2దినవృత్తాంతములు 35: 5
క్రాస్-రిఫరెన్స్‌లు
" జనుల ఆ యా భాగములకు లేవీయులకు కుటుంబములలో ఆ యా భాగములు ఏర్పాటగునట్లుగా మీరు పరిశుద్ధ స్థలమందు నిలిచి, వారి వారి పితరుల కుటుంబముల వరుసలనుబట్టి జనులైన మీ సహోదరులకొరకు సేవచేయుడి."
సంబంధిత రిఫరెన్స్‌లు
యెహోవా సేవకులారా, యెహోవా మందిరములో రాత్రి నిలుచుండువారలారా, మీరందరు యెహోవాను సన్నుతించుడి.
యెహోవా మందిరములో మన దేవుని మందిరపు ఆవరణములలో నిలుచుండువారలారా, యెహోవాను స్తుతించుడి.
కాబట్టి మోషే ఇశ్రాయేలీయుల పెద్దలనందరిని పిలిపించి వారితో ఇట్లనెను మీరు మీ కుటుంబముల చొప్పున మందలోనుండి పిల్లను తీసికొని పస్కా పశువును వధించుడి.
ఈ ప్రకారము సేవ జరుగుచుండగా రాజాజ్ఞనుబట్టి యాజకులు తమ స్థలములోను లేవీయులు తమ వరుసలలోను నిలువబడిరి.
మరియు వారు యెరూషలేములోనున్న దేవుని సేవ జరిపించుటకై మోషే యొక్క గ్రంథమందు వ్రాసినదానినిబట్టి తరగతుల చొప్పున యాజకులను వరుసల చొప్పున లేవీయులను నిర్ణయించిరి.