2దినవృత్తాంతములు 36: 8
క్రాస్-రిఫరెన్స్‌లు
" యెహోయాకీము చేసిన యితర కార్యములనుగూర్చియు, అతడు హేయదేవతలను పెట్టుకొనుటనుగూర్చియు, అతని సకల ప్రవర్తననుగూర్చియు ఇశ్రాయేలు యూదారాజుల గ్రంథమందు వ్రాయబడియున్నది. అతని కుమారుడైన యెహోయాకీను అతనికి బదులుగా రాజాయెను."
సంబంధిత రిఫరెన్స్‌లు
యెహోయాకీము చేసిన యితర కార్యములనుగూర్చియు, అతడు జరిగించిన దాని నంతటినిగూర్చియు యూదారాజుల వృత్తాంతముల గ్రంథమందు వ్రాయబడియున్నది.
యెహోయాకీము తన పితరులతో కూడ నిద్రించగా అతని కుమారుడైన యెహోయాకీను అతనికి మారుగా రాజాయెను.
యెహోయాకీము కుమారులలో యెకొన్యా అను ఒకడుండెను, అతని కుమారుడు సిద్కియా.
యకొన్యా కుమారులు అస్సీరు షయల్తీయేలు
యెహోవా సెలవిచ్చునదేమనగా యూదా రాజైన యెహోయాకీము కుమారుడగు కొన్యా నా కుడిచేతికి శిఖా ఉంగరముగా ఉండినను దానిమీదనుండియు నిన్ను ఊడదీసివేసెదనని నాతోడని ప్రమాణము చేయుచున్నాను.
కొన్యా అను ఇతడు హేయమైన ఓటికుండ వంటివాడా? పనికిమాలిన ఘటమా? అతడును అతని సంతానమును విసరివేయబడి, తామెరుగని దేశములోనికి ఏల త్రోయబడిరి?
యూదులు బబులోనుకు కొనిపోబడిన కాలములో యోషీయా యెకొన్యాను అతని సహోదరులను కనెను.
బబులోనుకు కొనిపోబడిన తరువాత యెకొన్యా షయల్తీయేలును కనెను, షయల్తీయేలు జెరుబ్బాబెలును కనెను;
అయితే నీ దృష్టియు నీ కోరికయు అన్యాయముగా లాభము సంపాదించుకొనుటయందే, నిరపదాధుల రక్తము ఒలికించుటయందే నిలిచియున్నవి. అందుకొరకే నీవు జనులను బాధించుచున్నావు, అందుకొరకే బలాత్కారము చేయుచున్నావు.