2దినవృత్తాంతములు 2: 17
క్రాస్-రిఫరెన్స్‌లు
" సొలొమోను తన తండ్రియైన దావీదు ఇశ్రాయేలు దేశమందుండిన అన్యజాతివారినందరిని, ఎన్నిక వేయించిన యెన్నిక ప్రకారము వారిని లెక్కింపగా వారు లక్ష యెనుబదిమూడువేల ఆరువందలమందియైరి."
సంబంధిత రిఫరెన్స్‌లు
బరువులు మోయుటకు డెబ్బది వేలమందిని, కొండలమీద మ్రానులు కొట్టుటకు ఎనుబది వేలమందిని ఏర్పరచుకొని వీరిమీద మూడు వేల ఆరువందల మందిని అధిపతులుగా ఉంచెను.
ఇశ్రాయేలీయుల సంబంధులు కాని హిత్తీయులలోనుండియు అమోరీయులలోనుండియు, పెరిజ్జీయులలోనుండియు, హివ్వీయులలోనుండియు, యెబూసీయులలోనుండియు, శేషించియున్న సకల జనులను
ఇశ్రాయేలీయులు నాశనముచేయక వదలివేసిన ఆ యా జనుల సంతతివారిని సొలొమోను నేటివరకును తనకు వెట్టిపనులు చేయువారినిగా చేసికొనియుండెను.
రాజైన సొలొమోను ఇశ్రాయేలీయులందరిచేతను వెట్టిపని చేయించెను; వారిలో ముప్పదివేలమంది వెట్టిపని చేయువారైరి,
వీరిని అతడు వంతులచొప్పున నెలకు పదివేలమందిని లెబానోనునకు పంపించెను; ఒక నెల లెబానోనులోను రెండు నెలలు ఇంటియొద్దను వారు ఉండిరి; ఆ వెట్టివారిమీద అదోనీరాము అధికారియై యుండెను.
మరియు సొలొమోనునకు బరువులు మోయువారు డెబ్బది వేలమందియు పర్వతములందు మ్రానులు నరకువారు ఎనుబది వేలమందియు నుండిరి.
వీరు కాక పనిమీదనున్న సొలొమోను శిల్పకారులకు అధికారులు మూడువేల మూడువందలమంది; వీరు పనివారిమీద అధికారులై యుండిరి.
అయితే ఇశ్రాయేలీయులు కాని అమోరీయులు హిత్తీయులు పెరిజ్జీయులు హివ్వీయులు యెబూసీయులు అను వారిలో శేషించిన వారుండిరి.
ఇశ్రాయేలీయులు వారిని నిర్మూలము చేయలేకపోగా వారి దేశమందు శేషించియున్న వారి పిల్లలను సొలొమోను దాసత్వము చేయ నియమింపగా నేటివరకు ఆలాగు జరుగుచున్నది.
తరువాత దావీదు ఇశ్రాయేలీయుల దేశమందుండు అన్యజాతి వారిని సమకూర్చుడని ఆజ్ఞ ఇచ్చి, దేవుని మందిరమును కట్టించుటకై రాళ్లు చెక్కువారిని నియమించెను.
వారిని బ్రదుకనియ్యు డని సెలవిచ్చిరి గనుక ప్రధానులు తమతో చెప్పినట్లు వారు సర్వసమాజమునకును కట్టెలు నరుకువారుగాను నీళ్లు చేదువారుగాను ఏర్పడిరి.
మరియు సొలొమోనునకు బరువులు మోయువారు డెబ్బది వేలమందియు పర్వతములందు మ్రానులు నరకువారు ఎనుబది వేలమందియు నుండిరి.