2దినవృత్తాంతములు 2: 3
క్రాస్-రిఫరెన్స్‌లు
" సొలొమోను తూరు రాజైన హీరాము నొద్దకు దూతలచేత ఈ వర్తమానము పంపెను నా తండ్రియైన దావీదు నివాసమునకై యొక నగరును కట్టతలచియుండగా నీవు అతనికి సరళ మ్రానులను సిద్ధముచేసి పంపించినట్లు నాకును దయచేసి పంపించుము."
సంబంధిత రిఫరెన్స్‌లు
తరువాత తూరునకు రాజైన హీరాము తన తండ్రికి బదులుగా సొలొమోను పట్టాభిషేకము నొందెనని విని తన సేవకులను సొలొమోనునొద్దకు పంపెను; ఏలయనగా హీరాము ఎప్పటికి దావీదుతో స్నేహముగా నుండెను.
తూరు రాజగు హీరాము, దూతలను దేవదారు మ్రానులను వడ్రంగులను కాసెపనివారిని పంపగా వారు దావీదు కొరకు ఒక నగరిని కట్టిరి.
తూరు రాజైన హీరాము దావీదునొద్దకు దూతలను, అతనికి ఒక యిల్లు కట్టుటకై దేవదారు మ్రానులను, కాసె పనివారిని వడ్లవారిని పంపెను.
హీరామునొద్దకు సొలొమోను ఈ వర్తమానము పంపెను.
ఎంచనలవికానన్ని దేవదారు మ్రానులను దావీదు సంపాదించెను; సీదోనీయులును తూరీయులును దావీదునకు విస్తారమైన దేవదారు మ్రానులను తీసికొని వచ్చుచుండిరి.