లేఖనాలను అన్వేషించండి

2దినవృత్తాంతములు 14: 15

క్రాస్-రిఫరెన్స్‌లు

" మరియు వారు పసులసాలలను పడగొట్టి విస్తారమైన గొఱ్ఱలను ఒంటెలను సమకూర్చుకొని యెరూషలేమునకు తిరిగివచ్చిరి."

సంబంధిత రిఫరెన్స్‌లు

1దినవృత్తాంతములు 4:41

పేళ్ల వరుసను వ్రాయబడియుండు వీరు యూదా రాజైన హిజ్కియా దినములలో అచ్చటికి వచ్చి అచ్చట కనబడినవారి గుడారములను నివాసస్థలములను పడగొట్టి వారిని హతముచేసి, అచ్చట తమ గొఱ్ఱలకు తగిన మేత కలిగియుండుటచేత నేటివరకు వారి స్థానములను ఆక్రమించుకొనియున్నారు.

సంఖ్యాకాండము 31:9

అప్పుడు ఇశ్రాయేలీయులు మిద్యాను స్త్రీలను వారి చిన్నపిల్లలను చెరపట్టుకొని, వారి సమస్త పశువులను వారి గొఱ్ఱమేకలన్నిటిని వారికి కలిగినది యావత్తును దోచుకొనిరి.

సంఖ్యాకాండము 31:30

మనుష్యులలోను పశువులలోను గాడిదలలోను గొఱ్ఱమేకలలోను సమస్తవిధముల జంతువులలోను ఏబదింటికి ఒకటిచొప్పున, ఇశ్రాయేలీయులు సగములోనుండి తీసికొని యెహోవా మందిరమును కాపాడు లేవీయులకు ఇయ్యవలెను.

సంఖ్యాకాండము 31:31

యెహోవా మోషేకు ఆజ్ఞాపించినట్లు మోషేయు యాజకుడైన ఎలియాజరును చేసిరి.

సంఖ్యాకాండము 31:32

ఆ దోపుడుసొమ్ము, అనగా ఆ సైనికులు కొల్లబెట్టిన సొమ్ములో మిగిలినది

సంఖ్యాకాండము 31:33

ఆరులక్షల డెబ్బదియయిదు గొఱ్ఱమేకలును,

సంఖ్యాకాండము 31:34

డెబ్బది రెండువేల పశువులును, అరువది యొకవేయి గాడిదలును,

సంఖ్యాకాండము 31:35

ముప్పది రెండువేలమంది పురుషసంయోగమెరుగని స్త్రీలును,

సంఖ్యాకాండము 31:36

అందులో అరవంతు, అనగా సైన్యముగా పోయినవారి వంతు, గొఱ్ఱమేకల లెక్కయెంతనగా మూడు లక్షల ముప్పది యేడువేల ఐదువందలు. ఆ గొఱ్ఱమేకలలో యెహోవాకు చెల్లవలసిన పన్ను ఆరువందల డెబ్బది యయిదు, ఆ పశువులు ముప్పది యారువేలు.

సంఖ్యాకాండము 31:37

వాటిలో యెహోవా పన్ను డెబ్బదిరెండు.

సంఖ్యాకాండము 31:38

ఆ గాడిదలు ముప్పదివేల ఐదువందలు,

సంఖ్యాకాండము 31:39

వాటిలో యెహోవా పన్ను అరువది యొకటి.

సంఖ్యాకాండము 31:40

మనుష్యులు పదునారు వేలమంది. వారిలో యెహోవా పన్ను ముప్పది ఇద్దరు.

సంఖ్యాకాండము 31:41

యెహోవా మోషేకు ఆజ్ఞాపించినట్లు మోషే పన్నును, అనగా యెహోవాకు చెల్లవలసిన ప్రతిష్ఠార్పణమును యాజకుడైన ఎలియాజరునకిచ్చెను.

సంఖ్యాకాండము 31:42

సైనికులయొద్ద మోషే తీసికొని ఇశ్రాయేలీయులకిచ్చిన సగమునుండి లేవీయులకిచ్చెను.

సంఖ్యాకాండము 31:43

మూడులక్షల ముప్పది యేడువేల ఐదువందల గొఱ్ఱమేకలును

సంఖ్యాకాండము 31:44

ముప్పది ఆరువేల గోవులును ముప్పదివేల ఐదువందల గాడిదలును

సంఖ్యాకాండము 31:45

పదునారువేలమంది మనుష్యులును సమాజమునకు కలిగిన సగమైయుండగా, మోషే

సంఖ్యాకాండము 31:46

ఇశ్రాయేలీయులకు వచ్చిన ఆ సగమునుండి మనుష్యులలోను జంతువులలోను

సంఖ్యాకాండము 31:47

ఏబదింటికి ఒకటిచొప్పున తీసి, యెహోవా మోషేకు ఆజ్ఞాపించినట్లు యెహోవా మందిరమును కాపాడు లేవీయులకిచ్చెను.

1సమూయేలు 30:20

మరియు దావీదు అమాలేకీయుల గొఱ్ఱలన్నిటిని గొడ్లన్నిటిని పట్టుకొనెను. ఇవి దావీదునకు దోపుడు సొమ్మని జనులు మిగిలిన తమ స్వంత పశువులకు ముందుగా వీటిని తోలిరి.

1దినవృత్తాంతములు 5:21

గనుక వారిని జయించుటకు వారికి సహాయము కలిగెను. హగ్రీయీలును వారితో ఉన్నవారందరును వారిచేతికి అప్పగింపబడిరి; వారు ఏబదివేల ఒంటెలను పశువులను రెండులక్షల ఏబదివేల గొఱ్ఱలను రెండువేల గాడిదలను లక్ష జనమును పట్టుకొనిరి.