2దినవృత్తాంతములు 29: 22
క్రాస్-రిఫరెన్స్‌లు
" పరిచారకులు ఆ కోడెలను వధించినప్పుడు యాజకులు వాటి రక్తమును తీసికొని బలిపీఠముమీద ప్రోక్షించిరి. ఆ ప్రకారము వారు పొట్లేళ్లను వధించినప్పుడు యాజకులు ఆ రక్తమును బలిపీఠముమీద ప్రోక్షించిరి. వారు గొఱ్ఱపిల్లలను వధించినప్పుడు ఆ రక్తమును బలిపీఠముమీద ప్రోక్షించిరి."
సంబంధిత రిఫరెన్స్‌లు
అతడు యెహోవా సన్నిధిని ఆ కోడెదూడను వధించిన తరువాత యాజకులైన అహరోను కుమారులు దాని రక్తమును తెచ్చి ప్రత్యక్షపు గుడారము ఎదుటనున్న బలిపీఠముచుట్టు ఆ రక్తమును ప్రోక్షింపవలెను.
అప్పుడు యాజకుడు ప్రత్యక్షపు గుడారములో యెహోవా సన్నిధినున్న సుగంధ ద్రవ్యముల ధూపవేదిక కొమ్ములమీద ఆ రక్తములో కొంచెము చమిరి ప్రత్యక్షపు గుడారముయొక్క ద్వారమునొద్దనున్న దహనబలిపీఠము అడుగున ఆ కోడె యొక్క రక్తశేషమంతయు పోయవలెను.
మరియు అతడు దాని రక్తములో కొంచెము ప్రత్యక్షపు గుడారములో యెహోవా సన్నిధినున్న బలిపీఠపు కొమ్ములమీద చమిరి ప్రత్యక్షపు గుడారముయొక్క ద్వారమునొద్దనున్న దహనబలిపీఠము అడుగున ఆ రక్తశేషమంతయు పోయవలెను.
యాజకుడు పాపపరిహారార్థబలియగు పశువు రక్తములో కొంచెము తన వ్రేలితో తీసి దహనబలిపీఠపు కొమ్ములమీద చమిరి, ఆ పీఠము అడుగున ఆ రక్తశేషమంతయు పోయవలెను.
ఇట్లు యెహోవా మోషేకు ఆజ్ఞాపించెను. అప్పుడతడు పాపపరిహారార్థబలిగా ఒక కోడెను తీసికొనివచ్చెను. అహరోనును అతని కుమారులును పాపపరిహారార్థబలి రూపమైన ఆ కోడె తలమీద తమ చేతులుంచిరి.
దాని వధించిన తరువాత మోషే దాని రక్తమును తీసి బలిపీఠపు కొమ్ములచుట్టు వ్రేలితో దాని చమిరి బలిపీఠము విషయమై పాపపరిహారము చేసి దాని నిమిత్తము ప్రాయశ్చిత్తము చేయుటకై బలిపీఠము అడుగున రక్తమును పోసి దాని ప్రతిష్ఠించెను.
అప్పుడు మోషే దానిని వధించి బలిపీఠముచుట్టు దాని రక్తమును ప్రోక్షించెను.
మోషే అహరోను కుమారులను దగ్గరకు తీసికొనివచ్చి, వారి కుడిచెవుల కొనలమీదను వారి కుడిచేతుల బొట్టనవ్రేలిమీదను వారి కుడికాళ్ల బొట్టనవ్రేలిమీదను ఆ రక్తములో కొంచెము చమిరెను. మరియు మోషే బలిపీఠముచుట్టు దాని రక్తమును ప్రోక్షించెను
అదేవిధముగా గుడారము మీదను సేవాపాత్రలన్నిటి మీదను ఆ రక్తమును ప్రోక్షించెను.
మరియు ధర్మశాస్త్ర ప్రకారము సమస్త వస్తువులును రక్తముచేత శుద్ధిచేయబడుననియు, రక్తము చిందింపకుండ పాపక్షమాపణ కలుగదనియు సామాన్యముగా చెప్పవచ్చును.
లేవీయులు పస్కాపశువులను వధించి రక్తమును యాజకులకియ్యగా వారు దాని ప్రోక్షించిరి. లేవీయులు పశువులను ఒలువగా