లేఖనాలను అన్వేషించండి

1సమూయేలు 9: 3

క్రాస్-రిఫరెన్స్‌లు

" సౌలు తండ్రియైన కీషుయొక్క గార్దభములు తప్పిపోగా కీషు తన కుమారుడైన సౌలును పిలిచి మన దాసులలో ఒకని తీసికొనిపోయి గార్దభములను వెదకుమని చెప్పెను."

సంబంధిత రిఫరెన్స్‌లు

1సమూయేలు 10:2

ఈ దినమున నీవు నాయొద్దనుండి పోయిన తరువాత బెన్యామీను సరిహద్దులో సెల్సహులోనుండు రాహేలు సమాధి దగ్గర ఇద్దరు మనుష్యులు నీకు కనబడుదురు. వారు నీవు వెదకబోయిన గార్దభములు దొరికినవి, నీ తండ్రి తన గార్దభములకొరకు చింతింపక నా కుమారుని కనుగొనుటకై నేనేమి చేతునని నీకొరకు విచారపడుచున్నాడని చెప్పుదురు.

న్యాయాధిపతులు 5:10

తెల్లగాడిదల నెక్కువారలారా, తివాసులమీద కూర్చుండువారలారా, త్రోవలో నడుచువారలారా, ఈ సంగతి ప్రక టించుడి.

న్యాయాధిపతులు 10:4

అతనికి ముప్పదిమంది కుమారులుండిరి, వారు ముప్పది గాడిదపిల్లల నెక్కి తిరుగువారు, ముప్పది ఊరులు వారికుండెను, నేటి వరకు వాటికి యాయీరు గ్రామములని పేరు.

1సమూయేలు 9:20

మూడు దినముల క్రిందట తప్పిపోయిన నీ గార్దభములనుగూర్చి విచారపడకుము, అవి దొరికినవి. ఇశ్రాయేలీయుల అభీష్టము ఎవరియందున్నది? నీ యందును నీ తండ్రి యింటివారియందును గదా అనెను.

1సమూయేలు 10:14

సౌలుయొక్క పినతండ్రి అతనిని అతని పనివానిని చూచి మీరిద్దరు ఎక్కడికి పోతిరని అడుగగా అతడు గార్దభములను వెదకబోతివిు; అవి కనబడకపోగా సమూయేలునొద్దకు పోతిమని చెప్పినప్పుడు