లేఖనాలను అన్వేషించండి

2దినవృత్తాంతములు 29: 13

క్రాస్-రిఫరెన్స్‌లు

" ఎలీషాపాను సంతతివారిలో షిమీ యెహీయేలు, ఆసాపు కుమారులలో జెకర్యా మత్తన్యా"

సంబంధిత రిఫరెన్స్‌లు

లేవీయకాండము 10:4

అహరోను మౌనముగానుండగా మోషే అహరోను పిన తండ్రియైన ఉజ్జీయేలు కుమారులైన మీషాయేలును ఎల్సాఫానును పిలిపించి మీరు సమీపించి పరిశుద్ధస్థలము నెదుటనుండి పాళెము వెలుపలికి మీ సహోదరుల శవములను మోసికొనిపోవుడని వారితో చెప్పెను.

1దినవృత్తాంతములు 15:8

ఎలీషాపాను సంతతివారి కధిపతియగు షెమయాను వాని బంధువులలో రెండువందల మందిని,

1దినవృత్తాంతములు 6:39

హేమాను సహోదరుడైన ఆసాపు ఇతని కుడిప్రక్కను నిలుచువాడు. ఈ ఆసాపు బెరక్యా కుమారుడు, బెరక్యా షిమ్యా కుమారుడు,

1దినవృత్తాంతములు 15:17

కావున లేవీయులు యోవేలు కుమారుడైన హేమానును, వాని బంధువులలో బెరెక్యా కుమారుడైన ఆసాపును, తమ బంధువులగు మెరారీయులలో కూషాయాహు కుమారుడైన ఏతానును,

1దినవృత్తాంతములు 25:2

ఆసాపు కుమారులలో రాజాజ్ఞ ప్రకారముగా ప్రకటించుచు, ఆసాపు చేతిక్రిందనుండు ఆసాపు కుమారులైన జక్కూరు యోసేపు నెతన్యా అషర్యేలా అనువారు.