లేఖనాలను అన్వేషించండి

2దినవృత్తాంతములు 35: 26

క్రాస్-రిఫరెన్స్‌లు

" యోషీయా చేసిన యితర కార్యములన్నిటినిగూర్చియు, యెహోవా ధర్మశాస్త్రవిధుల ననుసరించి అతడు చూపిన భయభక్తులనుగూర్చియు, "

సంబంధిత రిఫరెన్స్‌లు

2దినవృత్తాంతములు 31:20

హిజ్కియా యూదా దేశమంతటను ఈలాగున జరిగించి, తన దేవుడైన యెహోవా దృష్టికి అనుకూలముగాను యథార్థముగాను నమ్మకముగాను పనిచేయుచు వచ్చెను.

2దినవృత్తాంతములు 32:32

హిజ్కియా చేసిన యితర కార్యములనుగూర్చియు, అతడు చూపిన భక్తినిగూర్చియు, ప్రవక్తయును ఆమోజు కుమారుడునగు యెషయాకు కలిగిన దర్శనముల గ్రంథమునందును యూదా ఇశ్రాయేలుల రాజుల గ్రంథమునందును వ్రాయబడియున్నది.

2దినవృత్తాంతములు 34:14

యెహోవా మందిరములోనికి తేబడిన ద్రవ్యమును బయటికి తీసికొనివచ్చినప్పుడు, మోషేద్వారా యెహోవా దయచేసిన ధర్మశాస్త్రము గల గ్రంథము యాజకుడైన హిల్కీయాకు కనబడెను.