లేఖనాలను అన్వేషించండి

1సమూయేలు 9: 24

క్రాస్-రిఫరెన్స్‌లు

" పచనకర్త జబ్బను దాని మీదనున్న దానిని తీసికొనివచ్చి సౌలు ఎదుట ఉంచగా సమూయేలు సౌలుతో ఇట్లనెను చూడుము, మనము కలిసికొను కాలమునకై దాచియుంచబడిన దానిని నీకు పెట్టియున్నాడు, జనులను పిలిచితినని నేను పచనకర్తతో చెప్పినప్పుడు ఇది నీకొరకుంచవలసినదని చెప్పితిని. ఆ దినమున సౌలు సమూయేలుతో కూడ భోజనము చేసెను,"

సంబంధిత రిఫరెన్స్‌లు

యెషయా 9:6

ఏలయనగా మనకు శిశువు పుట్టెను మనకు కుమారుడు అనుగ్రహింపబడెను ఆయన భుజముమీద రాజ్యభారముండును. ఆశ్చర్యకరుడు ఆలోచనకర్త బలవంతుడైన దేవుడు నిత్యుడగు తండ్రి సమాధానకర్తయగు అధిపతి అని అతనికి పేరు పెట్టబడును.

లేవీయకాండము 7:32

సమాధానబలి పశువులలోనుండి ప్రతిష్ఠార్పణముగా యాజకునికి కుడిజబ్బ నియ్యవలెను.

లేవీయకాండము 7:33

అహరోను సంతతివారిలో ఎవడు సమాధానబలియగు పశువు రక్తమును క్రొవ్వును అర్పించునో కుడిజబ్బ వానిదగును.

యెహెజ్కేలు 24:4

తొడజబ్బ మొదలగు మంచి మంచి ముక్కలన్నియు చేర్చి అందులో వేసి, మంచి యెముకలను ఏరి దాని నింపుము.