2దినవృత్తాంతములు 30: 25
క్రాస్-రిఫరెన్స్‌లు
" అప్పుడు యాజకులును లేవీయులును యూదావారిలోనుండియు ఇశ్రాయేలువారిలోనుండియు వచ్చిన సమాజపువారందరును, ఇశ్రాయేలు దేశములోనుండి వచ్చి యూదాలో కాపురమున్న అన్యులును సంతోషించిరి."
సంబంధిత రిఫరెన్స్‌లు
అయినను ఆషేరు మనష్షే జెబూలూను దేశముల వారిలోనుండి కొందరు కృంగిన మనస్సుతో యెరూషలేమునకు వచ్చిరి.
ఎఫ్రాయిము మనష్షే ఇశ్శాఖారు జెబూలూను దేశములనుండి వచ్చిన జనులలో చాలామంది తమ్మును తాము ప్రతిష్ఠించుకొనకయే విధివిరుద్ధముగా పస్కాను భుజింపగా హిజ్కియా
మరియు యెహోవా మోషే అహరోనులతో ఇట్లనెను ఇది పస్కా పండుగను గూర్చిన కట్టడ; అన్యుడెవడును దాని తినకూడదు గాని
వెండితో కొనబడిన దాసుడు సున్నతి పొందినవాడైతే దాని తినవచ్చును.
పరదేశియు కూలికి వచ్చిన దాసుడును దాని తినకూడదు.
మీరు ఒక్క యింటిలోనే దాని తినవలెను దాని మాంసములో కొంచెమైనను ఇంటిలోనుండి బయటికి తీసికొనిపోకూడదు, దానిలో ఒక్క యెముకనైనను మీరు విరువకూడదు.
ఇశ్రాయేలీయుల సర్వసమాజము ఈ పండుగను ఆచరింపవలెను.
నీయొద్ద నివసించు పరదేశి యెహోవా పస్కాను ఆచరింపగోరినయెడల అతనికి కలిగిన ప్రతి మగవాడు సున్నతి పొందవలెను; తరువాత అతడు సమాజములో చేరి దానిని ఆచరింపవచ్చును. అట్టివాడు మీ దేశములో పుట్టినవానితో సముడగును. సున్నతి పొందనివాడు దానిని తినకూడదు.
దేశస్థునికిని మీలో నివసించు పరదేశికిని దీనిగూర్చి ఒకటే విధి యుండవలెననెను.
ఆయన పరిశుద్ధ నామమునుబట్టి అతిశయించుడి యెహోవాను వెదకువారు హృదయమునందు సంతోషించుదురు గాక.
యెహోవాను ఆశ్రయించుడి ఆయన బలము నాశ్రయించుడి ఆయన సన్నిధి నిత్యము వెదకుడి.
ఎందుకనగా యెహోవా, నీ కార్యముచేత నీవు నన్ను సంతోషపరచుచున్నావు నీచేతిపనులబట్టి నేను ఉత్సహించుచున్నాను.
ఆయననుగూర్చిన నా ధ్యానము ఆయనకు ఇంపుగా నుండునుగాక నేను యెహోవాయందు సంతోషించెదను.
ప్రత్యక్షపు గుడారముయొక్క ద్వారమునొద్దకు సర్వసమాజమును సమకూర్చుమనగా
యూదా వారినందరిని బెన్యామీనీయులనందరిని, ఎఫ్రాయిము మనష్షే షిమ్యోను గోత్రస్థానములలోనుండి వచ్చి వారిమధ్య నివసించు పరదేశులను సమకూర్చెను. అతని దేవుడైన యెహోవా అతనికి సహాయుడై యుండుట చూచి ఇశ్రాయేలువారిలోనుండి విస్తారమైన జనులు అతని పక్షము చేరిరి.