2దినవృత్తాంతములు 36: 3
క్రాస్-రిఫరెన్స్‌లు
" ఐగుప్తు రాజు యెరూషలేమునకు వచ్చి అతని తొలగించి, ఆ దేశమునకు రెండువందల మణుగుల వెండిని రెండు మణుగుల బంగారమును జుల్మానాగా నిర్ణయించి"
సంబంధిత రిఫరెన్స్‌లు
ఇతడు యెరూషలేములో ఏలుబడి చేయకుండ ఫరోనెకో హమాతు దేశమందున్న రిబ్లా పట్టణమందు అతనిని బంధకములలో ఉంచి, దేశముమీద ఏబది మణుగుల వెండిని, రెండు మణుగుల బంగారమును పన్నుగా నిర్ణయించి
యోషీయా కుమారుడైన ఎల్యాకీమును అతని తండ్రియైన యోషీయాకు మారుగా రాజుగా నియమించి, అతనికి యెహోయాకీమను మారుపేరుపెట్టి యెహోయాహాజు ఐగుప్తు దేశమునకు కొనిపోగా అతడచ్చట మృతిబొందెను.
దేవా, అన్యజనులు నీ స్వాస్థ్యములోనికి చొరబడియున్నారు వారు నీ పరిశుద్ధాలయమును అపవిత్రపరచియున్నారు యెరూషలేమును పాడుదిబ్బలుగా చేసియున్నారు.
నేను ఎన్నాళ్లు ధ్వజమును చూచుచుండవలెను బూరధ్వని నేనెన్నాళ్లు వినుచుండవలెను?
మరియు నీవు ఇశ్రాయేలీయుల అధిపతులనుగూర్చి ప్రలాపవాక్యమునెత్తి ఇట్లు ప్రకటింపుము
దాని విషయమై నా నిర్ణయమంతటిచొప్పున మీ నివాసస్థలము సర్వనాశము కాకుండునట్లు, నాయందు భయభక్తులు కలిగి శిక్షకు లోబడుదురని నేననుకొంటిని గాని వారు దుష్‌క్రియలు చేయుటయందు అత్యాశ గలవారైరి.