను స్థలమున నీళ్లు విస్తారముగా ఉండెను గనుక యోహానుకూడ అక్కడ బాప్తిస్మమిచ్చుచు ఉండెను; జనులు వచ్చి బాప్తిస్మము పొందిరి.
అంతట దైవజనుడొకడు ఏలీ యొద్దకు వచ్చి యిట్లనెను యెహోవా నిన్నుగూర్చి సెలవిచ్చినదేమనగా, నీ పితరుని యింటివారు ఐగుప్తు దేశమందు ఫరో యింటిలో ఉండగా నేను వారికి ప్రత్యక్షమైతిని.
అయినను నీ తండ్రియైన దావీదు నిమిత్తము నీ దినములయందు నేను ఆలాగున చేయక నీ కుమారునిచేతిలోనుండి దాని తీసివేసెదను.