2దినవృత్తాంతములు 30: 3
క్రాస్-రిఫరెన్స్‌లు
" రాజును అతని అధిపతులును యెరూషలేములోనున్న సమాజపువారందరును దానిని రెండవ నెలలో ఆచరింపవలెనని యోచనచేసిరి."
సంబంధిత రిఫరెన్స్‌లు
నిర్దోషమైన యేడాది మగపిల్లను తీసికొనవలెను. గొఱ్ఱలలోనుండియైనను మేకలలోనుండియైనను దాని తీసికొనవచ్చును.
మొదటి నెల పదునాలుగవ దినము సాయంకాలము మొదలుకొని ఆ నెల యిరువది యొకటవ దినము సాయంకాలము వరకు మీరు పులియని రొట్టెలను తినవలెను.
యాజకులు కొద్దిగా ఉన్నందున వారు ఆ దహనబలి పశువులన్నిటిని ఒలువలేకపోగా, పని సంపూర్ణమగువరకు కడమ యాజకులు తమ్మును ప్రతిష్ఠించుకొనువరకు వారి సహోదరులగు లేవీయులు వారికి సహాయము చేసిరి; తమ్మును ప్రతిష్ఠించుకొనుటయందు యాజకులకంటె లేవీయులు యథార్థహృదయులై యుండిరి.
మరియు యెహోవా వారిమీద పడకుండునట్లు యెహోవా యొద్దకు చేరు యాజకులు తమ్ముతామే పరిశుద్ధ పరచుకొనవలెనని మోషేతో చెప్పగా
ఆప్రకారము పస్కా పశువును వధించి మిమ్మును ప్రతిష్ఠించుకొని, మోషేద్వారా యెహోవా యిచ్చిన ఆజ్ఞలను అనుసరించి, దానిని మీ సహోదరులకొరకు సిద్ధపరచుడి.